BigTV English

Sunita Williams: అంతరిక్షంలో అత్యధిక రోజులు.. ఆ రికార్డ్ హోల్డర్ ఎవరో తెలుసా..?

Sunita Williams: అంతరిక్షంలో అత్యధిక రోజులు.. ఆ రికార్డ్ హోల్డర్ ఎవరో తెలుసా..?

8 రోజులు అంతరిక్ష యాత్రకోసం వెళ్లిన సునీతా విలియమ్స్.. అనుకోకుండా 9 నెలలపాటు అక్కడే ఉండాల్సిన పరిస్థితి. అనుకోకుండా జరిగినా, నాసా స్పేస్ ఆపరేషన్లో భాగంగానే జరిగినా.. ఆమె మాత్రం సరికొత్త రికార్డులు నెలకొల్పారు. భూమిపైకి సురక్షితంగా తిరిగి వచ్చిన సునీతా విలియమ్స్.. ఎన్నో కొత్త రికార్డులను తన పేరిట నెలకొల్పారు. అయితే అత్యధిక కాలం అంతరిక్షంలో గడిపిన రికార్డ్ మాత్రం ఆమె పేరిట లేదు.


అత్యధిక కాలం అంతరిక్షంలో గడిపిన రికార్డ్ రష్యా వ్యోమగామి ఒలేగ్ కోనోనెంకో పేరిట ఉంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అతను ఐదు సుదీర్ఘ మిషన్లలో పాల్గొన్నాడు. మొత్తంగా 1,111 రోజులపాటు అంతరిక్షంలో గడిపాడు. ఆ రికార్డ్ ఇప్పటి వరకు ఎవరూ బ్రేక్ చేయలేక పోవడం విశేషం.

ఇక సెకండ్ ప్లేస్ కూడా రష్యన్ వ్యోమగామికే దక్కింది. గెన్నాడీ పడల్కా అనే రష్యన్ వ్యోమగామి.. సుదీర్ఘంగా 878 రోజులు అంతరిక్షంలో గడిపారు. మొత్తం ఐదు మిషన్లలో అతను పాల్గొన్నాడు. 878 రోజుల, 11 గంటల 29 నిమిషాల పాటు అతను అంతరిక్షంలో గడిపాడు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)తోపాటు.. మిర్ స్పేస్ స్టేషన్లో కూడా అతను పనిచేశాడు.


థర్డ్ ప్లేస్ లో యూరీ మాలెన్ చెంకో అనే వ్యోమగామి ఉన్నారు. ఆయన కూడా రష్యాకు చెందిన వ్యోమగామి కావడం విశేషం. 827 రోజులు ఆయన అంతరిక్షంలో గడిపారు. ఆరు మిషన్లలో అతను ఈ ఘనత సాధించాడు. రష్యాకు చెందిన మరో వ్యోమగామి సెర్గీ క్రికాలెవ్ 803 రోజులు అంతరిక్షంలో ఉన్నారు.

ఇక భారత సంతతి మహిళ, అమెరికాకు చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ మొత్తంగా 608 రోజులపాటు అంతరిక్షంలో గడిపారు. అయితే సునీతాకంటే ముందు పెగ్గీ విట్సన్ అనే మరో మహిళా వ్యోమగామి ఉన్నారు. ఆమె ఏకంగా 675 రోజులు అంతరిక్షంలో గడిపారు. అయితే స్పేస్ వాక్ లో మాత్రం సునీత రికార్డ్ పదిలంగా ఉంది. అత్యధిక సమయం స్పేస్ వాక్ చేసిన మహిళగా ఆమె రికార్డ్ సృష్టించారు. అదే సమయంలో అంతరిక్ష కేంద్రంలో కూడా అత్యధిక రోజులు ఉన్న మహిళ కూడా ఆమే కావడం విశేషం. ఇక స్పేస్ ఎక్స్ ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కిన తొలి మహిళ కూడా సునీతా విలియమ్సే. అదే సమయంలో నాలుగు రకాల వ్యోమనౌకల్లో ప్రయాణం చేసిన తొలి వ్యోమగామిగా కూడా సునీతా విలియమ్స్ అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నారు.

అమెరికాకు చెందిన వ్యోమగాముల్ని ఆస్ట్రోనాట్స్ అంటారు, రష్యాకు చెందిన వ్యోమగాముల్ని కాస్మోనాట్స్ అని, చైనా వారిని టైకోనాట్స్ అని, భారతీయ వ్యోమగాముల్ని వ్యోమనాట్స్ అంటారు. రికార్డుల విషయానికొస్తే ఆస్ట్రోనాట్స్ లెక్కలు, కాస్మోనాట్స్ లెక్కలు వేర్వేరుగా ఉన్నాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)లో గడిపిన వివరాలను మాత్రమే అమెరికా పరిగణలోకి తీసుకుంటోంది. దీనితోపాటు మిర్ స్పేస్ స్టేషన్ లెక్కలు కూడా తీస్తే మాత్రం రష్యాకు చెందిన కాస్మోనాట్స్ దే పైచేయిగా తేలింది. మొత్తమ్మీద.. తాజా అంతరిక్ష యాత్రతో సునీతా విలియమ్స్ మాత్రం అరుదైన రికార్డులు సొంతం చేసుకుంది.

Related News

Americal News: అమెరికాలో మళ్లీ.. ఓ పాఠశాల కాల్పుల కలకలం, ఆరుగురు మృతి

Japan Flu Outbreak: జపాన్ లో విజృంభిస్తోన్న ఫ్లూ మహమ్మారి.. 4 వేలకు పైగా కేసులు, స్కూళ్లు మూసివేత

Australia Plane Crash: ఆస్ట్రేలియాలో రన్ వే పై కుప్పకూలిన విమానం.. ముగ్గురు మృతి

US Tariffs on China: మరో బాంబు పేల్చిన ట్రంప్.. చైనాపై 100 శాతం సుంకాల ప్రకటన

America: అమెరికాలో ఘోర ప్రమాదం.. 19 మంది మృతి!

Nobel Peace Prize 2025: నోబెల్ శాంతి బహుమతి ట్రంప్ నకు అంకితం.. మరియా కొరీనా కీలక ప్రకటన

Worlds Largest Cargo Plane: శంషాబాద్‌లో ప్రపంచంలోనే.. అతిపెద్ద కార్గో విమానం

Donald Trump: 8 యుద్ధాలు ఆపిన నాకు నోబెల్ ఇవ్వరా? పాపం, ట్రంప్ మామ బాగా హర్ట్ అయ్యాడు కాబోలు

Big Stories

×