Business Idea: ప్రస్తుతం కాలేజీ యువత సహా అనేక మంది తక్కువ పని ఉండి, ఎక్కువ ఆదాయం రావాలని ఆశిస్తుంటారు. అలాంటి వారి కోసం చక్కటి వ్యాపారం అందుబాటులో ఉంది. అదే ఈవెంట్ మేనేజ్‌మెంట్ (Event Management) బిజినెస్. దీనిలో కొంచెం క్రియేటివిటీ, ప్లానింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్‌ను ఉపయోగించి మంచి లాభాలను దక్కించుకోవచ్చు. అయితే దీనిని ఎలా ప్రారంభించాలి, ఆదాయం విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్లాన్ చేసి పూర్తి చేయడమే
ప్రధానంగా వేసవి కాలం (Summer Season)లో దీనికి ఫల్ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే వివాహాలు, ఫంక్షన్లు, కంపెనీ ఈవెంట్లు, బర్త్‌డే పార్టీలు, కాలేజ్ ఫెస్టివల్స్, మ్యూజిక్ కన్‌సర్ట్స్ వంటి ఈవెంట్లను మొదటి నుంచి ప్లాన్ చేసి పూర్తి చేయడమే ఈవెంట్ మేనేజ్‌మెంట్. అంటే ఏదైనా పెళ్లి ఎంగేజ్ మెంట్ వేడుక నుంచి మొదలుకుని, హాల్థీ, ఫోటో షూట్, ఫంక్షన్ హాల్, వెడ్డింగ్, ఫుడ్ సహా అనేక కార్యక్రమాలను పూర్తయ్యే వరకు ప్లాన్ చేసి చూసుకోవాల్సి ఉంటుంది.
కొత్త క్లైయింట్లను
దీనిపై అవగాహన లేని వారు ఇతర పార్టీ వేడుకలు లేదా ఏదైనా పెళ్లిలకు వెళ్లి అయినా కూడా తెలుసుకోవచ్చు. మొదట చిన్న ఈవెంట్లను నిర్వహించాలి. స్నేహితుల బర్త్‌డే పార్టీలు, కాలేజ్ ఫంక్షన్లు, చిన్న కంపెనీ మీటింగ్స్ లాంటి ఈవెంట్లను నిర్వహించడం ద్వారా అనుభవాన్ని పెంచుకోవచ్చు. మంచి ఫీడ్‌బ్యాక్ పొందితే, కొత్త క్లైయింట్లను పొందడం మరింత సులభమవుతుంది.
Read Also: Washing Machine: రూ. 1599కే పోర్టబుల్ వాషింగ్ మిషన్.. మీ …
తక్కువ పెట్టుబడి – ఎక్కువ లాభం
ఈవెంట్ మేనేజ్‌మెంట్ వ్యాపారం ప్రారంభించడానికి పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం లేదు. తక్కువ పెట్టుబడి, సరైన ప్లానింగ్, కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకొని పనిచేస్తే మంచి ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు.
క్రియేటివిటీని ఉపయోగించుకునే అవకాశం
ఈ వ్యాపారం గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత కస్టమర్లు ఇచ్చిన ఈవెంట్ ను బట్టి తీసుకుని ఆయా పనులను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఈ రంగంలో కస్టమర్ అవసరాలు, ట్రెండ్స్ గురించి తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే కొంత మంది ఈవెంట్ భారీగా నిర్వహించాలని కోరుకుంటే, మరి కొంత మంది మాత్రం బడ్జెట్ ధరల్లో చేయించాలని కోరతారు. ఈ క్రమంలో కస్టమర్ల అభిప్రాయాలకు అనుగుణంగా ప్లాన్ చేయాలి. డెకరేషన్, లైటింగ్, మ్యూజిక్, ఎంటర్‌టైన్‌మెంట్, క్యాటరింగ్ వంటి విభాగాల్లో కొత్తదనం చూపించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. సరైన ప్లానింగ్ ద్వారా విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా, మీరు కస్టమర్ల నుంచి మంచి పేరుతోపాటు ఆదాయాన్ని కూడా పొందుతారు.
కాలేజీ విద్యార్థులకు అనువైనది
కాలేజీ విద్యార్థులు తమ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఈ వ్యాపారం అనువైనది. పార్ట్‌టైమ్‌గా నిర్వహించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. చదువుతో పాటు ఈ వ్యాపారాన్ని నిర్వహించుకోవచ్చు.
పెట్టుబడి
దీనికి కనీస పెట్టుబడి రూ. 10,000–30,000 వరకు ఉంటే సరిపోతుంది. ఏదైనా ఈవెంట్ వచ్చినప్పుడు మీకు తెలిసిన లేదా అవగాహన ఉన్న వారి ద్వారా లైటింగ్, సౌండ్ సిస్టమ్, ఫోటోగ్రాఫర్స్, క్యాటరింగ్ లాంటి విభాగాలలో పనులు చేయించుకోవాలి. ఆ తర్వాత మీకు కస్టమర్ ఇచ్చిన అడ్వాన్స్ లేదా ఆయా మొత్తం నుంచి వారికి డబ్బులు చెల్లించవచ్చు.
లాభాలు
ఆయా ఈవెంట్ల గురించి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుండాలి. ఈవెంట్ల ఫోటోలు, వీడియోలను అప్‌లోడ్ చేయాలి. ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేసుకుంటే వ్యాపారాన్ని పెంచుకునే ఛాన్సుంది. ప్రస్తుతం మార్కెట్లో చిన్న ఈవెంట్ అయితే కనీసం రూ. 50 వేల వరకు తీసుకుంటున్నారు. ఒక పెద్ద ఈవెంట్ అయితే రూ. 5 నుంచి రూ. 10 లక్షల వరకు (నిర్వహణ ఖర్చులు కాకుండా) తీసుకుంటారు. ఈ క్రమంలో మీరు నెలలో కనీసం చిన్న ఈవెంట్లు ఐదు చేసినా కూడా రూ.2,50,000 వరకు సంపాదించుకునే ఛాన్సుంది.