E-Paper
Advertisement

పెరిగిన ఫీజులు.. మారని టీచర్ల బతుకులు.. ప్రైవేట్ స్కూళ్ల తీరుపై కవిత ఆగ్రహం

పెరిగిన ఫీజులు.. మారని టీచర్ల బతుకులు.. ప్రైవేట్ స్కూళ్ల తీరుపై కవిత ఆగ్రహం

Telangana Jagruthi: తెలంగాణలో ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా వేడెక్కింది. సామాన్య మధ్యతరగతి తల్లిదండ్రులపై పడుతున్న ఈ భారానికి వ్యతిరేకంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గళమెత్తారు.

ప్రైవేట్ స్కూళ్లలో ‘ఫీజుల దందా’.. కవిత ఆగ్రహం
రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు పెంచుతూ సామాన్యులను దోచుకుంటున్నాయని కల్వకుంట్ల కవిత తీవ్రంగా మండిపడ్డారు. ఈ విద్యాసంవత్సరం సుమారు 12,061 ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులను ఏకపక్షంగా 25 నుంచి 30 శాతం వరకు పెంచేశారని ఆమె ధ్వజమెత్తారు. ప్రభుత్వం పర్యవేక్షణ లేకపోవడంతోనే విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని, ఇది అక్షరాలా విద్యా వ్యాపారమేనని ఆమె విమర్శించారు.

రేవంత్ సర్కార్‌కు సూటి ప్రశ్న
గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫీజుల నియంత్రణ చట్టం గురించి గొంతెత్తిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ అంశాన్ని పూర్తిగా విస్మరించడం విచారకరమని కవిత వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఫీజుల నియంత్రణపై చర్చ జరపకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆమె ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, ఇప్పుడు కార్పొరేట్ శక్తులకు వత్తాసు పలుకుతున్నారా? అని ఆమె ప్రభుత్వాన్ని నిలదీశారు.

పెరిగిన ఫీజులు.. తగ్గని టీచర్ల గోస..
పాఠశాల యాజమాన్యాలు భవనాల నిర్వహణ, ఇతర ఖర్చుల పేరుతో వేల రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నా, అక్కడ పనిచేసే ఉపాధ్యాయుల పరిస్థితి మాత్రం దారుణంగా ఉందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజులు భారీగా పెంచుతున్న యాజమాన్యాలు, బోధనా సిబ్బందికి మాత్రం నామమాత్రపు జీతాలే ఇస్తున్నాయని దుయ్యబట్టారు. లాభాలన్నీ యాజమాన్యాల జేబుల్లోకి వెళ్తుంటే, విద్యా వ్యవస్థను నడిపే టీచర్లు మాత్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని ఆమె పేర్కొన్నారు.

ప్రత్యేక అసెంబ్లీకి డిమాండ్.. ఆందోళన బాట!
ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు తక్షణమే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి, సమగ్రమైన చట్టాన్ని తీసుకురావాలని కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపశమనం కలిగించకపోతే, తాము ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల ముందు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని ఆమె స్పష్టం చేశారు.

Also Read: గ్రూప్‌-1 అభ్యర్థులకు బిగ్ రిలీఫ్.. సుప్రీంకోర్టు తీర్పుతో క్లియర్ అయిన అడ్డంకులు!

రాష్ట్ర దౌర్భాగ్యం అదే.. కవిత ఘాటు వ్యాఖ్యలు
రాష్ట్రంలోని కీలక శాఖలన్నీ ముఖ్యమంత్రి వద్దే ఉండటాన్ని కవిత తప్పుబట్టారు. “అన్ని శాఖలకు ముఖ్యమంత్రే మంత్రిగా ఉండటం రాష్ట్ర దౌర్భాగ్యం” అని ఆమె వ్యాఖ్యానించారు. దీనివల్ల పాలనపై పట్టు తప్పుతోందని, విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించే నాథుడే లేకుండా పోయాడని విమర్శించారు. విద్యాసంస్థల నియామకాల్లో తెలంగాణ వారికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, స్థానిక నిరుద్యోగుల ప్రయోజనాలను కాపాడాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×