Manchu Lakshmi: మంచు కుటుంబం పరువు బజారున పడింది. ఆస్తితగాదాల వలన మంచు మోహన్ బాబు కొడుకుల మధ్య వైరం రోడ్డెక్కింది. ముఖ్యంగా మంచు మనోజ్ ను మోహన్ బాబు , పెద్ద కొడుకు విష్ణు బయటకు గెంటెయ్యడం మరింత చర్చనీయాంశంగా మారింది. గత మూడు రోజులుగా మోహన్ బాబు ఒకపక్క, మనోజ్ ఒకపక్క కేసులు పెట్టుకుంటూనే ఉన్నారు.
తండ్రే కొట్టాడని .. అయన నుంచి ప్రాణ హాని ఉందని కొడుకు.. లేదు లేదు కొడుకే కొట్టాడు.. సీనియర్ సిటిజన్ నాకు ప్రొటక్షన్ కావాలని తండ్రి కేసుల మీద కేసులు పెట్టుకున్నారు. ఆ తరువాత మాపై దాడి జరిగింది కానీ, అది చేయించింది ఎవరో మాకు తెలియదని ఇద్దరు ప్లేట్ మార్చేశారు.
అంతలోనే అమెరికా నుంచి పెద్ద కొడుకువిష్ణు రావడం.. అన్నదమ్ముల మధ్య గొడవ.. అంతేమి లేదు మేము పరిష్కరించుకుంటామని చెప్పి ఝలక్ ఇచ్చాడు. అదే మాటను మోహన్ బాబు కూడా చెప్పి.. పెద్దోడి మాటను జవదాటని తండ్రిగా మోహన్ బాబు నిలబడ్డాడు. ఇక్కడ వరకు ఫైన్.
అయితే తన ఏడు నెలల పాపను ఇంట్లో ఉంచుకొని తనకు ఇవ్వడం లేదని.. మనోజ్ దంపతులు ఆరోపించడం షాక్ కు గురిచేస్తుంది. నా కూతురును చూడడానికి వస్తే నా తండ్రి కొట్టిస్తున్నాడు అని మనోజ్ ఆరోపిస్తున్నాడు. బౌన్సర్లతో మనోజ్ పై దాడి కూడా చేయించాడు మోహన్ బాబు.
ఇంకోపక్క ఆయన కోపంలో మీడియా ప్రతినిధులపై మైక్ విసిరాడు. మూడురోజుల నుంచి ఇదే జరుగుతుంది.. కానీ, ఇక్కడ ఎక్కడా కూడా మంచు వారసురాలు కనిపించలేదు. దీంతో అసలు మా మంచు అక్క ఎక్కడ అని ఫ్యాన్స్ ఆరాలు తీయడం మొదలుపెట్టారు.
మొదటి నుంచి మా నాన్నగారు అంత గొప్ప ఇంత గొప్ప .. మా అన్నదమ్ములు ఎప్పుడు కొట్టుకోరు. మేమంతా కలిసిమెలిసి ఉంటాం అన్న అక్క ఏడున్నావ్ ఇప్పుడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయి అని అనుకున్నప్పుడే లక్ష్మీ చాలా తెలివిగా ముంబైకి షిఫ్ట్ అయ్యింది. ప్రస్తుతం ఆమె ముంబైలోనే ఉంటుంది. ఎప్పుడైనా అవసరం అయితేనే ఆమె హైదరాబాద్ వస్తుంది. ఇక ఈ ఆస్తితగాదాల మధ్య ఆమె ఎవరి వైపు ఉంటుంది అనేది ఇప్పుడొక పెద్ద మిస్టరీగా మారింది.
నిజం చెప్పాలాంటే మనోజ్ కు తల్లి తరువాత తల్లి లక్ష్మీ. ఎలాంటి పరిస్థితిలో అయినా మనోజ్ కు సపోర్ట్ గా ఉండేది అక్క మాత్రమే. ఈ విషయాన్నీ మనోజ్ ఎన్నోసార్లు చెప్పాడు. అంతెందుకు.. మనోజ్ – మౌనిక ల పెళ్లి ఇంట్లోవాళ్ళు ఒప్పుకోకపోతే.. లక్ష్మీనే దగ్గరుండి పెళ్లి చేసింది. మనోజ్ కోసంతండ్రిని, పెద్ద తమ్ముడిని కూడా దూరం పెట్టింది.
ఇక ఇప్పుడు మనోజ్ ఇంత కష్టంలో ఉంటే మాత్రం ఎందుకు పక్కన లేదు. ఇప్పుడు ఎవరి పక్కన ఉంది. మనోజ్ కు కాల్ చేసి అడుగుతుందా.. ? లేకపోతే గొడవలు అన్ని సాల్వ్ అయ్యాక వస్తాను అని చెప్పిందా . . ? అనేది తెలియాల్సి ఉంది. ఏదిఏమైనా తమ్ముడు కష్టసమయంలో ఆమె పక్కన ఉంటే ఇంకొంచెం దైర్యంగా ఉండేది కదా అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.