E-Paper
Advertisement

Mobiles Launching : జాతరే.. ఈ వారం లాంఛ్ కానున్న ది బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు.. ఫీచర్లు పిచ్చెక్కించాయ్ గురూ!

Mobiles Launching : జాతరే.. ఈ వారం లాంఛ్ కానున్న ది బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు.. ఫీచర్లు పిచ్చెక్కించాయ్ గురూ!
Advertisement

Mobiles Launching : అక్టోబర్ చివరి వారం వచ్చేసింది. అయితే ఇప్పటికే గూగుల్, యాపిల్, శాంసంగ్ వంటి​ కొన్ని టాప్ బ్రాండెడ్​ కంపెనీలు తన స్మార్ట్ ఫోన్​లు విడుదల చేశాయి. ఇప్పుడు చైనీస్​ టాప్ కంపెనీల వంతు వచ్చింది. అవి కూడా తమ స్మార్ట్ ఫోన్​ను రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యాయి. స్నాప్​ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్​తో ఇవి పని చేయనున్నట్లు టెక్ వర్గాలు అంటున్నాయి. మరి ఇంతకీ ఏ బ్రాండెడ్​ స్మార్ట్ ఫోన్లు లాంఛ్ కానున్నాయి? వాటి లీక్డ్​ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్​ తెలుసుకుందాం.

ఈ వారం లాంఛ్​ కానున్న స్మార్ట్ ఫోన్స్ ఇవే
వన్​ ప్లస్ 13 – ఈ స్మార్ట్ ఫోన్​ చైనాలో అక్టోబర్ 31న సాయంత్రం నాలుగు గంటలకు లేదా నవంబర్ 1న మధ్యాహ్నం 1.30 గంటకు(ఇండియా టైమ్​లో) రిలీజ్ కానుంది.
ఈ OnePlus 6,000 నిట్స్ పీక్ బ్రైట్​నెస్​, 1,600 నిట్స్​ హై బ్రైట్​నెస్​ మోడ్​తో, 13 6.8-అంగుళాల BOE X2 LTPO AMOLED డిస్‌ప్లేతో రానుంది. 6,000mAh బ్యాటరీ సామర్థ్యంతో 100W ఫాస్ట్ ఛార్జింగ్, 50W మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇవ్వనుంది. వాటర్ రెసిస్టెన్స్​ కోసం IP68/69 రేటింగ్‌ను కలిగి ఉండనుంది.
కెమెరా విషయానికొస్తే ట్రిపుల్ కెమెరా సెటప్​ను కలిగి ఉండనుంది. 50 మెగా పిక్సల్​ LYT- 808 ప్రైమరీ సెన్సార్‌, 50 మెగా పిక్సల్​ అల్ట్రా – వైడ్ యాంగిల్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50 మెగా పిక్సల్​ టెలిఫోటో లెన్స్‌తో రానుందని టెక్ వర్గాలు అంటున్నాయి.

Advertisement

iQOO 13 – ఈ iQOO 13 స్మార్ట్ ఫోన్ చైనాలో అక్టోబర్ 30న సాయంత్రం 4 గంటలకు ​​లేదా అక్టోబర్ 31 మధ్యాహ్నం 1:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) లాంఛ్ కానుంది. Weiboలో టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ పోస్ట్ ప్రకారం, iQOO 13 చైనాలో ధర 3,999 యువాన్లుతో ప్రారంభం కానుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ మాత్రమే కాకుండా, 7K అల్ట్రా – లార్జ్ ఏరియా VC కూలింగ్ వ్యాపర్​ చాంబర్​ కూడా ఉండనుంది. ఈ స్నాప్‌ డ్రాగన్ చిప్ ద్వారా ఫోన్​ అధిక ఒత్తిడిలోనూ చల్లగా ఉంచుతుంది. ఈ iQOO 13 6,150 mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. 120W అల్ట్రా – ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కెమెరా విషయానికొస్తే ట్రిపుల్ కెమెరా సెటప్​తో రానుంది. వెనకవైపు 50 మెగా పిక్సల్​ Sony IMX921 ప్రైమరీ షూటర్, 50 మెగా పిక్సల్​ Samsung ISOCELL JN1 అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 50 మెగా పిక్సల్​ సోనీ IMX826 టెలిఫోటో షూటర్‌ ఉండనున్నాయి.

Honor Magic 7 series – ఈ Honor Magic 7 సిరీస్, MagicOS 9.0 అక్టోబర్ 30న చైనాలో లాంచ్ కానుంది. క్వాల్​కామ్​ స్నాప్​ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో పని చేయనుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.
ఈ సిరీస్ ఫోన్​ 5,600 mAh బ్యాటరీతో రానుండగా, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 80W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.
Magic 7 Pro ఫీచర్స్ విషయానికొస్తే 120Hz రిఫ్రెష్ రేట్, కున్‌లున్ గ్లాస్ ప్రొటెక్షన్‌తో 6.82 అంగుళాల 2K క్వాడ్ కర్వ్డ్​ OLED డిస్‌ప్లేతో రానుంది. ఆప్టిక్స్ కోసం 50 మెగా పిక్సల్​ ఓమ్ని విజన్ OV50H ప్రైమరీ షూటర్, 50 మెగా పిక్సల్​ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 50 మెగా పిక్సల్​ సోనీ IMX882 టెలిఫోటో లెన్స్​ను అమర్చారు.

Advertisement

Nothing Phone 2a Community Edition – ఈ నథింగ్​ ఫోన్ 2a ప్రపంచ మార్కెట్‌లతో పాటు ఇండియాలో అక్టోబర్ 30న విడుదల కానుంది. కమ్యూనిటీ ఎడిషన్ కూడా బేస్ వేరియంట్ తరహాలోనే కొత్త డిజైన్, వాల్‌పేపర్, ప్యాకేజింగ్‌తో రానుంది.

Xiaomi 15 series – ప్రపంచంలోనే క్వాల్​కామ్ స్నాప్ డ్రాగన్​ 8 ఎలైట్​ ప్రాసెసర్‌తో విడుదల కానున్న మొదటి ఫోన్ ఇది. అక్టోబర్ 29న చైనాలో లాంఛ్​ కానుంది.
ఈ Xiaomi 15 120 Hz రిఫ్రెష్ రేట్‌, 6.36 ఇంచ్​ LTPO AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. డాల్బీ విజన్, HDR10+, DCI-P3 వైడ్ కలర్ గామట్‌లకు సపోర్ట్ చేస్తుంది. కెమెరా విషయానికొస్తే 50 మెగా పిక్సల్​ OV50H ప్రైమరీ షూటర్, 3.2x ఆప్టికల్ జూమ్‌తో 50 మెగా పిక్సల్​ టెలిఫోటో లెన్స్, అల్ట్రా – వైడ్ యాంగిల్ లెన్స్‌తో రానుంది.

నోట్​ : పైన్ చెప్పిన స్మార్ట ఫోన్ల ఫీచర్స్​, స్పెసిఫికేషన్స్ అధికారికంగా ప్రకటించినవి కాదు. కేవలం లీక్డ్​ వివరాల ద్వారా వీటిని మీకు అందిస్తున్నాం.

 

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×