BigTV English
Advertisement

Honor Killing In AP: కులాంతర వివాహం.. కాటేసిన కన్నోరు, చిత్తూరులో పరువు హత్య

Honor Killing In AP: కులాంతర వివాహం.. కాటేసిన కన్నోరు, చిత్తూరులో పరువు హత్య

Honor Killing In AP: కొడుకు పుడితే మంచిదని తల్లిదండ్రులు అనుకునేవారు. వారసత్వం ఉంటుందని భావించేవారు. ట్రెండ్ మారింది.. కొడుకు కంటే కూతురే బెటరని అంటున్నారు. అలాగే కష్టపడి చదివిస్తున్నారు కూడా. కాకపోతే.. తెలిసీ తెలియని వయస్సులో దగ్గరైన మనసుతో ఒక్కటవుతున్నారు. కులాల గురించి పట్టించుకోకుండా పెళ్లి చేసుకుంటున్నారు. తల్లిదండ్రుల ఆగ్రహానికి గురవుతారు. పరువు తీసిందని చంపేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి చిత్తూరులో వెలుగు చూసింది.


కూతురు కులాంతర వివాహం చేసుకుందని పగతో రగలిపోయారు కన్న తల్లిదండ్రులు. గుట్టుగా బతుకున్న కుటుంబాన్ని బజారులోకి తెచ్చిందని ఆగ్రహానికి గురయ్యారు. ఎన్నో నిద్రలేని రాత్రిళ్లు గడిపారు. పైగా  ఇరుగు పొరుగువారు మీ కూతురు కులాంతర వివాహం చేసుకుందని అనడంతో మరింత రగిలిపోయారు.  ఇరుగుపొరుగువాళ్ల మాటలు సూదిల మాదిరిగా ఆ తల్లిదండ్రులు పొడిచాయి. ఈ సమస్యకు ఎలాగైనా ఫుల్‌స్టాప్ పెట్టాలని భావించారు. చివరకు సామ, దాన, భేద పాయము ఉపయోగించారు. పెళ్లయిన కూతుర్ని ఇంటికి రప్పించిన గంటలోపే కిరాతకంగా చంపేశారు.

స్టోరీలోకి వెళ్తే.. 


చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని ఓ గ్రామానికి చెందిన సాయి తేజ బీటెక్ చదివాడు. పొరుగున ఉన్న బాలాజీనగర్‌కు చెందిన యాస్మిన్ బాను ఎంబీఏ పూర్తి చేసింది. కాలేజీ రోజుల్లో సాయితేజ-యాస్మిన్ మధ్య పరిచయం మొదలైంది. కాలక్రమేణా అది ప్రేమగా మారింది. దాదాపు నాలుగేళ్లుగా ప్రేమ వ్యవహారం నడిచింది. మేజర్లు కావడం, చదువులు పూర్తి కావడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఈ విషయాన్ని ఇంట్లో ప్రస్తావించింది అమ్మాయి. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సాయితేజతో వివాహానికి యాస్మిన్ బాను తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. ఈ పెళ్లికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని తెగేసి చెప్పేవారు.

ALSO READ: భర్తే యముడు.. 8 నెలల గర్భిణీని చంపేశాడు

తల్లిదండ్రుల నుంచి అడ్డంకులు ఎదురవుతాయని ఊహించలేదు యాస్మిన్ బాను. తల్లిదండ్రులను ఎదిరించి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది యాస్మిన్ బాబు. చివరకు ఫిబ్రవరి 9న నెల్లూరులో సాయితేజని ప్రేమ వివాహం చేసుకుంది. తల్లిదండ్రుల ఆలోచనను ముందే గమనించిన యాస్మిన్, పెద్దలు పెళ్లికి అంగీకరించలేదని, తమకు ప్రాణహాని ఉందంటూ తిరుపతి పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

స్టేషన్ చేరిన పంచాయితీ

తమకు రక్షణ కల్పించాలని ప్రేమ జంట కోరింది. ఈ నేపథ్యంలో తిరుపతి డీఎస్పీ ఇరుకుటుంబాలను పిలిచి మాట్లాడారు. యాస్మిన్ బాను తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇక్కడి వరకు స్టోరీ బాగానే సాగింది. అసలు కథ ఇక్కడే మొదలైంది. ఇంటి వ్యవహారాన్ని స్టేషన్ వరకు తీసుకొచ్చింది ఆగ్రహానికి గురయ్యారు యాస్మిన్ పేరెంట్స్.

