BigTV English

RRR: ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ గెలవడానికి కారణం ఎవరంటే?

RRR: ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ గెలవడానికి కారణం ఎవరంటే?

RRR: భారతీయ సినీరంగాన్ని తలెత్తుకునేలా చేసింది ‘ఆర్ఆర్ఆర్’. యావత్ ప్రపంచం ఒక్కసారిగా భారత్ వైపు చూసేలా చేసింది. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డ్ దక్కడంతో దేశం మొత్తం ఆనందంలో మునిగిపోయింది. ‘ఆర్ఆర్ఆర్‌’తో పాటు భారత్ నుంచి ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ షార్ట్ ఫిల్మ్‌ను కూడా ఆస్కార్ వరించింది.


అయితే ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్‌’ ఆస్కార్‌కు భారత్ నుంచి అధికారికంగా నామినేట్ అయినప్పటికీ.. ‘ఆర్ఆర్ఆర్’ మాత్రం అధికారికంగా ఎంట్రీ కాలేకపోయింది. ఈక్రమంలో రమారాజమౌళి కుమారుడు కార్తికేయ ‘ఆర్ఆర్ఆర్’ మూవీని జనరల్ కేటగిరీలో ఆస్కార్‌కు పంపించాడు. అలాగే పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నిర్వహించాడు. సినిమాను గ్లోబల్ మార్కెట్‌కు తీసుకెళ్లడం వరకు అంతా అతడే దగ్గరుండి చూసుకున్నాడు. అకాడమీ ఓటర్లను అట్రాక్ట్ చేసేందుకు ప్రీమియర్ షోస్, ప్రముఖులతో ఇంటర్వ్యూస్ ప్లాన్ చేస్తూ ఎంతో కష్టపడ్డాడు.

ఇక ఆస్కార్ వేదికపై సంగీత దర్శకుడు కీరవాణి అవార్డ్ అందుకున్నాక స్పెషల్‌గా కార్తికేయకు థ్యాంక్స్ చెప్పాడు. అది ఒక్కటి చాలు తెర వెనుక కార్తికేయ ఎంత కష్టపడ్డాడో చెప్పడానికి. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా కార్తికేయపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.


Naatu Naatu: నాటు నాటుకు ఆస్కార్ అందుకే.. పాటలో పదును ఇదే..

Gold Rates : మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×