BigTV English

Plants : మొక్కలతో ముచ్చట్లు.. వాటి ఆరోగ్యానికి మేలు..

Plants : మొక్కలతో ముచ్చట్లు.. వాటి ఆరోగ్యానికి మేలు..
Plants

Plants : ఈరోజుల్లో ఎక్కడ చూసినా కాలుష్యం అనేది విపరీతంగా పెరిగిపోయింది. అందుకే దానికి దూరంగా జీవించాలి అని ఆశపడే వారు కూడా ఉన్నారు. అలా కాకుండా కాలుష్యానికి మధ్యలో తమకంటూ ఒక పచ్చదనాన్ని సృష్టించుకొని జీవించేవారు కూడా ఉన్నారు. వారే పర్యావరణ ప్రేమికులు. మొక్కలు పెంచడం ఇలాంటి వారికి బాగా ఇష్టం. అయితే మొక్కల పెంపకం గురించి శాస్త్రవేత్తలు ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు.


మొక్కలను పెంచడం అంత సులువైన పని కాదని.. అందరూ అంటుంటారు. కానీ మొక్కలను ప్రేమించే వారు మాత్రం మనసుతో చేస్తే ఇది చాలా సులువైన పనే అని సలహా ఇస్తున్నారు. అయితే మొక్కలను పెంచాలంటే వాటికి సరైన సన్‌లైట్ వస్తుందా లేదా చూడడం, వాటికి సరిపడా నీళ్లు అందించడం.. ఇవి మాత్రమే సరిపోవని పరిశోధకులు చెప్తున్నారు. వీటితో పాటు మొక్కలతో ముచ్చట్లు కూడా పెట్టాలట. వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా మొక్కల పెంపకం విషయంలో ఇది కూడా ఒక భాగమే అని వారు అంటున్నారు.

ఏమైనా కబుర్లు చెప్పాలి అనుకునే సమయంలో మాట్లాడడానికి ఎవరూ తోడు లేకపోవడం మానసికంగా మనిషిని మరింత బలహీనంగా చేస్తోంది. అలా కాకుండా మీకు మొక్కలు పెంచుకునే అలవాటు ఉంటే.. వాటితో కబుర్లు చెప్పడం వల్ల మానసికంగా ఆరోగ్యంగా కూడా ఉండవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. అంతే కాకుండా తాజాగా ఒక సర్వేలో ఈ విషయం నిరూపణ కూడా అయ్యింది. 1,250 మొక్కల ఓనర్లలో సగం మందికి మొక్కలతో కబుర్లు చెప్పే అలవాటు ఉందని సర్వేలో తేలింది.


మొక్కల ప్రేమికులు.. వాటితో కబుర్లు చెప్పడం ద్వారా అవి ఆరోగ్యంగా పెరుగుతాయని కూడా నమ్ముతారు. అయితే మొక్కలతో మాట్లాడడం ఏంటి అని కొందరు వింతగా చూస్తారు. కానీ మొక్కలు కూడా జీవరాశులలో ఒకటని, ఇతర జీవరాశులలాగానే అవి కూడా పర్యావరణానికి స్పందిస్తాయని పర్యావరణవేత్తలు సమాధానమిస్తున్నారు. అందుకే మొక్కలు పెరగడానికి వాటి చుట్టూ వాటికి నచ్చిన శబ్దాలు ఉంటే.. అవి మరింత ఆరోగ్యంగా పెరుగుతాయని వారు చెప్తున్నారు.

Tags

Related News

Redmi Note 14 SE: దీపావళి స్పెషల్ డీల్.. రూ.12,999కే రెడ్మీ నోట్ 14 ఎస్ఈ 5జి, ఫీచర్స్ అదుర్స్

Mobile Phones: దీపావళి ఫెస్టివల్ సీజన్ స్పెషల్.. అక్టోబర్ 2025లో విడుదలైన టాప్ మొబైల్ ఫోన్లు

Robo Dogs: చంద్రుడి మీదకు రోబో కుక్కలు.. అక్కడ అవి ఏం చేస్తాయంటే?

OnePlus Phone: బాస్.. ఈ ఫోన్ చూస్తే షాక్ అవుతారు.. OnePlus 13T ఫీచర్స్ మ్యాక్స్ హైపర్!

Motorola phone: కెమెరా బాస్ మళ్లీ వచ్చేసింది.. 125W ఫాస్ట్ ఛార్జింగ్‌తో మోటరోలా ఎడ్జ్ 70 అల్ట్రా

Flipkart Festive Dhamaka: మళ్లీ పండుగ సేల్ ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్.. 5 రోజులు మాత్రమే.. త్వరపడండి

Smartphone Comparison: రెడ్మీ 15 5జీ vs వివో Y31 5జీ vs గెలాక్సీ M36 – ఏది కొనాలి?

Tata Sumo 2025: లెజెండరీ టాటా సుమో రీఎంట్రీ.. 2025 మోడల్‌లో ఏం కొత్తగా వచ్చాయో తెలుసా?

Big Stories

×