E-Paper
Advertisement

వన్ ప్లస్, షావోమీ, రియల్‌మీ.. భారీగా పెరిగిన మెుబైల్స్ ధరలు.. ఏ మోడల్‌పై ఎంతంటే?

వన్ ప్లస్, షావోమీ, రియల్‌మీ.. భారీగా పెరిగిన మెుబైల్స్ ధరలు.. ఏ మోడల్‌పై ఎంతంటే?
Advertisement

Smartphone Price Hike 2026: ఏప్రిల్ 1 తర్వాత మెుదలైన కొత్త ఆర్థిక సంవత్సరం.. మెుబైల్ ప్రియులపై ఆర్థిక భారాన్ని మోపింది. టాప్ కంపెనీలు.. తమ మెుబైల్స్ ధరను అమాంతం పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఇప్పటికే పలు కంపెనీలు.. పెంచిన ధరలతో కొత్త ఎం.ఆర్.పీ ధరలను సైతం విడుదల చేశాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ మెుబైల్ బ్రాండ్స్ అయిన వన్ ప్లస్, రియల్ మీ, షావోమి.. ఏ మోడల్స్ పై ఎంత పెంచిందో ఈ కథనంలో పరిశీలిద్దాం.

రియల్ మీ స్మార్ట్ ఫోన్స్

ప్రముఖ మెుబైల్ బ్రాండ్ రియల్ మీ.. రూ.10,000 నుంచి రూ.40,000 వరకూ ధర కలిగిన మోడల్స్ ధరలను అమాంతం పెంచింది. దీంతో ఒక్కో మోడల్ పై రూ.1000 నుంచి రూ.3,000 వరకు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. Realme సీ71 4జీ, సీ83 5జీ, 15ఎక్స్ 5జీ, 15టీ 5జీ, పీ4 ప్రో 5జీ, 15 5జీ, 16 ప్రో 5జీ మోడల్స్ పై రూ.1000 చొప్పున రేటు పెరిగింది. అలాగే realme P3 Ultra 5G ఫోన్ వేరియంట్ ను బట్టి రూ.2,500-3000 వరకూ పెంచింది.

షావోమి లేదా రెడ్‌మి మెుబైల్స్

Advertisement

చైనాకు చెందిన ఈ టెక్ బ్రాండ్.. తన రెడ్ మీ 15, రెడ్ మీ నోట్ 15 సిరీస్ మోడల్స్ పై రూ.1500 నుంచి రూ.3000 వరకూ ధర పెంచింది. ముఖ్యంగా Redmi 15C 5G మోడల్ ధరపై రూ.1,500 పెరిగింది. లాంచ్ సమయంలో రూ.13,999 గా ఉన్న ఈ ఫోన్ ధర.. ఇప్పుడు రూ.15,499కి చేరింది. అలాగే Redmi Note 15 5G వంటి మోడల్స్ ధరలు కూడా దాదాపు రూ.3,000 వరకు పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.

వన్ ప్లస్ ఫోన్స్..

వన్ ప్లస్ విషయానికి వస్తే.. రియల్ మీ, రెడ్ మీ స్థాయిలో ఈ సంస్థ ధరలను పెంచలేదు. తన లేటెస్ట్ 15R సిరీస్ పై మాత్రమే ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వన్‌ప్లస్ 15ఆర్ (12GB+256GB, 12GB+512GB) వేరియంట్లపై రూ.2,500 చొప్పున వన్ ప్లస్ ధరలను పెంచేసింది. అయితే భవిష్యత్తులో మరిన్ని ఫోన్లను ఈ ధరల పెంపు పరిధిలోకి తీసుకొస్తుందా? లేదా? అన్నది చూడాలి.

Advertisement

Also Read: రూ.80 లక్షల జీతం, అమెరికాలో ఇల్లు.. అయినా టెక్కీ జంట సూసైడ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

ధరల పెరుగుదలకు కారణాలేంటి?

ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ ప్రకారం.. అంతర్జాతీయంగా సెమీకండక్టర్లు, మెమరీ చిప్‌ల కొరత ఏర్పడింది. దీంతో మెుబైల్స్ తయారీ వ్యయం భారీగా పెరిగిపోయినట్లు తెలుస్తోంది. ఫలితంగా ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్ల ధరలు సగటున 10 శాతం నుంచి 15 శాతం వరకు పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో శాంసంగ్, వివో, ఒప్పో వంటి కంపెనీలు కూడా తమ మోడల్స్‌పై ధరలను పెంచే సూచనలు కనిపిస్తున్నట్లు టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Also Read: అయ్యబాబోయ్.. ఏసీ, టీవీ, మెుబైల్స్‌పై భారీ తగ్గింపు.. 60% తక్కువకే పట్టుకెళ్లొచ్చు..!

Related News

బడ్జెట్ ధరలో.. బెస్ట్ వాషింగ్ మెషీన్ హయర్ 6.5 కేజీ టాప్ లోడ్ రివ్యూ?

రూ.20వేలలోపు శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G.. ఫోన్ అంటే ఇలా ఉండాలి బాస్

స్టూడెంట్స్ అండ్ యూత్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

Big Stories

Advertisement
×