BigTV English

TG BC Bandh Live Updates: క్యాబ్, ఆటోలు నిలువు దోపిడీ.. పెట్రోల్ బంక్‌పై దాడులు.. ఇదీ రాష్ట్రంలో బంద్ పరిస్థితి

TG BC Bandh Live Updates: క్యాబ్, ఆటోలు నిలువు దోపిడీ.. పెట్రోల్ బంక్‌పై దాడులు.. ఇదీ రాష్ట్రంలో బంద్ పరిస్థితి
Advertisement

TG BC Bandh: తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు బీసీ బంద్ చేస్తున్నారు. అయితే పలు జిల్లాల్లో బీసీ బంద్ ఉద్రిక్తతల నడుమ కొనసాగుతోంది.


తొర్రూర్ లో ఉద్రిక్తత

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ లో ఉద్రిక్తత నెలకొంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ బంద్ కు పిలుపునిచ్చాయి. తొర్రూర్ లో బంద్ చేపట్టిన కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. బీసీ బంద్ సందర్భంగా ఇరు పార్టీల కార్యకర్తలు సంఘీభావ ర్యాలీలో పాల్గొన్నారు. తొర్రూర్ బస్ స్టాండ్ వద్ద ఇరు పార్టీల కార్యకర్తలు ఎదురుపడడంతో పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు.

ఇరు పార్టీల కార్యకర్తలు ఎదురెదురుగా దూసుకొచ్చి, తోపులాటకు ప్రయత్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసుల కల్పించుకుని రెండు వర్గాలకు సర్దిచెప్పి పంపించారు.


హైదరాబాద్ లో తీవ్ర ఉద్రిక్తత

హైదరాబాద్ లో బీసీ బంద్ తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి సమీపంలోని పెట్రోల్ బంక్ పై బీసీ సంఘాల నేతలు దాడి చేశారు. పెట్రోల్ బంక్ లోని సామాగ్రిని ధ్వంసం చేశారు. సిబ్బంది రాళ్ల దాడి చేయడంతో.. చేసేదేంలేక బంక్ ను మూసివేశారు. దాడికి పాల్పడిన వారిపై పలువురు మండిపడుతున్నారు. బీసీ బంద్ అని చెప్పిన ఎందుకు పెట్రోల్ బంక్ ఓపెన్ చేశారని బీసీ నేతలు మండిపడుతున్నారు.

కొనసాగుతున్న బంద్

హైదరాబాద్‌లో బంద్ కాస్త ఉద్రిక్తతల మధ్యలో కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఎంజీబీఎస్‌, జూబ్లీ బస్ స్టేషన్ ముందు బీసీ సంఘాల నేతల బైఠాయించారు. జేబీఎస్‌ దగ్గర బీసీ బంద్‌లో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. రాజేంద్రనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, బండ్లగూడ, హయత్‌నగర్‌, బర్కత్‌పురా, ఇబ్రహీంపట్నం సహా ఆర్టీసీ డిపోల్లో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

బీసీ బంద్ నేపథ్యంలో హైదరాబాద్ జూబ్లీ బస్టాండ్‌ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులు నిలిచిపోయాయి. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రహదారిపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. దీంతో జూబ్లీ బస్ స్టేషన్‌లో బస్సులు డిపో పరిమితమయ్యాయి. మరోవైపు దీపావళి పండుగకు సొంతూర్లకు వెళ్లే వారు ఇబ్బంది పడుతున్నారు. బస్సులు నిలిచిపోవడంతో వివిధ జిల్లాలకు వెళ్లాల్సిన ప్రయాణికులతో జేబీఎస్‌లో రద్దీ పెరిగింది.

ముందస్తు సమాచారం లేకపోవడంతో

బస్సుల బంద్ పై ముందస్తు సమాచారం లేకపోవడంతో బస్ స్టేషన్‌లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీలైనంత త్వరగా ఆర్టీసీ బస్సులను నడపాలని కోరుతున్నారు. కుటుంబ సభ్యులు, చిన్నారులు, వయోవృద్ధులతో ప్రయాణికులు గంటల తరబడి బస్ స్టేషన్‌లో వేచి చూస్తున్నారు. ఎంజీబీఎస్‌లోనూ ప్రయాణికులు బస్సులు పడిగాపులు కాస్తున్నారు. పండుగ సమయాల్లో బంద్ అంటూ ప్రజలను ఇబ్బంది పెట్టడం సమంజసం కాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

Also Read: BC Bandh: బీసీ బంద్‌లో ఒకవైపు తల్లి.. మరోవైపు కొడుకు

ఆటో, క్యాబ్ డ్రైవర్ల నిలువు దోపిడీ

వరంగల్, కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌, విజయవాడ, ఖమ్మం, సూర్యాపేట, సిద్దిపేట, నల్గొండతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. దీంతో బస్సులు దొరక్క ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఇదే అదనుగా ఆటోలు, క్యాబ్‌ డ్రైవర్లు అధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఎల్బీ నగర్‌ నుంచి సూర్యాపేటకు మామూలు రోజుల్లో రూ.200 ప్రస్తుతం రూ.800 డిమాండ్‌ చేస్తున్నారు. విజయవాడ వెళ్లాలంటే ఒక్కొక్కరికి రూ.2 వేలు వసూలు చేస్తున్నారు.

Related News

Naveen Yadav: జూబ్లీహిల్స్ బైపోల్.. నవీన్ యాదవ్‌కు పెరుగుతున్న గెలుపు అవకాశాలు..? కారణాలివే..!

CM Revanth Reddy: ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవొద్దు.. అధికారులపై సీఎం రేవంత్ ఫైర్

V Hanumantha Rao: బీసీ బిల్లును తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలి.. కేంద్రానికి వీహెచ్ డిమాండ్

Wines Shops Closed: బంద్ వేళ.. మందు కూడా బందా? డోన్ట్ వర్రీ!

TG New Liquor Shops: మద్యం షాపుల దరఖాస్తులకు నేడే లాస్ట్.. కేటాయింపు ఎప్పుడంటే?

Public Reaction On TG Bandh: ఇంటికి పోవద్దా.. పండగపూట బంద్ ఏంటి.! పబ్లిక్ రియాక్షన్

TG BC Bandh: బంద్‌లో అపశృతి.. బీసీ ర్యాలీలో బొక్కబోర్లా పడ్డ హనుమంత రావు, ఆయన పరిస్థితి ఎలా ఉందంటే?

Big Stories

×