E-Paper
Advertisement

APSRTC Good News: సంక్రాంతి ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 8,432 ప్రత్యేక బస్సులు, సాధారణ ఛార్జీలే!

APSRTC Good News: సంక్రాంతి ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 8,432 ప్రత్యేక బస్సులు, సాధారణ ఛార్జీలే!
Advertisement

APSRTC Good News: సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికుల రద్దీని ద‌ృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ భారీ ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది సంక్రాంతి ప్రయాణాల కోసం ఏకంగా 8వేల 432 ప్రత్యేక బస్సులను నడపాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్ సర్వీసులకు అదనంగా వీటిని అందుబాటులోని తీసుకురావడం ద్యారా ప్రజలు క్షేమంగా తమ స్వగ్రామాలకు చేరుకునేలా  ప్రణాళికలు సిద్ధం చేసింది.

పండుగ పూట ఇతర రాష్ట్రాల నుండి ఆంధ్రప్రదేశ్ వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.  దీనిని గమనించిన ఏపీఎస్ ఆర్టీసీ సంస్థ..  హైదరాబాద్, బెంగళూరు, చైన్నై వంటి ప్రధాన నగరాల నుండి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలకు 2వేల 432 ప్రత్యేక బస్సులను కేటాయించారు. ముఖ్యంగా హైదరాబాద్ నుండి విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి వంటి ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉండడం వలన అత్యధికంగా బస్సు  సర్వీసులను నడుపుతున్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల కోసం మిగిలిన 6వేల వరకు బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు.

Advertisement

గతంలో పండుగ సమయంలో ప్రత్యేక బస్సుల్లో 50 శాతం వరకు  అదనపు ఛార్జీలు వసూలు చేసేవారు. కానీ.. ఈ సారి ప్రయాణికలకు ఊరటనిస్తూ.. సాధారణ ఛార్జీలతోనే ప్రత్యేక బస్సులను నడపాలని ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం అమలులో ఉన్న స్త్రీ శక్తి పథకం (ఫ్రీ బస్సు)  కారణంగా ఈ ఏడాది రద్దీ పెరిగే అవకాశం ఉందని భావిస్తూ.. సంస్థ మెుత్తం బస్సుల్లో సుమారు 71శాతం బస్సులను ప్రత్యేక సర్వీసులుగా నడపాలని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఈ అదనపు సర్వీసుల వల్ల మహిళా ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా..  సీట్ల లభ్యత ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Advertisement

మెుత్తానికి ఏపీఎస్ ఆర్టీసీ మంచి నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. దీనివల్ల లక్షలాది మంది ప్రయాణికులు సురక్షితంగా.. తక్కువ ఖర్చుతో పండుగకు వెళ్లే అవకాశం ఉంది.

Related News

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

ఫ్యామిలీతో థీమ్ పార్క్ వెళ్లే మజానే వేరు.. ప్రపంచంలోని 8 బెస్ట్ థీమ్ పార్క్స్ ఇవే

‘మిర్చి’ సాంగ్ లోని ఈ ప్లేస్ గుర్తుందా? అది ఇప్పుడు ఘోస్ట్ టౌన్, జనాలంతా ఏమయ్యారు?

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

Big Stories

Advertisement
×