Smartphones Launching Today: ఏప్రిల్ 2025 టెక్ ప్రేమికులకు పండుగలా మారనుంది. బడ్జెట్ ఫోన్ల నుంచి మిడ్-రేంజ్ డివైస్‌ల వరకు పలు కంపెనీలు తమ తాజా స్మార్ట్‌ఫోన్లను ఈ నెలలో లాంచ్ చేయబోతున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ 15న రెండు కీలక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు కొత్త మోడల్స్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నాయి. ఇందులో ముఖ్యంగా Redmi, Acer బ్రాండ్‌లకు చెందిన ఫోన్లు భారత మార్కెట్‌లో ప్రవేశించనున్నాయి. ఈ లాంచ్‌లు టెక్ ప్రపంచంలో ఆసక్తికర చర్చనీయాంశాలుగా మారాయి. ఈ సందర్భంగా ఈ ఫోన్ల వివరాలను సమగ్రంగా పరిశీలిద్దాం.
Redmi A5
-లాంచ్ తేదీ: ఏప్రిల్ 15, 2025 – మధ్యాహ్నం 12 గంటలకు
Redmi A సిరీస్ గతంలో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఆ సిరీస్ నుంచి తాజాగా Redmi A5 రాబోతోంది. ఇది సాధారణ వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఫోన్. తక్కువ ధరలో మెరుగైన ఫీచర్లను అందించేందుకు సిద్ధమైంది.
డిస్‌ప్లే
6.88-అంగుళాల HD+ డిస్‌ప్లే. ఇది భారీ సైజుతో ఉండి వీడియోలు చూడటానికి, గేమింగ్‌కు మంచి అనుభూతిని ఇస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఇది చాలా అరుదైన విషయం. బడ్జెట్ ఫోన్‌లో 120Hz డిస్‌ప్లే అంటే స్క్రోలింగ్, యాప్ స్విచింగ్ సమయంలో స్మూత్ అనుభవాన్ని అందిస్తుంది. స్ప్లిట్ గ్రిడ్ డిజైన్ – ఫోన్ వెనుక భాగంలో ప్రత్యేకమైన డిజైన్ చూడవచ్చు. ఇది ఇతర ఫోన్లతో పోలిస్తే అందమైన లుక్‌ను ఇస్తుంది.
కలర్ ఆప్షన్లు: కూల్ బ్లూ, డెసర్ట్ గోల్డ్, పవర్ బ్లాక్
ఈ మూడు రంగుల్లో Redmi A5 అందుబాటులో ఉండనుంది. ఫ్యాషన్‌తో పోటీ పడేలా కలర్ వేరియంట్లు ఉన్నాయి.
ప్రాసెసర్, RAM, బ్యాటరీ (ఆఫీషియల్ కాన్ఫర్మేషన్ లేదు):
ఇప్పటివరకు ప్రాసెసర్, RAM, స్టోరేజ్, బ్యాటరీ వివరాలు లీక్ కాలేదు. అయితే గత Redmi A సిరీస్‌ను బట్టి చూస్తే, ఇది MediaTek Helio G సిరీస్ లేదా Qualcomm Snapdragon 4 సిరీస్ ప్రాసెసర్‌తో రావొచ్చు. అలాగే కనీసం 4GB RAM, 64GB స్టోరేజ్ కలిగి ఉండే అవకాశం ఉంది. బ్యాటరీ విషయానికొస్తే 5000mAh బ్యాటరీ అయితే పెద్ద సర్ప్రైజ్ కాదంటున్నారు.
ధర అంచనా:
Redmi A5 ధర దాదాపుగా రూ.7,000 – రూ.9,000 మధ్య ఉండే అవకాశం ఉంది. అయితే లాంచ్ తర్వాత పూర్తి వివరాలు తెలియనున్నాయి.
Read Also: Meta Breakup: మెటాకు షాక్.. ఈ తీర్పుతో వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ …
Acer Super ZX సిరీస్ – సర్‌ప్రైజ్ ఎంట్రీ!
లాంచ్ తేదీ: ఏప్రిల్ 15, 2025
Acer సాధారణంగా ల్యాప్‌టాప్, మానిటర్ల కోసం ప్రసిద్ధి చెందింది. కానీ మొబైల్ రంగంలోనూ తమ పరిజ్ఞానాన్ని ప్రదర్శించేందుకు సిద్ధమవుతోంది. Acer Super ZX సిరీస్ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది.
