E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

రిమోట్ అక్కర్లేదు.. మీ మాటే శాసనం.. పెంపుడు కుక్కలాంటి స్మార్ట్ ఏసీలు!

రిమోట్ అక్కర్లేదు.. మీ మాటే శాసనం.. పెంపుడు కుక్కలాంటి స్మార్ట్ ఏసీలు!
Advertisement

Smart ACs 2026: అధిక ఉష్ణోగ్రతల నుండి ఉపశమనం పొందడానికి మార్కెట్లో అనేక రకాల ఏసీలు అందుబాటులో ఉన్నాయి. అయితే మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా వినియోగదారులు సైతం.. స్మార్ట్ ఫీచర్లు ఉన్న ఏసీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో రిమోట్ లో పని లేకుండా మీ మాటలతోనే కంట్రోల్ చేయగల టాప్ – స్మార్ట్ ఏసీలను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. పెంపుడు శునకాలు ఏ విధంగా మీరు చెప్పినట్లు వింటాయో.. ఇవి ఈ ఏసీలు సైతం మీ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటాయని నిపుణులు అంటున్నారు. ఇంతకీ ఆ ఏసీలు ఏవి? వాటి ప్రధాన ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.

ఎల్‌జీ 1.5 టన్ 3 స్టార్ స్మార్ట్ ఏసీ

ఎల్‌జీ సంస్థ తీసుకొచ్చిన ఈ మోడల్.. అత్యాధునిక ఏఐ ఫీచర్లను కలిగి ఉంది. ‘AI కన్వర్టిబుల్ 6-ఇన్-1’ కూలింగ్ వ్యవస్థతో ఇది పనిచేస్తుంది. అంటే మన అవసరాన్ని బట్టి 6 రకాలుగా కూలింగ్ సామర్థ్యాన్ని మార్చుకోవచ్చు. ఇందులో ఉన్న ‘డైట్ మోడ్+’ పవర్ బిల్లును గణనీయంగా తగ్గుస్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ‘హిమ్ క్లీన్’ (Him Clean) ఫీచర్ ఏసీ లోపల బ్యాక్టీరియా చేరకుండా స్వయంగా క్లీన్ చేసుకుంటుందని పేర్కొన్నాయి.

హైయర్ 1.5 టన్ వై-ఫై హెక్సా స్మార్ట్ ఏసీ

Advertisement

గదిని అత్యంత వేగంగా చల్లబరిచే స్మార్ట్ ఏసీని కోరుకుంటే దీనిని ట్రై చేయవచ్చు. బయట 60°C ఎండ ఉన్నా సరే.. కేవలం 10 సెకన్లలోనే చల్లటి గాలిని ఇవ్వడం దీని ప్రత్యేకతగా చెప్పవచ్చు. స్మార్ట్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో వై-ఫై కనెక్టివిటీతో పాటు ‘AI కూలింగ్’ ఫీచర్ ఉంది. ఇది గదిలోని ఉష్ణోగ్రతను బట్టి ఆటోమేటిక్‌గా కూలింగ్‌ను అడ్జస్ట్ చేస్తుంది. ఇందులో 7-ఇన్-1 కన్వర్టిబుల్ ఆప్షన్, గది నలుమూలలా గాలి ప్రసరించేలా 4 వే స్వింగ్ ఫీచర్లు ఉన్నాయి.

పానాసోనిక్ 1.5 టన్ 5 స్టార్ వై-ఫై ఏసీ

ఇది అడ్వాన్స్డ్ స్మార్ట్ ఫీచర్లను కలిగి ఉంది. ‘మ్యాటర్’ ప్రోటోకాల్, పానాసోనిక్ ‘MirAIe’ యాప్‌తో ఇది పనిచేస్తుంది. ఇందులో ‘DustBuster’, ‘PM0.1 ఫిల్టర్’ ఉన్నాయి. ఇవి గాలిలోని అతి సూక్ష్మమైన ధూళి కణాలను సైతం ఫిల్టర్ చేస్తాయి. 8-ఇన్-1 కన్వర్టిబుల్ మోడ్, 55 డిగ్రీల ఎండలోనూ సమర్థవంతంగా పనిచేసే సామర్థ్యం ఈ ఏసీ ప్రత్యేకతగా చెప్పవచ్చు.

