BigTV English

Jayalalitha: నాకు ఇష్టం లేకుండానే ఆ పని చేశాను.. తప్పు చేశానని ఎప్పుడు బాధపలేదు..

Jayalalitha: నాకు ఇష్టం లేకుండానే ఆ పని చేశాను.. తప్పు చేశానని ఎప్పుడు బాధపలేదు..

Jayalalitha: తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా తనకంటూ మంచి గుర్తింపును తెంచుకున్న నటి జయలలిత.. దాదాపు 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో నటిగా కొనసాగిస్తున్న ఈమె ఎన్నో సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో నటించి మెప్పించింది. 30 ఏళ్ల ఆమె సినీ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది జయలలిత. టాలీవుడ్‌లో వ్యాంప్ పాత్రలకు పెట్టింది పేరు జయలలిత. ‘ఇంద్రుడు చంద్రుడు’ చిత్రంలో కమల్ హాసన్‌ సరసన వ్యాంప్ పాత్రలో నటించిన ఈమె అప్పటినుంచి ఎన్నో సినిమాల్లో అలాంటి పాత్రలోనే కనిపించింది. ఆమె నటించిన ప్రతి సినిమా కూడా ఆమెకు మంచి గుర్తింపును అందించింది. సిని లైఫ్ లో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొందో నిజజీవితంలో కూడా ఆమె అంతే కష్టాలు పడ్డారన్న విషయం తెలిసిందే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఆమె తన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు..


జయలలిత ఇంటర్వ్యూ లో ఏం అన్నారు..? 

సినీ నటి జయలలిత ఒకప్పుడు సినిమాలతో బిజీగా ఉన్నా ఆమె ఇప్పుడు సీరియల్స్లలో ప్రత్యేక పాత్రలో నటిస్తూ వస్తుంది. ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె తన జీవితంలోని అనేక విషయాలను షేర్ చేసుకుంది. తన పెళ్లి గురించి మాత్రమే కాదు షూటింగ్లో ఆమె ఎదుర్కొన్న పరిస్థితుల గురించి కూడా వివరించింది. ఆమె మాట్లాడుతూ.. చిన్న బట్టలు వేసుకోవడం విషయంలో మీరు ఎప్పుడు ఫీల్ అవ్వలేదని యాంకర్ ప్రశ్నించగా.. నేనెప్పుడూ ఫీల్ అవ్వలేదు తప్పు చేశానని ఎప్పుడూ బాధపడలేదు అని ఆమె అన్నారు. ఎందుకు తప్పు చేశానని బాధపడాలి.. నేను చిన్న బట్టలు వేసుకున్నప్పుడు మేకప్ మ్యాన్ వచ్చి మొత్తం అంతా ఎక్కడైనా ప్యాచ్ లు ఉన్నాయని మేకప్ వేసేవాడు.. మేకప్ అయిన తర్వాత నా అసిస్టెంట్ వచ్చి నాకు ఒంటి మీద కప్పితే నేను ఎందుకు వేరే వాళ్ళకి ఏదో ఉందని క్యూరియాసిటీ పెంచడం అని ఆ టవల్సి పక్కనే వేసేదాన్ని చూస్తే చూసుకొని ఏం లేదంటే ఏం లేదనుకుంటారు అని లైట్ తీసుకున్నాను. అలాకాకుండా మన కప్పుకుని కూర్చుంటే అందులో ఇంకా ఏదో ఉందని అందర్నీ మన వైపు తిప్పుకునేలా ఉంటుందని ఆమె అన్నారు. అది విన్న యాంకర్ మీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి అంటూ అనడంతో నిజంగానే అప్పటికి ఇప్పటికీ నేను ఎప్పుడూ ఇలాంటి విషయాల్లో భయపడలేదని ఆమె నిర్భయంగా బయట పెట్టారు. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో ఆమెపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


Also Read: హీరోతో ప్రేమాయణం.. చేతురాలా జీవితాన్ని పాడు చేసుకుందా..?

జయలలిత పర్సనల్ లైఫ్ లో ఎదుర్కొన్న కష్టాలు..

ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పర్సనల్ లైఫ్ విషయాలను షేర్ చేసుకున్నారు జయలలిత. ఆమె మాట్లాడుతూ.. ‘మలయాళం ఇండస్ట్రీలో నేను వ్యాంప్ పాత్రలతోనే పరిచయం అయ్యాను. నేను ఎవరినైతే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను నా భర్త కూడా అలాంటి సినిమాలు తీసేవాడే అప్పట్లో నాకు అంత బాధ అనిపించేది కాదు. సినిమా షూటింగ్ విషయంలో గొడవ పడింది అప్పుడు నన్ను వినోదు సేవ్ చేశాడు ఆ తర్వాత అతని మనసు నచ్చి ఏడేళ్లు ప్రేమలో ఉన్నాం తర్వాత పెళ్లి చేసుకున్నాం.. ఏడేళ్లు కలిసిన మేము ఒక్క ఏడాది దాంపత్య జీవితంలో ఉండలేకపోయాం అలా ఇద్దరం విడిగా ఉంటున్నామంటూ ఆమె క్లారిటీ ఇచ్చారు. నా ఆస్తి కోసమే అతను నన్ను పెళ్లి చేసుకున్నాడని అర్థం అయ్యింది. అతని అప్పులు కోసం నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆ తరువాత నన్ను చిత్ర హింసలు పెట్టాడు. నా పెళ్లికి మా ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోతే.. నేను దాచుకున్న డబ్బు తీసుకుని వెళ్లి మా అత్తగారికి ఇచ్చి కొచ్చిలో నగలు కొనిపించుకుని పెళ్లి బట్టలు కూడా నేనే కొనుకున్నా.. కానీ పెళ్లి ఏడాదిలో పెటాకులైంది. ప్రస్తుత ఆమె ఒంటరిగానే ఉంటుంది తన మేమం మేనమామ కొడుకు ఆమెకు తోడుగా ఉంటున్నాడు ఆమె డేట్స్ అవి చూసుకుంటూ ఉంటాడు. ప్రస్తుతం ఈమె సీరియల్స్లలో బామ్మ పాత్రలో కనిపిస్తూ ఉంటుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×