BigTV English

Spinach: పాలకూరతో పాటు.. ఇవి అస్సలు తినొద్దు !

Spinach: పాలకూరతో పాటు.. ఇవి అస్సలు తినొద్దు !
Advertisement


Spinach: పాలకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆకుకూర. ఇందులో ఐరన్, విటమిన్ ఎ, సి, కె, కాల్షియం, మెగ్నీషియం, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే.. ఈ పోషకాల ప్రయోజనాలను పూర్తిగా పొందాలంటే.. పాలకూరను కొన్ని రకాల ఆహారాలతో కలిపి తీసుకోకూడదని ఆహార నిపుణులు, ఆయుర్వేదం సూచిస్తున్నాయి. కొన్ని ఆహార పదార్థాలతో పాలకూరను కలిపి తినడం వల్ల పోషకాల శోషణ తగ్గిపోవడం లేదా జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

పాలకూరతో కలిపి తీసుకోకూడని ముఖ్యమైన 7 ఆహారాలు:


పాల ఉత్పత్తులు పన్నీర్, పెరుగు, చీజ్: ‘పాలక్ పన్నీర్’ ఆరోగ్యకరమైనదిగా భావించినప్పటికీ.. దీని విషయంలో జాగ్రత్త వహించాలి. పాలకూరలో ఐరన్ అధికంగా ఉంటుంది. అయితే పన్నీర్ వంటి పాల ఉత్పత్తుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కాల్షియం. ఆక్సలేట్‌లు (పాలకూరలో ఉండేవి) కలిసి ఐరన్ శోషణకు అడ్డంకిగా మారతాయి. దీని ఫలితంగా.. శరీరానికి అందాల్సిన ఐరన్ ప్రయోజనం పూర్తిగా అందదు.

టమాటోలు : టమాటోలు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. పాలకూరలో ఉండే ఆక్సలేట్‌లతో టమాటోలలోని ఆమ్లం కలిసినప్పుడు.. అది కాల్షియం, ఐరన్ వంటి ఖనిజాల శోషణను తగ్గిస్తుంది. వంటకాల్లో ఈ కాంబినేషన్ సర్వసాధారణం అయినప్పటికీ.. పోషకాల ప్రయోజనం తగ్గకుండా ఉండాలంటే.. పాలకూరను టమాటోలను కలపకుండా తీసుకోవడం మంచిది.

టీ : పాలకూర తిన్న వెంటనే లేదా పాలకూరతో కూడిన ఆహారం తీసుకునే సమయంలో టీ తాగడం మంచిది కాదు. టీలో ‘టానిన్స్’, ‘పాలిఫెనాల్స్’ ఉంటాయి. ఇవి పాలకూరలోని ఐరన్‌తో చర్య జరిపి, శరీరం ఐరన్‌ను శోషించుకునే ప్రక్రియను అడ్డుకుంటాయి. అందుకే.. పాలకూర తిన్న తర్వాత కనీసం ఒక గంట పాటు టీ తాగడం మానుకోవాలి.

అధిక కాల్షియం ఉన్న గింజలు : బాదం, జీడిపప్పు వంటి కొన్ని గింజల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. పాలకూరతో కలిపి వీటిని తీసుకున్నప్పుడు, పాల ఉత్పత్తుల మాదిరిగానే, గింజల్లోని కాల్షియం పాలకూరలోని ఆక్సలేట్‌లతో కలిసి ఐరన్ శోషణ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.

ఆల్కహాల్ : ఆల్కహాల్ సాధారణంగా జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది పోషకాల శోషణను అడ్డుకుంటుంది. పాలకూరతో కలిపి ఆల్కహాల్ తాగడం వల్ల పాలకూరలోని విటమిన్లు , ఖనిజాల ప్రయోజనాలు శరీరానికి సరిగా అందకపోవచ్చు.

అధిక ప్రోటీన్ ఉన్న మాంసం: పాలకూరను అధిక మొత్తంలో మాంసంతో కలిపి తినడం వల్ల కొంతమందిలో జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పడవచ్చు. పాలకూరలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనికి అధిక ప్రోటీన్ కలిస్తే జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.

చిక్కుళ్ళు, పప్పులు : పప్పులలో ఫైటిక్ ఆమ్లం ఉంటుంది. ఇది పాలకూరలోని ఐరన్, జింక్ వంటి ఖనిజాల శోషణను కొంతవరకు తగ్గించవచ్చు. పాలకూర పప్పు చాలా ప్రసిద్ధి చెందినప్పటికీ.. ఖనిజాల శోషణ పెరగడానికి.. వండే ముందు పప్పులను బాగా నానబెట్టడం మంచిది.

Related News

Garlic: చలికాలంలో వెల్లుల్లి ఎక్కువగా తింటే.. నమ్మలేనన్ని ప్రయోజనాలు !

Intimacy Boost: ఏంటీ.. చలికాలంలో ఆలుమగలు అలా కలిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుందా? సైన్స్ ఏం చెబుతోందంటే?

Waking Up: మధ్య రాత్రి మెలకువ వస్తోందా? అసలు కారణాలివే !

Breakfasts: మార్నింగ్ ఇలాంటి బ్రేక్ ఫాస్ట్ తింటే.. రోజంతా ఫుల్ ఎనర్జీ

Soan papdi Sweet: ఓడియమ్మ.. దీపావళికి సోన్ పాపిడి గిఫ్ట్ ఇవ్వడానికి కారణం ఇదేనట!

Health Risks: పండగ సమయంలో నోటిని అదుపు చేసుకోలేకపోతున్నారా ? ఇలా చేయకుంటే సమస్యలు తప్పవు

Bad Cholesterol: చెడు కొలెస్ట్రాల్ తగ్గించే.. బెస్ట్ ఫుడ్స్ ఏంటో తెలుసా ?

Big Stories

×