K-Ramp: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా పేరు సొంతం చేసుకున్నారు కిరణ్ అబ్బవరం(Kiran abbavaram). గత ఏడాది ఇదే దీపావళికి ‘క’ సినిమాతో మంచి విజయం అందుకున్న ఈయన.. ఆ తర్వాత ‘దిల్ రూబా’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదు. ఈ ఏడాది కూడా దీపావళికి ‘కే ర్యాంప్’ అంటూ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇకపోతే నిన్ననే ఓవర్సీస్ థియేటర్లలో ప్రీమియర్ షోలు పడగా అందుకు సంబంధించిన రివ్యూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ హక్కులకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం ఆహా.. ఈ సినిమా హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా థియేటర్లలో అందుకునే టాక్ ను బట్టి ఓటీటీ స్ట్రీమింగ్ కి వస్తుంది అని సమాచారం. సాధారణంగా ఒక సినిమా థియేటర్లలో ఫ్లాప్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది అంటే నెలలోపే ఓటీటీలోకి వస్తుంది. ఒకవేళ మంచి టాక్ సొంతం చేసుకుంటే మాత్రం మరో నాలుగు వారాలు వాయిదా పడుతుంది. మొత్తానికైతే 8 వారాలలోపే కే ర్యాంప్ మూవీ ఆహా ఓటీటీ వేదికగా అందుబాటులోకి రాబోతుందని చెప్పవచ్చు.
ఇకపోతే ఈ సినిమా టాక్ ఎలా ఉంది అనే విషయానికి వస్తే.. సినిమా చూసిన ఎన్నారైలు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ సినిమా చూసిన ఎన్నారైలు కామెడీ పేరుతో అవుట్ డేటెడ్ టెంప్లెట్ సినిమా తీశారని కామెంట్లు చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ నెమ్మదిగా సాగుతుందని.. సెకండ్ హాఫ్ వర్క్ అవుట్ అయిందని చెబుతున్నారు. ఒకసారి చూసే సినిమా అని ఆడియన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే కిరణ్ అబ్బవరం నటన , తండ్రిగా సాయికుమార్, సీనియర్ నటుడు నరేష్ , వెన్నెల కిషోర్ పాత్రలు సినిమాకు ప్రాణం పోసాయని చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా నరేష్, వెన్నెల కిషోర్ పాత్రలే సినిమాను సేవ్ చేశాయని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి.
also read:Pawan Kalyan: కోలీవుడ్ డైరెక్టర్ తో పవన్ మూవీ.. సఫలం అయితే విధ్వంసమే!
కే ర్యాంప్ సినిమా విషయానికి వస్తే.. లవ్ అండ్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాను హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్స్ బ్యానర్లపై రాజేష్ దండ, శివ బొమ్మక్ నిర్మించారు. కిరణ్ అబ్బవరం , యుక్తి తరేజా, మురళీధర్ గౌడ్, సాయికుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. అక్టోబర్ 18 దీపావళి సందర్భంగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. ఈ చిత్రం ద్వారానే జైన్స్ నాని డైరెక్టర్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు
కిరణ్ అబ్బవరం కెరియర్ విషయానికొస్తే.. 2019లో రాజావారు రాణిగారు సినిమా ద్వారా హీరోగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. 1990 జూలై 15న ఆంధ్రప్రదేశ్ కడప, రాయచోటి మండలంలోని పెద్దకోడివాండ్ల పల్లెలో జన్మించిన ఈయన 2024 లో తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య ఘోరక్ ను వివాహం చేసుకొని.. ఈ ఏడాది మే 22న కుమారుడికి జన్మనిచ్చారు.