E-Paper
Advertisement

Life On Earth: భూమిపై జీవులు ఇలా ఏర్పడ్డాయా? మార్స్ మీద కూడా అవే జాడలు.. ఆ రాళ్ల నుంచే ప్రాణం?

Life On Earth: భూమిపై జీవులు ఇలా ఏర్పడ్డాయా? మార్స్ మీద కూడా అవే జాడలు.. ఆ రాళ్ల నుంచే ప్రాణం?
Advertisement

ఈ విశ్వం అనేక గ్రహాలతో నిండి ఉంది. అందులో భూమి కూడా ఒకటి. అయితే, భూమి మీద ఉన్నట్లుగా మరే గ్రహం పైనా జీవులు ఉన్నట్లు జాడల్లేవు. మరి, భూమిపైనా ఇన్ని రకాల జాతులు ఎలా ఏర్పాడ్డాయి? వాటికి ప్రాణం ఎలా వచ్చింది అనేది ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీనే. అయితే, భూమి మీద జీవం ఏర్పడటానికి కారణమైన కొన్ని రాళ్లు, రసాయనాలనే.. మార్స్ (అంగారక గ్రహం) మీద కనుగొన్నారట పరిశోధకులు. దీన్ని బట్టి చూస్తే.. మార్స్ మీద కూడా జీవులు ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు. కానీ ఇప్పటివరకు వాటి జాడ ఏదీ కనిపించలేదు. కనీసం అవశేషాలు లభించినా పరిశోధనలు వేగం పుంజుకుంటాయి.

ఎలా కనుగొన్నారు?

ప్రస్తుతం మన మనుషుల శరీరంలో ఉన్నది DNA. ఈ అణువులతో మన పూర్వికులు, కన్నవారు ఎవరో చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. కానీ, భూమి ఏర్పడే సమయానికి డీఎన్ఏ అనేదే లేదు. అప్పుడు కేవలం RNA మాత్రమే ఉందట. అయితే, ఇది కూడా దానికదే ఏర్పడినది కాదు. ఇది కొన్ని రసాయనాలు, లవణాల మిశ్రమంతో ఏర్పడిందట. ఇది ఏర్పడేందుకు కావల్సిన ముఖ్య మూల పదార్థాలు రిబోస్(ribose), ఫోస్పేట్స్(phosphates), మినరల్స్. రిబోస్ అనేది ఒక రకమైన చక్కెర వంటి పదార్థం. ఇది ఫోస్పెట్, మినరల్స్‌తో కలిస్తేనే RNA ఏర్పడుతుంది.

రాళ్లపై జరిగే రసాయన క్రియే కారణమా?

Advertisement

ఆర్ఎన్ఏ అసలు ఎలా ఏర్పడిందనేది చాలా ఏళ్లుగా శాస్త్రవేత్తలు కూడా కనుగోలేకపోయారు. ఎన్నో పరిశోధనల తర్వాత.. ఇది ఏర్పడటానికి అసలు కారణం కొన్ని రాళ్లపై జరిగిన రసాయన క్రియ అని తెలుసుకున్నారట. Borax అనే లవణం.. రిబోస్‌ను స్థిరంగా ఉంచి పాడవ్వుకుండా కాపాడిందట. అన్నట్లు బోరాక్స్‌ను ఇప్పుడు మనం ప్రస్తుతం క్లీనింగ్ పౌడర్‌గా కూడా వాడుతున్నాం. ఇదే మనకు ప్రాణం ఇవ్వడానికి సహకరించిందంటే చాలా చిత్రంగా ఉంది కదూ. మరో చిత్రం ఏమిటంటే.. ఆర్ఎన్ఏ ఏర్పడేందుకు రాళ్లు కూడా కీలక పాత్ర పోషించాయట. ఔనండి, బసాల్ట్ గ్లాస్ (Basalt Glass) అనే రాయి RNA అణువుల నిర్మాణానికి సహకరించిందట. అంటే డీఎన్ఏ అణువులు ఎలా లింకుల్లా కలిసి ఉంటాయో అలా ఏర్పడేందుకు ఈ రాయి సహకరించిందన్న మాట. అయితే, ఈ రాయి చాలా అరుదైనది. అగ్ని పర్వతం నుంచి వచ్చే లావా చల్లబడిన తర్వాత ఇది ఏర్పడుతుంది. ఈ రాయి చిన్న చిన్న ముక్కలుగా ఉండే ఆర్ఎన్ఏను ఒకటిగా అల్లేందుకు సహకరించింది. అయితే, ఇది చాలా చాలా సూక్ష్మంగా జరిగే ప్రక్రియ.

అంగారక గ్రహానికి ఏంటీ సంబంధం?

4.3 మిలియన్ ఏళ్ల కిందట భూమి చాలా భిన్నంగా ఉండేది. అప్పట్లో ఈ రాళ్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉండేదట. కానీ, కాలక్రమేనా అవి కనుమరుగయ్యాయి. RNAలు విచ్ఛిన్నమయ్యాయి. ఇందుకు కారణం మహా సముద్రాలు.. భారీ వరదలు, భూమిపై ఏర్పడిన విభిన్న వాతావరణం. అయితే, అంగారక గ్రహం మీద మాత్రం ఈ రాళ్లు ఇంకా అలాగే ఉన్నాయట. వాటిని పరిశీలించగా.. అప్పట్లో భూమిపై జీవం ఏర్పడటానికి కారణమైన RNA కూడా చెక్కు చెదరకుండా కనిపించిందట. మార్స్ మీద సముద్రలేవీ లేకపోవడం వల్ల ఇంకా అవి స్థిరంగానే ఉన్నాయట. మరి వాటి వల్ల జీవం ఏర్పడిందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ఆ గ్రహ శకలాలే RNAకు సహకరించాయా?

Advertisement

వాస్తవానికి రిబోస్ అనే చక్కెర పదార్థం భూమి ఉండేది కాదట. బెన్నూ (Bennu) అనే గ్రహశకలం భూమిని ఢీకొన్నప్పుడు.. అందులో నుంచి మన జీవానికి అవసరమైన పదార్థాలు పుట్టి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఇదే గ్రహశకలం అంగారకుడిని కూడా ఢీకొని ఉండవచ్చని తెలుస్తోంది. అందుకే, అక్కడ కూడా RNA జాడలు ఉన్నాయని పరిశోధకుల భావిస్తున్నారు. అయితే, ఇవన్నీ రాత్రికి రాత్రే జరిగిపోలేదండోయ్.. ఆ RNA.. కాలక్రమేనా DNAగా మారడానికి కొన్ని మిలియన్ సంవత్సరాలు పట్టింది. దాని ఫలితమే ఇప్పుడు చూస్తున్నాం. ఏది ఏమైనా మన పుట్టుక భలే చిత్రం కదూ!

Also Read: BSNL బొనాంజ.. తెరపైకి మళ్లీ రూ.1 ప్లాన్, కొత్తగా డైలీ 3 జీబీ డేటా ఆఫర్ కూడా.. లాస్ట్ డేట్ ఇదే!

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×