BigTV English

Driverless Robotaxi: స్ట్రీరింగ్ ఉండదు, డ్రైవర్ అవసరం లేదు.. ప్రపంచాన్ని ఏలబోతున్న ఎలన్ మస్క్ రోబో ట్యాక్సీలు!

Driverless Robotaxi: స్ట్రీరింగ్ ఉండదు, డ్రైవర్ అవసరం లేదు.. ప్రపంచాన్ని ఏలబోతున్న ఎలన్ మస్క్ రోబో ట్యాక్సీలు!

ఎలన్ మస్క్.. ఏది చేసినా సంచలనమే. స్పెస్ ఎక్స్ రాకెట్లైనా, టెస్లా కార్లైనా, ట్విట్టర్ కొనుగోలు అయినా, ఏదైనా ప్రపంచాన్ని ఆశ్చర్య పరచాల్సిందే! ఆయన కలల ప్రాజెక్టులలో ఒకటైన రోబో ట్యాక్సీ తాజాగా రోడ్డు మీద పరుగులు పెట్టి వారెవ్వా అనిపించింది. ఇప్పటికే డ్రైవర్ లెస్ కార్లను అందుబాటులోకి తీసుకొచ్చి మస్క్.. తాజాగా ఫుల్లీ ఆటోమేటెడ్, ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ తో నడిచే రోబోటిక్ కారును  ప్రపంచానికి పరిచయం చేశారు.


ఆశ్చర్యపోతున్న యావత్ ప్రపంచం

మస్క్ తాజాగా డ్రైవర్ లెస్ కారు పేరు టెస్లా సైబర్ క్యాబ్. ఈ కారును  అక్టోబర్ లోనే తొలిసారి ఆవిష్కరించినప్పటికీ, తాజాగా దాన్నిలో ప్రయాణిస్తున్న వీడియోను మస్క్  షేర్ చేశారు. ఈ రోబో ట్యాక్సీలో మస్క్ ప్రయాణిస్తూ ప్రపంచాన్ని అబ్బుర పరిచారు. మస్క్ కారు దగ్గరికి వెళ్లగానే దాని బటర్ ఫ్లై డోర్లు ఆటోమేటిక్ గా తెరుచుకున్నాయి. ఆయన కారులో కూర్చొని సీటు బెల్టు పెట్టుకున్న కొద్ది సెకెన్లలోనే రోబో ట్యాక్సీ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఈ దృశ్యాన్ని చూసి అక్కడున్న వాళ్లంతా చప్పట్లు కొడుతూ సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.  “ఫైనల్ గా ప్రపంచ వ్యాప్తంగా పదిలక్షల  డ్రైవర్‌ లెస్ టెస్లాలు 24/7 రైడ్లను అందించనున్నాయి” అని మస్క్ ఈ వీడియోకు క్యాప్షన్ పెట్టారు.


స్టీరింగ్ ఉండదు, డ్రైవర్ అవసరం లేదు

టెస్లా రోబోటిక్ ట్యాక్సీ పూర్తి స్థాయిలో ఆటోమేటిక్ గా పని చేస్తుంది. దీనిని నడిపేందుకు డ్రైవర్ అవసరం లేదు. ఇందులో స్టీరింగ్ వీల్ కనిపించడదు. యాక్సలరేటర్, బ్రేక్ పెడల్స్ ఉండవు. సెన్సార్లు, కెమెరాల సాయంతో పని చేస్తుంది. కారులో కూర్చోగానే చేయాల్సిన పని, ఎక్కడికి వెళ్లాలో ఆ ప్రాంతాన్ని ఎంటర్ చేయాలి. చక్కగా మీరు వెళ్లాల్సిన ప్లేస్ కు తీసుకెళ్తుంది. ఈ కారులో ఇద్దరు మాత్రమే కూర్చొని వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ కారు ఫ్యూచరిస్టిక్ డిజైన్ తో అద్భుతంగా ఆకట్టుకుంటుంది. దీనికి రెండు బటర్ ఫ్లై డోర్లు, పెద్ద టచ్ స్క్రీన్ డిస్ ప్లే సెంటర్ కన్సోల్ ఉంది. ఇంటీరియర్ కూడా చూడ్డానికి చాలా అద్భుతంగా కనిపిస్తున్నది. ఈ కారుడు చూడ్డానికి టెస్లా సైబర్ ట్రక్ లాగే ఉంటుంది. ఈ కారుకు వైర్ లెస్ ఛార్జర్ తో ఛార్జింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక ఈ కారు ధర సుమారు 30, 000 డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ. 25 లక్షలు ఉండనున్నట్లు తెలుస్తున్నది. 2026 నుంచి ఈ కార్ల ఉత్పత్తి ప్రారంభం కానున్నట్లు తెలుస్తున్నది.

నెటిజన్లు ఏం అంటున్నారంటే?

మస్క్ రోబో కారు వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. “మస్క్ మీరంటే నాకు చాలా ఇష్టం. కానీ, నేను దీన్ని పాస్ చేయలేను. కారును నియంత్రించే దేన్నీ నేను నమ్మను. మన మీద మనకు నమ్మకం అనేది చాలా ముఖ్యం” అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. “నేను చిన్నప్పుడు కలలుగన్న కాలంలో ఇప్పుడు మనం జీవించబోతున్నాం. మిస్టర్ మస్క్, మీ వల్లే ఇది చాలా వరకు సాధ్యం అయ్యింది” అని మరో నెటిజన్ రాశాడు. “జర్మనీలో ఉన్న నా ఓల్డేజ్ పేరెంట్స్ కోసం ఇది నాకు కావాలి” అని ఇంకో నెటిజన్ రాసుకొచ్చాడు.

Read Also: ప్రపంచంలోని బెస్ట్ స్లీపర్ రైళ్లు ఇవే.. జీవితంలో ఒక్కసారైనా ప్రయాణించాల్సిందే!

Related News

Afghan Boy: విమానం ల్యాండింగ్ గేర్‌‌‌లో 13 ఏళ్ల బాలుడు.. కాబూల్ నుంచి ఢిల్లీకి ట్రావెల్

Stealing Bedsheets: ఏసీ కోచ్ లో దుప్పట్లు దొంగతనం చేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన రిచ్ ఫ్యామిలీ

TTE Instagram: అమ్మాయి టికెట్ చూసి.. అలా చేయాలంటూ ఒత్తిడి చేసిన టీసీ, ఓర్ని దుంప తెగ!

Trains Cancelled: 3 రాష్ట్రాల్లో రైల్వే అలర్ట్, ఏకంగా 55 రైళ్లు క్యాన్సిల్!

Singapore – Malaysia: మలేసియా, సింగపూర్‌లకు IRCTC సరికొత్త ప్యాకేజ్.. మరీ ఇంత చౌకగానా?

Vande Bharat Train: రైల్వేకు బుర్ర ఉందా? వందేభారత్‌ను ఎవరైనా ఆ రోజు నిలిపేస్తారా?

Rajahmundry to Tirupati Flight: రాజమండ్రి నుంచి తిరుపతికి నేరుగా విమానం.. ఎప్పటి నుంచంటే?

Rail Neer: గుడ్ న్యూస్.. రైల్ నీర్ బాటిల్ ధరలు తగ్గుతున్నాయ్, ఇకపై ఎంతంటే?

Big Stories

×