విశాఖలోని మహారాణిపేటకు చెందిన నరేంద్ర అనే యువకుడు లోన్ యాప్స్ ద్వారా అప్పు తీసుకున్నాడు. రెండు వేల రూపాయల మినహా తీసుకున్న అప్పు మొత్తం చెల్లించాడు. కానీ.. ఆ రెండు వేల కోసమే నిర్వాహకులు వేధించడం మొదలు పెట్టారు. వరుస కాల్స్, మెసేజులతో బెదిరింపు కాల్స్ వచ్చాయి. డబ్బులు చెల్లించకపోతే మార్ఫింగ్ ఫోటోలను కుటుంబ సభ్యులు, బంధువులకు పంపిస్తామని వార్నింగ్‌లు ఇచ్చేవారు. అయితే బెదిరింపుల వరకే పరిమితం కాలేదు. అన్నట్టుగానే బాధితుడి ఫోన్‌లో ఉన్న కాంటాక్ట్స్‌కి మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు పంపించేశారు.
స్నేహితులు, బందువులతో పాటు మార్ఫింగ్ ఫోటోలు నరేంద్ర కుటుంబ సభ్యులకు అతని భార్యకు కూడా వెళ్లాయి. దీంతో ఆయన మనస్తాపానికి గురైయ్యాడు. ఫ్యామిలీ ముందు మొహం చూపించలేక శనివారం అర్ధరాత్రి భార్య నిద్రలో ఉండగా ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
Also Read: వాళ్ల గొడవల్లో.. వీళ్లు వేలు పెడుతున్నారు, అరె ఏంట్రా ఇది!
బాధితుడి ప్రేమించిన అమ్మాయిని 40 రోజుల క్రితమే పెళ్లి చేసుకున్నాడు. భార్య, భర్తలు ఇద్దరూ చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రెండు రోజులుగా నరేంద్ర విచారంగా ఉండటాన్ని అతని భార్య గ్రహించింది. దీంతో ఏం జరిగిందని ఆరా తీసింది. దీంతో.. లోన్ యాప్‌కు 2 వేలు బాకీ పడ్డానని.. వాళ్లు వేధిస్తున్నారి బాధితుడు తన భార్యకు చెప్పాడు. ఆమె తన దగ్గరున్న 2 వేలు రూపాయలు ఇవ్వడంతో ఆ అప్పు తీర్చేశాడు. అయితే.. అప్పటికే నిర్వాహకులు మార్ఫింగ్ ఫోటోలు అందరికి పంపిచేశారు. దీంతో మరణం మినహా మరో దారి లేదనుకొని నరేంద్రం సూసైడ్ చేసుకున్నాడు.
కేవలం రెండు వేల రూపాయలకు ఇన్ని వేధింపులు అవసరమా అన్ని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అసలు ఇలాంటి యాప్స్ ప్రభుత్వాలు ఎందుకు బ్యాన్ చేయలేకపోతున్నాయి? ఇంకెంత మంది బలికాలనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.