Big Stories

Suicide symptoms: ఆత్మహత్య లక్షణాలను కనిపెట్టే యాప్.. విద్యార్థి ప్రయోగం..

Suicide symptoms: ఆత్మహత్య అనేది ఒక్కసారిగా తీసుకునే నిర్ణయం కాదు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారు ఎన్నోసార్లు దాని గురించి ఆలోచించి ఉంటారు, మానసికంగా దానికోసం సిద్ధపడి ఉంటారు. ముఖ్యంగా ఆత్మహత్యలకు డిప్రెషనే కారణమని ఇప్పటికే శాస్త్రవేత్తలు తేల్చారు. అందుకే డిప్రెషన్‌ను కనిపెట్టడం కోసం, ప్రజలను ఆత్మహత్యల నుండి కాపాడడం కోసం వారు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తాజాగా ఒక విద్యార్థి చేసిన ప్రయత్నం శాస్త్రవేత్తలు తోడుగా నిలబడనుంది.

- Advertisement -

ఈరోజుల్లో టీనేజ్ నుండే చాలామంది స్మార్ట్‌ఫోన్స్, సోషల్ మీడియా లాంటివి ఉపయోగించే అలవాటు ఉంటుంది. చాలామంది యువత వారి రోజూవారి జీవితంలో జరిగే విషయాలను కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు ఇలాంటి విషయాల్లో హెచ్చరించినా కూడా సోషల్ మీడియాకు అడిక్ట్ అయిన యువత మాత్రం ఈ పోస్టింగ్ ఆపడం లేదు. దానిని బట్టి వారి మానసిక స్థితిని కనిపెట్టడం సులభంగా మారుతుంది అంటున్నాడు ఒక విద్యార్థి.

- Advertisement -

సిద్ధు పచ్చిపాల అనే హోస్టన్ విద్యార్థి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ను ఉపయోగించి ఆత్మహత్యను కనుక్కోవచ్చనే ఆలోచనతో ముందుకొచ్చాడు. మామూలుగా ఒక ఆత్మహత్య చేసుకోవాలని అనుకునే ముందు చాలా మానసిక సంక్షోభానికి గురవుతారని, అదే సమయంలో వారిని కాపాడే అవకాశాలు ఉంటాయని సిద్ధు చెప్పుకొచ్చాడు. అయితే ఆత్మహత్యకు ముందు లక్షణాలు అనేవి కూడా పూర్తిస్థాయిలో బయటపడవని తెలిపాడు. వాటిని ప్రత్యేక శ్రద్ధ ద్వారానే కనిపెట్టవచ్చని అన్నాడు.

ఆత్మహత్యలను తగ్గించడం కోసమే సిద్ధు ఒక యాప్‌ను కనిపెట్టాడు. ఇది ఏఐ ద్వారా మనుషులు మెసేజ్‌లను స్కాన్ చేసి వారి మానసిక స్థితి ఎలా ఉందో కనిపెడుతుంది. ఇప్పటికే ఆత్మహత్యను కనిపెట్టడానికి మెడికల్ రంగంలో పలు మార్గాలు ఉన్నా.. అవన్నీ ఔట్‌డేటెడ్ అయిపోయాయని సిద్ధు ఈ ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. మామూలుగా మనం పంపే మెసేజ్‌లు మన మానసిక స్థితిని కనిపెట్టడానికి ఉపయోగపడతాయి కానీ ఆత్మహత్య లక్షణాలను కనిపెట్టడానికి ఉపయోగడతాయని కూడా సిద్ధు నిరూపించాడు.

సిద్ధు డిజైన్ చేసిన ఈ యాప్‌ను ఎవరికి వారు డౌన్‌లోడ్ చేసుకొని, అందులో అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పి, వారి మానసిక స్థితి ఎలా ఉందో కనిపెట్టే అవకాశాం లభిస్తుంది. ఈ యాప్ పేరు సుయ్‌సెన్సార్. ఇది ఆత్మహత్య లక్షణాలను 98 శాతం కచ్చితంగా కనిపెడుతుందని ఇప్పటికే నిపుణులు నిర్ధారించారు. ముఖ్యంగా టీనేజ్‌లో, యువతలో ఆత్మహత్య కేసులు పెరుగుతున్న ఈ క్రమంలో ఈ యాప్ అనేది ఎంతోమందికి ఉపయోగపడుతుందని నిపుణులు సిద్ధును ప్రశంసించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News