Big Stories

Rahul Gandhi: నా ఫోన్ హ్యాక్.. అది ఊహించలేదన్న రాహుల్‌..

rahul gandhi

Rahul Gandhi: పెగసస్ లాంటి టెక్నాలజీలకు తాను భయపడనన్నారు రాహుల్‌గాంధీ. తన ఫోన్ హ్యాక్ అయిన విషయం తనకు తెలుసన్నారు. ఒకవేళ ప్రభుత్వం ఎవరి ఫోన్‌నైనా ట్యాప్ చేయాలని అనుకుంటే ఎవరూ ఆపలేరని అన్నారు. అమెరికాలో పర్యటిస్తున్న రాహుల్.. శాన్‌ఫ్రాన్సిస్కో, సిలికాన్‌ వ్యాలీలో స్టార్టప్‌ ఎంటర్‌ప్రెన్యూర్లతో మాట్లాడారు. టెక్నాలజీ, డ్రోన్లపై అభిప్రాయాలు చెబుతూ.. తన ఫోన్ హ్యాక్ అయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రాహుల్‌గాంధీ. జేబులోంచి తన ఫోన్ బయటకు తీసి.. ‘హలో మోదీ’ అంటూ కామెడీ చేశారు.

- Advertisement -

అటు, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఎన్నారై స్టూడెంట్స్‌ను ఉద్దేశించి మాట్లాడారు రాహుల్‌గాంధీ. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో లోక్‌సభ సభ్యత్వ రద్దును తాను ఊహించలేదని అన్నారు. ఇలా జరుగుతుందని.. అసలు అనుకోలేదన్నారు. అయితే, సభ్యత్వ రద్దు తనకు లభించిన పెద్ద అవకాశంగా భావిస్తున్నానని చెప్పారు. ఇప్పటి వరకూ తనకు వచ్చిన వాటిలో ఇదే పెద్ద అవకాశమని.. రాజకీయాలంటే ఇలానే ఉంటాయని తెలిపారు.

- Advertisement -

భారత్‌, చైనా సంబంధాలు అంత సులువుకాదన్నారు రాహుల్. భవిష్యత్తులో మరింత కఠినంగా ఉండబోతున్నాయని అభిప్రాయపడ్డారు. భారత్‌ను వెనక్కి నెట్టడం చైనాకు సాధ్యం కాదని తేల్చి చెప్పారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News