SMS Scam Check| మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ గుర్తు తెలియని నెంబర్లతో మెసేజ్(SMS)లు వస్తుంటాయి. ఈ మెసేజ్‌లలో కొన్ని మోసపూరిత లింక్స్ ఉంటాయి. వీటిని క్లిక్ చేసిన వెంటనే సైబర్ దొంగలు మీ ఫోన్ హ్యాక్ చేసి అందులోని డేటా చోరీ చేస్తారు. ఆ తరువాత మీ మొబైల్ నెంబర్ లింక్ ఉన్న బ్యాంక్ ఖాతాను ఖాళీ చేస్తారు. అంతేకాదు మీ ఫోన్ లో సేవ్ అయిన సోషల్ మీడియా అకౌంట్స్ (ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ x, జి మెయిల్) పాస్ వర్డ్‌లు కూడా కాజేస్తారు. అందుకే SMS వచ్చిన వెంటనే ఆ మెసేజ్ ఎవరు పంపారు. దాని ఉద్దేశం ఏమిటో తెలుసుకోవాలి. దీనికి సంబంధించిన కొన్ని ట్రాయ్ నియమాలున్నాయి. 2025 నుంచి ఈ నియమాలు అమలులో ఉన్నాయి.
చాలాసార్లు మెసేజ్ పంపిన నెంబర్ ఒక మొబైల్ నెంబర్ ఉండదు. కొన్ని ఆల్ఫబెట్స్ ఉంటాయి. అప్పుడు ఆ సెండర్ నెంబర్ చివర P, S, T, G లాంటి అక్షరాలు ఉంటాయి. వాటి ద్వారా ఆ SMS ఎవరు పంపారో తెలుసుకోవచ్చు.
సెండర్ నెంబర్‌లో చివరిలో ఉండే ప్రతి అక్షరం ఆ మెసేజ్ రకాన్ని తెలుపుతుంది.
మెసేజ్ సెండ్ చేసిన నెంబర్ చివర P ఉంటే అది ప్రమోషనల్ మెసేజ్ అని అర్థం. కంపెనీలు తమ ఉత్పత్తులు మార్కెటింగ్ కోసం ఈ మెసేజ్‌లను పంపుతాయి. ఉదాహరణకు AD-ZOMATO-P అని ఉంటే జొమాటో కంపెనీ తమ ఆఫర్ల గురించి యూజర్‌కు సమాచారం అందించేందుకు ఆ మెసేజ్ పంపినది అని అర్థం. అయితే సైబర్ మోసగాళ్లు.. ఇలాంటి ప్రమోషనల్ SMSలతోనే స్కామ్ చేస్తారు. ఇలాంటి మెసేజ్‌లలో లింక్స్ ఉంటాయి. వాటిని క్లిక్ చేస్తే మరిన్ని ఆఫర్లు తెలుస్తాయని యూజర్‌కు ఆశ చూపుతారు. అందుకే లింక్స్ క్లిక్ చేసే ముందు జాగ్రత్త వహించాలి.
చివరగా S అక్షరం వస్తే అవి కస్టమర్ సర్వీస్ మెసేజ్ అని అర్థం. డెలివరీ అప్‌డేట్స్, రీఛార్జ్ రిమైండర్లు, కస్టమర్ సర్వీస్ నోటిఫికేషన్లు ఇలాగే వస్తాయి. ఉదాహరణకు JD-JIOINF-S అని ఉంటే జియో కంపెనీ తమ యూజర్లకు సర్వీస్ గురించి మెసేజ్ పంపుతుంది. మీ రీఛార్జ్ ప్లాన్ గడువు ముగియనుందని మెసేజ్ వస్తుంది.
బ్యాంక్ OTPలు, పేమెంట్ కన్ఫర్మేషన్లు వంటివి. ఇవి ఫైనాన్షియల్, సెక్యూర్ మెసేజ్‌లు. చాలా సురక్షితమైనవి.
ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ల నుంచి వచ్చే అలర్ట్‌లు, స్కీమ్‌లు, అధికారిక సమాచారం ఇవే.
ఇటీవల స్పామ్, ఫ్రాడ్ మెసేజ్‌లు ఎక్కువయ్యాయి. బ్యాంక్‌లు, కంపెనీల పేరుతో సైబర్ దొంగలు ఫేక్ మెసేజ్‌లు పంపుతున్నారు. దీన్ని అరికట్టడానికి TRAI ఈ క్లాసిఫికేషన్ సిస్టమ్ తెచ్చింది. టెలికాం కంపెనీలు ప్రతి మెసేజ్‌కు సరైన అక్షరం జోడిస్తాయి. ఈ విధానంతో యూజర్లు అనుమాస్పద మెసేజ్‌లను త్వరగా గుర్తించగలరు. SMS కమ్యూనికేషన్ మరింత స్పష్టంగా, సురక్షితంగా అవుతుంది.
స్కామర్లు అత్యవసర (ఎమర్జెన్సీ) అలర్ట్‌లు పంపుతారు. “మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయింది” అని చెబుతారు. లాటరీ, క్యాష్‌బ్యాక్, రివార్డ్స్ అని ఆఫర్లు చూపిస్తారు. అనుమాస్పద లింక్‌లు పంపి క్లిక్ చేయమని అడుగుతారు. లింక్ క్లిక్ చేస్తే బ్యాంక్ వివరాలు, వ్యక్తిగత సమాచారం దొంగిలిస్తారు. ఇలాంటి చివరి అక్షరం లేకపోతే ఆ గుర్తుతెలియని నెంబర్ నుంచి వచ్చిన మెసేజ్‌లో లింక్ ఉంటే దాన్ని అసలు క్లిక్ చేయకూడదు.
Also Read: యూట్యూబ్‌లో 1 బిలియన్ వ్యూస్‌తో ఎన్ని కోట్ల ఆదాయం వస్తుంది? ఇలా లెక్కించాలి
కొన్ని సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే సేఫ్‌గా ఉండవచ్చు.
సెండర్ ID, చివరగా ఉండే అక్షరాన్ని చూడండి.
అపరిచిత నెంబర్ లింక్స్ క్లిక్ చేయకండి.
OTP, బ్యాంక్ వివరాలు ఎవరికీ షేర్ చేయకండి.
అనుమాస్పద నెంబర్లను బ్లాక్ చేయండి.
స్కామ్ మెసేజ్‌లను టెలికాం అథారిటీలకు లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌కు రిపోర్ట్ చేయండి.