How To Convert Your Old Phone Into A CCTV Camera: చాలా మంది తమ ఫోన్లను కొద్ది నెలలు వాడిన తర్వాత, పక్కన పడేసి మరో లేటెస్ట్ ఫోన్ కొనుగోలు చేస్తారు. పాత ఫోన్ ను ఇంట్లో పడేస్తారు. లేదంటే పాత ఇనుప సామాను కొనేవాళ్లకు అమ్మేస్తారు. కానీ, కాస్త క్రియేటివ్ గా ఆలోచిస్తే, పాత ఫోన్ ను సీసీటీవీ కెమెరాగా మార్చుకోవచ్చు. ఇంటికి లేదంటే ఆఫీస్ కు సెక్యూరిటీ కోసం ఉపయోగించుకోవచ్చు. పాత ఫోన్ ను సీసీ కెమెరాగా మార్చాలంటే కొన్ని స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఇంతకీ అవేంటంటే..
పాత ఫోన్ ను సీసీటీవీ కెమెరాగా మార్చుకోండిలా!
మీ పాత ఫోన్ లో కొన్ని యాప్స్ ను ఇన్ స్టాల్ చేసుకుని వాటి ద్వారా సీసీ కెమెరాగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ స్టెప్స్ వన్ బై వన్ ఫాలోకండి..
⦿ IP వెబ్ క్యామ్ యాప్ ను ఇన్ స్టాల్ చేయండి: గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి IP వెబ్ క్యామ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
⦿ యాప్ ను ఓపెన్ చేసి సర్వర్ ను స్టార్ట్ చేయండి: IP వెబ్ క్యామ్ యాప్ ను ఇన్ స్టాల్ చేసిన తర్వాత, యాప్ ను ఓపెన్ చేసి స్క్రీన్ కింద ఉన్న స్టార్ట్ సర్వర్ బటన్ ను నొక్కాలి.
⦿ అవసరమైన పర్మిషన్స్ ఇవ్వండి: యాప్ మీ కెమెరా కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. వాటిని యాక్సెప్ట్ చేయండి.
⦿ IP అడ్రస్ ను నోట్ చేసుకోండి: కెమెరా ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్ కింది భాగంలో IP అడ్రస్ కనిపిస్తుంది. దాన్ని నోట్ చేసుకోవాలి.
⦿ బ్రౌజర్ లో కెమెరా ఫీడ్ ని యాక్సెస్ చేయండి: ఏదైనా ఫోన్ లో బ్రౌజర్ ను ఓపెన్ చేసి, అడ్రస్ బార్ లో IP అడ్రస్ ను ఎంటర్ చేయాలి. వెంటనే IP వెబ్ క్యామ్ వెబ్ సైట్ కి తీసుకెళ్తుంది. మీరు మీ ఫోన్ కెమెరా నుంచి లైవ్ ఫీన్ ను చూసే అవకాశం ఉంటుంది.
ఆడియో కావాలా? వీడియో కావాలా?
మీరు IP వెబ్ క్యామ్ సైట్ ను యాక్సెస్ చేసినప్పుడు, సర్వైలెన్స్ కోసం మీకు రెండు మెయిన్ ఆప్షన్స్ ఉంటాయి.
⦿ వీడియో రెండరింగ్: మీరు కేవలం వీడియో ఫీడ్ ని చూడాలనుకుంటే, ఈ ఎంపికను సెలెక్ట్ చేసుకోవాలి. బ్రౌజర్ ప్లే బ్యాక్ ని ఎంచుకోవాలి.
⦿ఆడియో-వీడియో: వీడియోతో పాటు ఆడియోను వినడానికి, వీడియో ప్లేయర్ విభాగంలోని ఫ్లాష్ సెలెక్షన్ ను క్లిక్ చేయాలి.
మీ పాత ఫోన్ ను CCTV కెమెరాగా మార్చుకోవడం ద్వారా కొత్త సీసీ కెమెరాల కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఖర్చు లేకుండా ఇల్లు, లేదంటే ఆఫీస్ ను ఈజీగా పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. ఒకవేళ అవసరం అనుకుంటే మళ్లీ మీ పాత ఫోన్ ను ఉపయోగించుకునే అవకాశం ఉంది.
Read Also: స్ట్రీరింగ్ ఉండదు, డ్రైవర్ అవసరం లేదు.. ప్రపంచాన్ని ఏలబోతున్న ఎలన్ మస్క్ రోబో ట్యాక్సీలు!