Mohan babu: ప్రస్తుతం మంచి ఫ్యామిలీలో వరుసగా జరుగుతున్న వివాదాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం ఆస్తి గొడవల కోసమే మంచి ఫ్యామిలీ అంతా రోడ్డు మీదకు వచ్చేసింది. పదిమందికి ఆదర్శంగా నిలబడాల్సిన ఫ్యామిలీ. పదిమందితో చెప్పించుకుని స్థితికి వచ్చేసింది. ఎప్పుడు మాట్లాడినా నాకు నరేంద్ర మోడీ తెలుసు. ఎన్టీఆర్ అన్నగారు. చంద్రబాబు నాయుడు మంచి స్నేహితుడు. అని డబ్బా మాటలు మాట్లాడే మోహన్ బాబు గురించి ఈరోజు మీడియా అంతా అసలైన డబ్బా కొట్టడం మొదలుపెట్టింది. కేవలం ఆస్తి గొడవల కోసమే ఈ ఫ్యామిలీ నేడు రోడ్డు మీదకు వచ్చేసింది. సాధారణ కుటుంబాల్లో కూడా జరగని గొడవలు మీ కుటుంబంలో జరుగుతున్నాయి. ఏకంగా అన్నదమ్ములు తండ్రి కొడుకులు ఇద్దరు ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం మొదలుపెట్టారు.
ముఖ్యంగా గత రెండు రోజులుగా మంచి ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఏమీ లేదు కేవలం ఇవన్నీ ఫ్యామిలీ గొడవలు అంటూ పోలీసులు కూడా మీడియాకు చెప్పేశారు. నిజం ఎక్కువ కాలం రాలేదు కాబట్టి మీడియా చెప్పిన మరికొద్ది క్షణాల్లోనే ఇద్దరు ఒకరిపై ఒకరు బహిరంగంగా కంప్లైంట్ ఇచ్చుకోవడం మొదలుపెట్టారు. ఇక మంచు విష్ణు దుబాయ్ నుంచి రావడంతో ఈ వివాదం ఇంకా హీట్ ఎక్కింది. ఇక పొద్దున్నుంచి జరుగుతున్న తీవ్ర పరిణామాలు అన్ని చూస్తుంటే ఈ హీట్ మరింత పెరిగింది. ముఖ్యంగా మోహన్ బాబు జర్నలిస్టులపై దాడి చేయడం అనేది హాట్ టాపిక్ అయింది. ఇక అంతే కాకుండా మోహన్ బాబు తనలో ఉన్న నటుడుని మరోసారి నిజ జీవితంలో బయటికి తీశాడు. అందరిపై దాడి చేసిన మోహన్ బాబు తనపై దాడి జరిగింది అంటూ, అలానే మోహన్ బాబుకు బీపీ ఎక్కువ అవ్వడంతో కింద పడిపోయాడు. హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు.
Also Read : Manchu Mohan Babu: నా ఆస్తి నా ఇష్టం.. నా ఇష్టం వచ్చిన వాళ్ళకు ఇస్తాను.. మోహన్ బాబు ఆడియో వైరల్
ఇకనట వారసులు మంచు మనోజ్ కూడా హాస్పిటల్లో జాయిన్ అవ్వడం మొదలుపెట్టాడు. ఇకపోతే ఈ వివాదం ఇప్పటికి సద్దుమణుగుతుందో తెలియని పరిస్థితి. ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలా జరిగాయి కానీ వాటిని మించి ఈ గొడవలు జరుగుతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా ఇది ఫోకస్ కావడానికి కారణం మోహన్ బాబు ఆన్ స్టేజ్ పై చూపించే అహంకారం. అంతేకాకుండా మాటకు ముందు ఒకసారి మాటక తర్వాత ఒకసారి మేము గొప్ప మేము గొప్ప అని చెప్పడం. క్రమశిక్షణకు మారుపేరు అంటూ చాలాసార్లు చెప్పిన మోహన్ బాబాయ్ నేడు క్రమశిక్షణ తప్పారు. సినిమాల్లో నటన అవకాశాలు రాకపోవడంతో నిజ జీవితంలో నటన మొదలు పెట్టాడు మోహన్ బాబు అని చెప్పాలి. ఈ కుటుంబానికి ఉన్న గౌరవం అంతంత మాత్రం ఇక నేటితో అది కూడా మట్టిలో కలిసిపోయిందని చెప్పాలి.
Also Read : Manchu Lakshmi: ఇక్కడ ఇంత రచ్చ జరుగుతుంటే.. ఏడున్నావ్ మంచు అక్క.. ?