Zomato : వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో (Zomato) అదిరిపోయే సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. నచ్చిన ఫుడ్ ను ఫ్రెండ్స్ రికమండ్ చేసే అవకాశం కల్పిస్తూ ‘రికమండేషన్స్ ఫ్రమ్ ఫ్రెండ్స్’ పేరుతో ఫీచర్ ను పరిచయం చేసింది.
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఈ మధ్య కాలంలో తన కస్టమర్స్ కోసం లేటెస్ట్ ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పటికే జొమాటోలో ఆర్డర్ చేసిన ఫుడ్‌ఫై ఫీడ్‌బ్యాక్, రేటింగ్ ఇచ్చే అవకాశముంది కానీ నచ్చిన ఫుడ్ మనకు రికమండ్ చేసే అవకాశం లేదు. అయితే ఈ లోటును భర్తీ చేస్తూ జొమాటో ‘రికమండేషన్స్ ఫ్రమ్ ఫ్రెండ్స్’ ఫీచర్ ను తెచ్చేసింది.
ఈ ఫీచర్ ను పరిచయం చేసిన జొమాటో… వారం క్రితమే ఈ ఫీచర్‌ను తీసుకొచ్చామని అయితే లేటెస్ట్ వెర్షన్ యాప్‌లో ఇది అందుబాటులో ఉంటుందని జొమాటో యాజమాన్యం తాజాగా వెల్లడించింది. తాజా ఫీచర్‌తో ఫ్రెండ్స్ రికమండ్ చేసిన రెస్టరంట్స్ తో పాటు ఫుడ్ సైతం ఈ జాబితాలో కనిపిస్తుంది. ఇక ఇందులో నచ్చిన వాటిని బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ కస్టమర్స్ కు మరింత ఉపయోగపడుతుందని.. సమయాన్ని ఆదా చేయటమేకాకుండా నచ్చిన ఫుడ్ ను సెలెక్ట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుందని జొమాటో సీఈవో రాకేశ్ రంజన్ వెల్లడించారు.
ఇక ఇప్పటికే తన సేవలను మరింత విస్తృతం చేసిన ఈ సంస్థ.. గత నెలలోనే మరో ఫీచర్ ను సైతం పరిచయం చేసింది. ఆహారం వృథా కాకుండా చూడటమే లక్ష్యంగా ఫుడ్ రెస్కూ (Zomato launched Food Rescue Feature) పేరుతో అదిరిపోయే ఫీచర్ ను తీసుకొచ్చింది. ఎవరైనా ఫుడ్ ఆర్డర్ చేసుకొని క్యాన్సిల్ చేస్తే ఆ ఆర్డర్ ను తీసుకెళ్తున్న డెలివరీ పార్ట్నర్ కు మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఇతర కస్టమర్స్ కు నోటిఫికేషన్ వెళుతుంది. తక్కువ ధరకే ఫుడ్ అందుబాటులో ఉందనే విషయం వారి యాప్ లో కనిపించడంతో కావాల్సిన కస్టమర్స్ ఆర్డర్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఆర్డర్ పై వచ్చిన మొత్తాన్ని పాత కష్టమర్ తో సహా రెస్టారెంట్ పార్ట్నర్ కు చెల్లిస్తామని ఇందులో జొమాటో ఎటువంటి చార్జీలు వసూలు చేయదని సైతం జొమాటో తెలిపింది. ఇక షేక్స్, స్మూతీస్, ఐస్ క్రీమ్ తో పాటు మరికొన్ని ఆర్డర్స్ కు ఈ ఆఫర్ వర్తించదని… డెలివరీ పార్ట్నర్ కు ఆర్డర్ పికప్ నుంచి చివరి డెలివరీ వరకు నగదు మాత్రం అందిస్తామని తెలిపారు. ఈ ఫీచర్ కోసం గోయల్ ట్విట్టర్ వేదికగా తెలుపగా మంచి స్పందన వచ్చింది. ఇక ఫుడ్ డెలివరీ రంగంలో తనదైన ముద్ర వేసిన జొమాటో నిత్యం లక్షలాది మందికి ఫుడ్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థలో ఉద్యోగులు సైతం లక్షల్లో ఉన్నారు.
ALSO READ : ఇకపై 15 నిమిషాల్లోనే అమెజానే డెలివరీ.. ఏ నగరాల్లో అంటే!