Allu Arjun x Rajamouli Worldwide Sensation: పుష్ప చిత్రాలతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. రాజమౌళితో సినిమా చేస్తే పాన్ ఇండియా స్టార్ అన్నట్టు ఉండేది. కానీ, జక్కన్నతో మూవీ లేకుండ బన్నీ.. ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు పొందాడు. పుష్ప మూవీ సృష్టించిన సంచలనం అంత ఇంత కాదు. పార్ 2 అయితే ఏకంగా ఇండస్ట్రీ రికార్డును నెలకొల్పింది. అత్యధిక వసూళ్లు సాధించిన రెండో ఇండియన్ మూవీగా పుష్ప 2 నిలిచింది. ఇక దర్శకు ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్సాల్సిన పని లేదు. జీవితకాలంలో ఓ నటుడు ఆస్కార్ అవార్డు కోసం ఎలా కలలు కట్టాడో.. ఇప్పుడు జక్కన్నతో ఓ సినిమా చేయాలని ఎదురుచూస్తున్నారు.
‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత రాజమౌళి అల్లు అర్జున్తో మూవీ చేస్తాడని అంతా అనుకున్నారు. ఎందుకంటే పుష్పతో బన్నీ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఆర్ఆర్ఆర్, పుష్పల తర్వాత వీరిద్దరి కలయిక ఉండబోతుందని అంతా అనుకున్నారు. అదే టాక్ కూడా వినిపించింది. వీరిద్దరి కలయికపై ఎప్పుడెప్పుడు ప్రకటన వస్తుందా ఫ్యాన్స్ అంత ఆసక్తిగా ఎదురుస్తున్న టైంలో రాజమౌళి మహేష్తో మూవీ ప్రకటించారు. ఇటూ బన్నీ.. తమిళ్ డైరెక్టర్ కమిటైయ్యాడు. దీంతో ఇప్పుట్లో అల్లు అర్జున్–రాజమౌళి మూవీ ఇప్పుట్లో వచ్చే అవకాశం లేదు. దీంతో అల్లు ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు.
వీరిద్దరి కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తే.. అది వరల్డ్ వైడ్ సెన్సేషన్ అవుతుందని, ఆ టైం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ, ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ఇప్పుట్లో ఈ కాంబో సెట్ అయ్యేలా కనిపించడం లేదు. దీంతో ఫ్యాన్స్ కల.. కలగా మిగిలిపోతుందేమో అని భయపడుతున్నారు. అయితే రాజమౌళి–అల్లు అర్జున్ కాంబో అభిమానులకు డ్రీమ్ ప్రాజెక్ట్ అనడంలో సందేహం లేదు. ఒకవేళ డ్రీమ్ ప్రాజెక్ట్ కనుగా నిజమైతే మాత్రం అది.. వీరిద్దరి కాంబోలో వచ్చే ఈ ప్రాజెక్ట్ తెలుగు సినీ పరిశ్రమ హిస్టరీనే తిరగరాస్తుందట. ఈ సినిమా పక్కాగా గ్లోబల్ సెన్సేషన్‌గా అవుతుందనడంలో సందేహం లేదు. రాజమౌళి దర్శకత్వం అల్లు అర్జున్ స్టార్ పవర్ భారీ విజయాన్ని అందిస్తుందనడంలో ఏమాత్రం అనుమానం లేదు. అందుకే వీరిద్దరి కాంబో త్వరలోనే సెట్ అవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు.
కానీ, ఇప్పట్లో ఈ కాంబో సెట్ అయ్యాలా కనిపించడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం జక్కన్న మహేష్ బాబుతో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు. ఇది రెండు భాగాలుగా వస్తుందని సమాచారం. తొలి పార్ట్ ఇంకా షూటింగ్ దశలో ఉంది. జక్కన్న సినిమా అంటే తెలిసిందే.. ఒక ప్రాజెక్ట్ మినిమమ్ మూడు సంవత్సరాలు తీసుకుంటాడు. అదే రెండు భాగాలు అయితే.. కనీసం ఐదేళ్లు అయినా పడుతుంది. మహేష్తో సినిమా తర్వాత రాజమౌళి తన డ్రీం ప్రాజెక్ట్ మహాభారతంపై ఫోకస్ పెట్టనున్నాడు. దీని ప్రీ ప్రొడక్షన్ వర్క్‌కే ఆయన కనీసం రెండు మూడేళ్లు తీసుకోనున్నాయి. దీనిక తర్వాత ఆయన రిటైర్మెంటే అంటున్నారు. మరి ఇలాంటి టైంలో అల్లు అర్జున్– రాజమౌళి మూవీ వస్తుందనే ఆశ కనిపించడం లేదు. ఒకవేళ మహాభారతం బన్నీకి ఓ కీలక రోల్ ఉండోచ్చు.