Best 5g Phones Under 10000: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పోటీ తీవ్రంగా ఉంది. ప్రతీ నెలా కొత్త కొత్త ఫోన్‌లు లాంచ్ అవుతుండడంతో సరైన ఫోన్‌ను ఎంచుకోవడం చాలామందికి కష్టమైన పనిగా మారింది. అయితే రూ. 10 వేల బడ్జెట్ లోపు ఉన్న బెస్ట్ 5G ఫోన్‌ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
1. Redmi 14C 5G
Redmi 14C 5G ధర, పనితీరు మధ్య సమతుల్యతను అందించే అద్భుతమైన బడ్జెట్ ఫోన్. దీనిలో Snapdragon 4 Gen 2 5G ప్రాసెసర్ ను అందిస్తున్నారు. ఇది మల్టీటాస్కింగ్, డే-టు-డే పనులను వేగంగా నిర్వహించేందుకు సహాయపడుతుంది.
ఫీచర్లు:
డిస్‌ప్లే: 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.56-అంగుళాల HD+ LCD
RAM & స్టోరేజ్: 8GB వరకు RAM + 4GB వర్చువల్ RAM
కెమెరా: 50MP ప్రధాన కెమెరా + డెప్త్ సెన్సార్
బ్యాటరీ: 5000mAh (18W ఫాస్ట్ ఛార్జింగ్)
ప్రాసెసర్: Snapdragon 4 Gen 2
స్టైలిష్ డిజైన్, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో వేగవంతమైన పనితీరును కల్గి ఉంటుంది.
Moto G45
Moto G45 మోటరోలా నుంచి విడుదలైన తక్కువ ధరలో అధిక పనితీరును అందించే స్మార్ట్‌ఫోన్. ఇది 6.45-అంగుళాల HD+ డిస్‌ప్లేతో వస్తుంది. దీని రిఫ్రెష్ రేట్ 120Hz కావడం వల్ల స్క్రోలింగ్, గేమింగ్ అనుభవం మరింత సులభంగా ఉంటుంది
ఫీచర్లు:
డిస్‌ప్లే: 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.45-అంగుళాల HD+
ప్రాసెసర్: Snapdragon 6s Gen 3
RAM & స్టోరేజ్: 6GB RAM + 128GB స్టోరేజ్
కెమెరా: 50MP ప్రధాన కెమెరా + డెప్త్ సెన్సార్
బ్యాటరీ: 5000mAh (18W ఫాస్ట్ ఛార్జింగ్)
Android 14, మూడు సంవత్సరాల సెక్యూరిటీ సపోర్ట్ అందిస్తుంది
Infinix Hot 50 5G
Infinix Hot 50 5G అనేది భారీ డిస్‌ప్లే, మంచి బ్యాటరీ లైఫ్‌ను కోరుకునే వినియోగదారులకు బెస్ట్ ఛాయిస్. దీనిలో 6.7-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ వంటివి ఉన్నాయి.
ఫీచర్లు
డిస్‌ప్లే: 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల HD+
ప్రాసెసర్: MediaTek Dimensity 6300
RAM & స్టోరేజ్: 6GB RAM + 128GB స్టోరేజ్
కెమెరా: 48MP సోనీ IMX582 ప్రధాన కెమెరా + డెప్త్ సెన్సార్
బ్యాటరీ: 5000mAh (18W ఫాస్ట్ ఛార్జింగ్)
గేమింగ్, డే-టు-డే పనుల కోసం మంచి ఎంపిక.
Read Also: Business Idea: తక్కువ పనితో నెలకు రూ. 2 లక్షలకుపైగా .
Realme C63
Realme C63 అద్భుతమైన డిస్‌ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్, మంచి బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఇది 6.67-అంగుళాల HD+ డిస్‌ప్లే, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంది.
ఫీచర్లు:
డిస్‌ప్లే: 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.67-అంగుళాల HD+
ప్రాసెసర్: MediaTek Dimensity 6300
RAM & స్టోరేజ్: 8GB RAM + 128GB స్టోరేజ్
కెమెరా: 50MP ప్రధాన కెమెరా + డెప్త్ సెన్సార్
బ్యాటరీ: 5000mAh (10W ఛార్జింగ్)
Samsung Galaxy F06
Samsung Galaxy F06 బడ్జెట్‌లో లభించే అత్యుత్తమ 5G ఫోన్‌లలో ఒకటి. ఇది 12 బ్యాండ్ 5G కనెక్టివిటీ అందించడం ప్రధాన ఆకర్షణ.
ఫీచర్లు:
డిస్‌ప్లే: 6.5-అంగుళాల HD+ డిస్‌ప్లే
ప్రాసెసర్: MediaTek Dimensity 6300
RAM & స్టోరేజ్: 6GB RAM + 128GB స్టోరేజ్
కెమెరా: 50MP ప్రధాన కెమెరా + 8MP అల్ట్రా-వైడ్
బ్యాటరీ: 5000mAh (15W ఫాస్ట్ ఛార్జింగ్)
5G కనెక్టివిటీ, ప్రీమియం డిజైన్, శక్తివంతమైన ప్రాసెసర్, మంచి బ్యాటరీ వంటి అనేక ఫీచర్లు వీటిలో ఏదైనా ఎంచుకోవచ్చు!