క్యారియర్ 1.5 టన్ 5 స్టార్ వై-ఫై ఏసీ

Advertisement

క్యారియర్ ‘ఈస్టర్ ఎడ్జ్’ సిరీస్ ఏసీ.. స్మార్ట్ ఫీచర్ల పరంగా వినియోగదారులను బాగా ఆకట్టుకుంటోంది. జియో ఫెన్సింగ్ అనే స్మార్ట్ ఫీచర్ తో ఇది రూపొందింది. మీరు ఇంటికి వచ్చే దారిలోనే మీ మొబైల్ లొకేషన్ ఆధారంగా ఏసీ ఆటోమేటిక్‌గా ఆన్ అవుతుంది. ఇందులో ‘స్మార్ట్ ఎనర్జీ డిస్‌ప్లే’ ఉంటుంది. దీనివల్ల ఏసీ ఎంత కరెంట్ వాడుతుందో స్క్రీన్ పైనే చూసుకోవచ్చు. కన్వర్టిబుల్ 6-ఇన్-1 ఫ్లెక్సికూల్ టెక్నాలజీతో ఇది వస్తుంది.

Also Read: అరాచకం సామీ.. థర్మాకోల్ గోడలతో ఇల్లు.. ఇక లైఫ్ లాంగ్ కూలింగ్ ఫ్రీ!

శాంసంగ్ 1.5 టన్ బెస్పోక్ స్మార్ట్ ఏసీ

ప్రీమియం లుక్, సరికొత్త టెక్నాలజీ ఇష్టపడే వారి కోసం శాంసంగ్ ‘బెస్పోక్ ఏఐ’ మోడల్ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తోంది. దీనిలోని విండ్ ఫ్రీ కూలింగ్ వ్యవస్థ కారణంగా చల్లటి గాలి నేరుగా ముఖంపై పడకుండా వేల కొద్దీ మైక్రో హోల్స్ ద్వారా గది అంతా సమానంగా విస్తరిస్తాయి. బెక్స్‌బీ (Bixby) లేదా ఇతర వాయిస్ అసిస్టెంట్ల ద్వారా కేవలం మీ మాటతోనే ఈ ఏసీని కంట్రోల్ చేయవచ్చు. ఏఐ ఎనర్జీ సేవింగ్ మోడ్ ద్వారా కరెంట్ ఆదా చేయడంలో ఇది ముందుంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.

Also Read: సమంత ‘మా ఇంటి బంగారం’ 3 రోజుల గ్రాస్ ఎంతో తెలిస్తే?.. హీరోలు ఇక సద్దుకోవాల్సిందే..

Related News

సీలింగ్ vs పెడెస్టల్ ఫ్యాన్.. కూలింగ్ ‘కింగ్’ ఎవరు? అసలు నిజం ఇదీ!

గ్లోబల్ పవర్‌హౌజ్‌గా భారత్.. అంతా పుష్కరకాలంలో, మెరుగైన ర్యాకింగ్

బెస్ట్ పవర్ బ్యాంక్ కొనాలా? వైర్‌లెస్,ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్లతో అదరగొడుతున్న బ్రాండ్స్!

అరాచకం సామీ.. థర్మాకోల్ గోడలతో ఇల్లు.. ఇక లైఫ్ లాంగ్ కూలింగ్ ఫ్రీ!

బడ్జెట్‌లో బెస్ట్ మైక్రోవేవ్ ఓవెన్ ఏది? సామ్‌సంగ్ Vs ఐఎఫ్‌బిలో గెలిచేదెవరు?

ఫ్రిజ్ కొనాలనుకుంటున్నారా? స్మార్ట్ కనెక్టివిటీతో అదరగొడుతున్న శామ్‌సంగ్ టాప్ మోడల్స్!

రూ.12 వేలలోపు బెస్ట్ పార్టీ స్పీకర్లు.. వీకెండ్ ఎంజాయ్‌మెంట్‌కు కేక పుట్టించే సౌండ్!

Big Stories

×