సిరీస్ పేరు:
Acer Super ZX – ఇందులో “Super” అన్న పదం ఆధునిక ఫీచర్లను సూచించొచ్చు. “ZX” అనేది ప్రొడక్టివ్, గేమింగ్ యూజర్లకు అనుకూలంగా ఉండేలా ఉన్నట్లే తెలుస్తోంది. సెగ్మెంట్: మిడ్-రేంజ్ లేదా బడ్జెట్ సెగ్మెంట్ అని భావిస్తున్నారు. అంటే రూ.10,000 – రూ. 20,000 మధ్య ఉండే ధరలో ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఫీచర్లు: స్పెసిఫికేషన్‌లు పూర్తిగా బయట పడకపోయినా, Acer సిరీస్‌లో స్నాప్‌డ్రాగన్ 6 సిరీస్ ప్రాసెసర్, 90Hz లేదా 120Hz డిస్‌ప్లే, డ్యుయల్ కెమెరా సెటప్, 5000mAh బ్యాటరీ వంటి ఫీచర్లను అందించే అవకాశం ఉంది. Acer స్మార్ట్‌ఫోన్‌లు విద్యార్థులు, గేమింగ్ ప్రియులు, డైలీ యూజర్ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడ్డాయన్న భావన ఉంది.
ఎందుకు ప్రత్యేకం?
Acer బ్రాండ్ ఇప్పటికే టెక్ ప్రొడక్ట్స్‌లో ట్రస్ట్ విన్ చేసింది. ఇప్పుడు అదే నాణ్యతను మొబైల్‌లోనూ తీసుకురావాలనుకుంటోంది. పోటీ బ్రాండ్‌లకు గట్టి షాక్ ఇస్తుందా లేదా అనేది వేచి చూడాలి మరి.
iQOO Z10 సేల్
iQOO బ్రాండ్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ సంచలనంగా మార్కెట్‌లోకి రాబోతోంది. ఏప్రిల్ 16, 2025 నుండి iQOO Z10 అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ప్రీమియం ఫీచర్లు, బడ్జెట్ ధరలో ఈ ఫోన్ ఆకట్టుకునేలా తయారైంది. ఈ ఫోన్‌లో 6.72-అంచుల FHD+ 120Hz డిస్‌ప్లే వుంటుంది. Snapdragon 6 Gen 1 ప్రాసెసర్, దీని వల్ల గేమింగ్, మల్టీటాస్కింగ్ స్మూత్‌గా సాగుతుంది. 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్‌తో మొదలవుతుంది. 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌తో ఫొటోగ్రఫీకి పర్ఫెక్ట్. ముందు 16MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5000mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లతో వస్తుంది.Android 14 బేస్‌డ్ Funtouch OSతో రన్ అవుతుంది. ధర సుమారు రూ.13,999 ఉండొచ్చు. ఫ్లిప్‌కార్ట్, iQOO అధికార వెబ్‌సైట్‌లో ఏప్రిల్ 16 నుంచి సెల్ ప్రారంభం కానుంది.
వచ్చే లాంచ్‌లు
ఇతర కంపెనీలు కూడా ఏప్రిల్ నెలలో వారి స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ఒకటి Vivo T4 5G. ఇది ఏప్రిల్ 22న లాంచ్ కానుంది. మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో పోటీగా ఈ ఫోన్ రాబోతోంది.
Vivo T4 5G (ఏప్రిల్ 22, 2025):
5G కనెక్టివిటీ
-AMOLED డిస్‌ప్లే
-64MP ప్రధాన కెమెరా
-Qualcomm Snapdragon 695 ప్రాసెసర్
-5000mAh బ్యాటరీ & 44W ఫాస్ట్ చార్జింగ్
ధర అంచనా:
రూ.14,000 – రూ.17,000 మధ్య ఉండొచ్చు. ఈ ఫోన్ కూడా యువతకు ఆకట్టుకునేందుకు సిద్ధమైంది.
మొత్తంగా చూస్తే…
ఏప్రిల్ 15 టెక్ దినోత్సవంగా మారబోతోంది. Redmi A5 మాదిరిగానే Acer సిరీస్ కూడా వినియోగదారుల్లో ఆసక్తిని రేపుతున్నాయి. బడ్జెట్ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నవారికి Redmi A5 బెస్ట్ ఎంప్షన్ అవుతుంది. మొబైల్ మార్కెట్ అంటే కేవలం ఫీచర్ల పోటీ మాత్రమే కాదు. బ్రాండ్ ట్రస్ట్, అప్డేట్స్, ధరలో సమతుల్యత అవసరం. ఈ మూడు విషయాల్లో ఎవరు అగ్రగామిగా నిలుస్తారో వేచి చూడాలి.