Top Searches On Google In India 2024 : ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ తాజాగా 2024లో ఎక్కువ మంది సర్చ్ చేసిన కొన్ని పదాల లిస్ట్ ను రిలీజ్ చేసింది. వీటిలో స్పోర్ట్స్, మూవీస్, పాలిటిక్స్ తో పాటు మరికొన్ని క్యాటగిరిలు ఉన్నాయి. అయితే వీటిలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.
గూగుల్ ప్రతీ ఏడాది ఎక్కువ మంది సర్చ్ చేసిన పదాల లిస్ట్ ను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ ఏడాది సైతం 2024లో ఎక్కువమంది సర్చ్ చేసిన విషయాలపై ఓ జాబితాను విడుదల చేసింది. వీటిలో టాప్ ప్లేస్ లో ఐపీఎల్ ఉండగా.. T20, 8 రాష్ట్రాల్లో బీజేపీ ఎలక్షన్స్, 2024 ఎలక్షన్ రిజల్ట్స్, ఒలింపిక్స్ వంటివి ఎక్కువగా ఉన్నాయి. ఇక రతన్ టాటా (Ratan Tata) గురించి ఎక్కువగా సర్చ్ చేసినట్లు గూగుల్ తెలిపింది. ప్రో కబడ్డీ (Pro Kabaddi League) , ఇండియన్ సూపర్ లీగ్ (Indian Super League), వేడి తీవ్రత (Excessive Heat) వంటి అంశాలపై నెటిజన్లు ఎక్కువగా ఫోకస్ పెట్టారు.
Top 10 Most Searched Terms in India On Google In 2024 –
ఈ విషయం తన బ్లాగ్ లో పోస్ట్ చేసిన google.. ప్రముఖ పారిశ్రామిక వేత్త దివంగత రతన్ టాటా (Ratan Tata) ను స్మరించుకుంటూ ఎక్కుగా సర్చ్ చేశారని తెలిపారు. అథ్లెట్స్ గురించి ఎక్కువగా నెటిజన్లో సర్చ్ చేశారని తెలిపింది. ఒలింపిక్స్ ఫైనల్ లో అనూహ్యరీతిలో వెనుతిరిగిన వినేశ్ ఫోగాట్, హార్దిక్ పాండ్యా (Vinesh Phogat to Hardik Pandya) కోసం ఎక్కువగా సర్చ్ చేసారని చెప్పుకు వచ్చింది.
అయితే తాము వాండర్‌లస్ట్ ఫేవరెట్ అజర్‌బైజాన్ గురించి ఎక్కువగా సర్చ్ చేస్తారనుకున్నామని.. కొత్త థీమ్స్ అన్వేషిస్తారనుకున్నామని గూగుల్ తెలిపింది. అందుకు విభిన్నంగా మరి కొన్ని విషయాలను నెటిజన్లో ఆసక్తి చూపించారని తెలిపింది. “ఎలా ఓటు వేయాలి”, “నాకు సమీపంలో ఉన్న AQI”ని తనిఖీ చేయడం, “ఆల్ ఐస్ ఆన్ రఫా” (All Eyes on Rafah) పై సర్చ్ ఎక్కువగా జరిగిందని తెలిపింది.
సినిమాల విషయానికి వస్తే.. స్త్రీ 2 (Stree 2), కల్కి(Kalki) , 12th ఫెయిల్, లాపాట లేడీస్ (Laapataa Ladies), హను-మాన్ (Hanu-man) సినిమాల కోసం ఎక్కువగా సర్చ్ చేశారని తెలిపింది. టీవీ షోల విషయానికొస్తే హీరామండి (Heeramandi), మీర్జాపూర్ (Mirzapur), పంచాయతీ (Panchayat), కోట ఫ్యాక్టరీ (Kota Factory) టాప్ ప్లేస్ లో ఉన్నాయని తెలిపింది. నాదానియన్ (Nadaaniyan), హుస్న్(Husn), యే తునే క్యా కియా (Ye Tune Kya Kiya), యే రాతేన్ యే మౌసం (Yeh Raaten Yeh Mausam) వంటి పాటలను కూడా నెటిజన్లను ఆకట్టుకున్నాయని తెలిపారు.
ALSO READ : ఇకపై ఫ్రెండ్స్ రికమండేషన్ తో జొమాటో ఫుడ్ ఆర్డర్స్