BigTV English

Grapes Vs Raisins: ద్రాక్ష, ఎండు ద్రాక్ష ఈ రెండింటిలో ఏది బెటర్ ? ఎవరు, ఎప్పుడు తినాలో తెలుసా..

Grapes Vs Raisins: ద్రాక్ష, ఎండు ద్రాక్ష ఈ రెండింటిలో ఏది బెటర్ ? ఎవరు, ఎప్పుడు తినాలో తెలుసా..

Grapes Vs Raisins: ద్రాక్ష ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది. ద్రాక్షను ఎండబెట్టడం ద్వారా ఎండు ద్రాక్ష( కిష్ మిస్)ను తయారు చేస్తారు. ఎండుద్రాక్ష తినడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. ద్రాక్ష, ఎండుద్రాక్ష రెండూ ఒకే రకమైన ప్రయోజనాలను అందిస్తాయని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ద్రాక్షను ఎండుద్రాక్షగా మార్చినప్పుడు, దానిలోని అనేక లక్షణాలు కూడా మారుతాయి.


ద్రాక్ష తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. ఎండుద్రాక్ష ఎముకలను బలోపేతం చేస్తుంది. రక్తహీనతను కూడా నివారిస్తుంది. రక్తహీనతతో ఇబ్బంది పడే వారు ఎండు ద్రాక్షను తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. శరీరంలో రక్తాన్ని పెంచేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఎండు ద్రాక్ష శరీరానికి తక్షణ శక్తిని కూడా అందిస్తుంది. ద్రాక్ష, ఎండుద్రాక్ష మధ్య ప్రధాన తేడాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ద్రాక్ష, ఎండుద్రాక్ష మధ్య ప్రధాన తేడాలు : 


నీటి శాతం: ద్రాక్షలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఎండు ద్రాక్షలో నీటి శాతం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ద్రాక్షను ఎండబెట్టి  దీనిని తయారు చేస్తారు.

పోషకాలు: విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ద్రాక్ష, ఎండు ద్రాక్ష రెండింటిలోనూ ఉంటాయి. కానీ వాటి పరిమాణం మారుతుంది.

కేలరీలు: ఎండుద్రాక్షలో ఎక్కువ ఫ్రక్టోజ్ ఉండటం వల్ల ద్రాక్ష కంటే ఎక్కువ కేలరీలు ఉంటాయి.

ద్రాక్ష, ఎండుద్రాక్షలలో ఏది ఎక్కువ ప్రయోజనకరం:

ద్రాక్ష లేదా ఎండుద్రాక్ష ఏది ఎక్కువ ప్రయోజనకరమైనది అని చెప్పడం కొంచెం కష్టం.. ఎందుకంటే రెండూ వేర్వేరు పోషకాలను కలిగి ఉంటాయి. అంతే కాకుండా విభిన్న ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఆరోగ్య పరిస్థితిని బట్టి రెండింటినీ ఎంచుకోవడం మంచిది.

ద్రాక్ష యొక్క ప్రయోజనాలు:

1. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
2. గుండె ఆరోగ్యానికి మంచిది
3. కంటి చూపును మెరుగుపరుస్తుంది,
4. చర్మానికి మేలు చేస్తుంది.

ఎండుద్రాక్ష యొక్క ప్రయోజనాలు:

1. ఎముకలను బలపరుస్తుంది.
2. రక్తహీనతను నివారిస్తుంది.
3. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
4. ఇది శక్తిని అందిస్తుంది.

Also Read:  ఈ డ్రింక్ ప్రతి రోజు ఉదయాన్నే త్రాగితే బోలెడు లాభాలు !

ఏది ఎంచుకోవాలి ?

మీరు హైడ్రేటెడ్‌గా ఉండాలనుకుంటే.. ద్రాక్ష మీకు మంచి ఎంపిక.
శరీరంలో శక్తి పెరగాలంటే..మీరు ఎండుద్రాక్షను తినవచ్చు.
మీరు ఎముకలను బలోపేతం చేయాలనుకుంటే.. ఎండుద్రాక్ష మీకు మంచి ఎంపిక.

నానబెట్టిన ఎండుద్రాక్ష: నానబెట్టిన ఎండుద్రాక్ష పోషకాలను సులభంగా గ్రహించేలా చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అంతే కాకుండా శరీరం వ్యాధుల బారిన పడకుండా ఉంటుంది.

పరిమాణం: ఎండు ద్రాక్షను కూడా తగిన మోతాదులోనే తినాలి. అతిగా తినకూడదు.

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×