సాయితేజ-యాస్మిన్ బాను సంసారం మెల్లగా సాగుతోంది. అదే సమయంలో యాస్మిన్‌కు కుటుంబసభ్యులు ఫోన్ చేసి మాట్లాడడం మొదలుపెట్టారు. తల్లిదండ్రులు తన పెళ్లిని అంగీకరించిందని సంబర పడిపోయింది యాస్మిన్ బాను. కొద్దిరోజుల తర్వాత తండ్రి షౌకత్ అలీకి ఆరోగ్యం సరిగా లేదని కూతురికి ఫోన్‌లో చెప్పారు. యాస్మిన్ బాను పంపాలని సాయి తేజ్ కుటుంబ సభ్యులు కోరడంతో అంగీకరించారు.

ఆదివారం ఉదయం పదకొండున్నరకు యాస్మిన్ భానును సాయి తేజ్ చిత్తూరుకు తీసుకొచ్చాడు. వెంటనే ఆమె సోదరుడు కారులో ఇంటికి తీసుకెళ్లాడు. కూతురు ఇంటికి వచ్చిన గంటలోపే చంపేశారు కుటుంబసభ్యులు. యాస్మిన్‌కు ఆమె భర్త ఫోన్ చేస్తే కలవడం లేదు. దీంతో అనుమానం వచ్చిన సాయితేజ్ నేరుగా అత్తింటికి వెళ్లాడు. యాస్మిన్ బాను ఆత్మహత్య చేసుకుందని, ఆమె బాడీ ఆసుపత్రిలో ఉందని చెప్పడంతో షాకయ్యారు ఆమె భర్త.

భార్య శవాన్ని చూసి కన్నీరుమున్నీరు అయ్యాడు సాయి తేజ్. దీనిపై సాయి ఫ్యామిలీ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. భర్త ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు అయ్యింది. ఆ ఘటన తర్వాత యాస్మిన్ బాను కుటుంబసభ్యులను పలిచేందుకు పోలీసులు వెళ్లారు. అప్పటికి వారు పరారీలో ఉన్నారు. త్వరలో వారిని అరెస్టు చేస్తామని చెబుతున్నారు. మతాలు వేరని తమ పెళ్లిని వ్యతిరేకించారని, ఏకంగా హత్య చేశారని అంటున్నాడు సాయితేజ్. యాస్మిన్ బాను మృతదేహానికి పోస్టుమార్టం పూర్తికావడంతో డెడ్ బాడీని బంధువులకు అప్పగించారు పోలీసులు.

Related News

Chittoor Leopard Attack: చిరుతపులి దాడిలో లేగదూడ మృతి.. భయాందోళనలో గ్రామస్థులు

Ahmedabad Crime: దృశ్యం మూవీ తరహాలో.. భర్తని చంపి వంట గదిలో పూడ్చింది, ఆ తర్వాత..

Sangareddy News: చీమల భయం.. అనుక్షణం వెంటాడాయి, నావల్ల కాదంటూ వివాహిత ఆత్మహత్య

Road Accident: బీచ్‌కి వెళ్లి వస్తూ.. బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం అక్కడికక్కడే ఇద్దరు మృతి

Hyderabad News: సహజీవనం.. డ్రగ్స్‌ తీసుకున్న జంట.. ఓవర్ డోస్‌తో ఒకరు మృతి, మరొకరి పరిస్థితి

Hyderabad News: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. నలుగురు చిక్కారు, మరి డ్రోన్ల మాటేంటి?

Bus Fire Accident: మరో ఘోర ప్రమాదం.. మంటల్లో కాలిబూడిదైన ఆర్టీసీ బస్సు

Bus Accident: రాష్ట్రంలో మరో బస్సుప్రమాదం.. పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, స్పాట్‌లో ముగ్గురు..?

Big Stories

×