BigTV English

Smart gun:- మార్కెట్లోకి స్మార్ట్ గన్.. ఫింగర్ ప్రింట్‌తో అన్‌లాక్..

Smart gun:- మార్కెట్లోకి స్మార్ట్ గన్.. ఫింగర్ ప్రింట్‌తో అన్‌లాక్..

Smart gun:- ప్రస్తుతం మార్కెట్లో అన్నీ స్మార్ట్ పరికరాల హవా నడుస్తోంది. ఒక్క క్లిక్ ఇస్తే చెప్పిన పని చేసే పరికరాలపై ప్రజలు కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే శాస్త్రవేత్తలు కూడా ఇలాంటి స్మార్ట్ పరికరాల తయారీపై ఎక్కువ దృష్టిపెడుతున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి స్మార్ట్ గన్ కూడా చేరనుంది. ప్రస్తుతం ప్రయోగాల దశలో ఉన్న స్మార్ట్ గన్ తయారీ ఏడాదిలోనే మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


అమెరికాలో గన్ కల్చర్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రస్తుతం ఆ దేశంలో తుపాకుల వల్ల పెరుగుతున్న యాక్సిడెంట్లను అదుపు చేయడానికి స్మార్ట్ గన్స్ అనేవి ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. గతేడాదిలో అమెరికాలో ఎక్కువమంది టీనేజర్లు, చిన్నపిల్లలు చనిపోవడానికి తుపాకికి సంబంధించిన యాక్సిడెంట్లే కారణమని ఒక సర్వేలో తేలింది. అందుకే 2024లోపు బయోఫైర్ స్మార్ట్ గన్‌ను మార్కెట్లోకి తీసుకొని రావాలని వారు సన్నాహాలు చేస్తున్నారు.

స్మార్ట్ గన్స్ అనేవి దొంగతనం చేయడం కూడా అంత సులభం కాదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మామూలు గన్స్ అయితే చోరీకి గురవుతాయని, అంతే కాకుండా వాటిని దొంగలించి బ్లాక్ మార్కెట్లో అమ్మేసే అవకాశం ఉందని వారు గుర్తుచేశారు. కానీ స్మార్ట్ గన్స్ అలా కాదంటున్నారు. బయోమెట్రిక్ సిస్టమ్‌తో తయారు చేయబడిన స్మార్ట్ గన్‌ను ఉపయోగించాలంటే ఓనర్ వేలిముద్ర ఉండాలని వారు చెప్తున్నారు. దీని కారణంగా గన్స్ వల్ల జరిగే క్రైమ్స్, హింస తగ్గిపోతాయని వారు భావిస్తున్నారు.


2024లో మార్కెట్లోకి లాంచ్ అవ్వడానికి సిద్ధమయిన స్మార్ట్ గన్.. ప్రస్తుతం ప్రీ ఆర్డర్ కోసం సిద్ధంగా ఉంది. ప్రస్తుతం దీని ధర 1,499 డాలర్లు అని తెలుస్తోంది. ఇది 9 ఎమ్ఎమ్ ఉండే హ్యాండ్ గన్. దీనిని అన్‌లాక్ చేయాలంటే ఫింగర్ ప్రింట్ కావాలి. అంటే ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అవ్వకపోతే స్మార్ట్ గన్‌ను ఉపయోగించడం, దీనిని నుండి పేలుడు జరపడం కష్టమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీని ద్వారా పిల్లలు పొరపాటున గన్‌ను ఉపయోగించడం, దాని వల్ల మరణించడం లాంటి దుర్ఘటనలు అదుపులోకి వస్తాయని భావిస్తున్నారు.

ఫింగర్ ప్రింట్‌తో పాటు ఫేస్ సెన్సార్ కూడా ఈ స్మార్ట్ గన్‌ను అన్‌లాక్ చేయడానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అన్‌లాక్ చేసిన వెంటనే దీనిని ఉపయోగించకపోతే వెంటనే లాక్ అయిపోతుందని అంటున్నారు. ఇంతకు ముందు కూడా ఇలాంటి స్మార్ట్ గన్స్ మార్కెట్లో హల్‌చల్ చేశాయి. ఐగన్ పేరుతో ఇదివరకే ఇవి మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ఐగన్ రింగ్ పేరుతో ఉండే స్పెషల్ రింగ్‌తో మాత్రమే దీనిని అన్‌లాక్ చేయగలిగేవారు. ఇప్పుడు దీనిని ఫింగర్ ప్రింట్‌గా మార్చి మరో ప్రైవేట్ సంస్థ స్మార్ట్ గన్స్‌ను సరికొత్తగా లాంచ్ చేయనుంది.

Related News

iPhone 17 iOS: ఐఫోన్ 17 యూజర్స్‌కు హెచ్చరిక.. వెంటనే ఆ పని చేయాలని చెప్పిన ఆపిల్

OPPO Mobile: ఫాస్ట్ చార్జింగ్, ఆకర్షణీయమైన డిజైన్.. డైలీ యూజ్ కోసం ప్రీమియం స్మార్ట్‌ఫోన్

Galaxy Ring Swell: శామ్‌సంగ్ గెలాక్సీ రింగ్‌తో డేంజర్.. వాచిపోయిన వేలితో ఆస్పత్రిపాలైన యూజర్

Credit Card Record: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండుగ సేల్ ఎఫెక్ట్.. రూ.1.2లక్ష కోట్లు దాటేసిన క్రెడిట్ కార్డ్ షాపింగ్!

Realme Mobile: దసరా సంబరంలో రియల్‌మీ స్టైలిష్ టెక్ మాస్టర్‌పీస్.. డ్యూరబుల్ డిజైన్‌తో సూపర్ డీల్

Budget Bikes: అమ్మతోడు.. ఈ ఆఫర్లు తెలిస్తే ఇప్పుడే బైక్ షోరూంకి వెళ్లి కొనేస్తారు

Smart TV Offers: దసరాకి దుమ్ము రేపుతున్న ఆఫర్లు.. 70mm స్క్రీన్ కూడా ఈ టీవీల ముందు వేస్ట్ భయ్యా..

Flipkart Offers: ఫ్లిప్ కార్ట్ లాస్ట్ డేస్ డీల్స్ అప్‌డేట్.. టైం దాటితే ఆఫర్లు అయిపోతాయ్..

Big Stories

×