BigTV English

Little hearts: థియేటర్లలోనే కాదు ఓటీటీలో కూడా.. ఆ జాబితాలో చోటు!

Little hearts: థియేటర్లలోనే కాదు ఓటీటీలో కూడా.. ఆ జాబితాలో చోటు!

Little hearts:లిటిల్ హార్ట్స్ (Little hearts) .. చిన్న సినిమాగా సెప్టెంబర్ 5వ తేదీన విడుదలయ్యింది. పేరుకే చిన్న సినిమా అయినా.. కలెక్షన్లు మోత మోగిస్తూ భారీ సక్సెస్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అనుష్క (Anushka ) ఘాటీ, శివ కార్తికేయన్(Siva Karthikeyan) ‘మదరాసి’ చిత్రాలను కూడా వెనక్కి నెట్టి.. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే థియేటర్లలో భారీ సక్సెస్ అందుకొని కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈటీవీ విన్ యాప్ తో పాటు ఆహా ఓటీటీ వేదికగా కూడా అందుబాటులోకి వచ్చింది ఈ సినిమా. అయితే తాజాగా ఇటు ఓటీటీలో కూడా సంచలనం సృష్టించింది. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం.


థియేటర్లలోనే కాదు ఓటీటీలో కూడా..

శివాజీ లీడ్ రోల్ పోషిస్తూ తెరకెక్కిన 90’స్ బయోపిక్ ఫేమ్ మౌళి (Mouli) హీరోగా తొలి పరిచయంలో వచ్చిన చిత్రం లిటిల్ హార్ట్స్. తెలుగమ్మాయి శివాని నాగారం (Sivani nagaram) హీరోయిన్గా వచ్చిన ఈ చిత్రం మంచి విజయం అందుకుంది. లిటిల్ హార్ట్స్ 2 కి లీడ్ ఇస్తూ.. ఎక్స్టెన్షన్ వెర్షన్ తో ఈనెల 1న ఈటీవీ విన్ యాప్ లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ సినిమా.. ఇప్పటివరకు 100 మిలియన్ స్క్రీనింగ్ మినిట్స్ తో సత్తా చాటింది. అంతేకాదు అతి తక్కువ సమయంలోనే అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న చిత్రాల జాబితాలో ఒకటిగా స్థానం సంపాదించుకొని రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు చిత్ర బృందం మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసింది. ఏది ఏమైనా చిన్న మూవీగా వచ్చి అటు థియేటర్లలోనే కాదు ఇటు ఓటీటీలో కూడా సత్తాచాటుతూ దూసుకుపోతోంది ఈ సినిమా. ప్రస్తుతం ఆహాలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

లిటిల్ హార్ట్స్ సినిమా విషయానికి వస్తే..


సాయి మార్తాండ్ దర్శకత్వంలో వచ్చిన ఈ లిటిల్ హార్ట్స్ సినిమాలో రాజీవ్ కనకాల, ఎస్ఎస్ కాంచి, సత్య కృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 90’స్ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న డైరెక్టర్ ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి నిర్మాతగా మారి నిర్మించారు. కేవలం రూ.2కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిన్న చిత్రం ఇప్పటివరకు సుమారుగా రూ.60 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసినట్లు సమాచారం.

ALSO READ:Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

లిటిల్ హార్ట్స్ సినిమా స్టోరీ..

అఖిల్ (మౌళి) చదువులో యావరేజ్ స్టూడెంట్. అందుకే ఎంసెట్లో ర్యాంకు రాదు. డబ్బులు కట్టి ఏదో ఒక కాలేజీలో ఇంజనీరింగ్ చేరాలనుకుంటాడు. కానీ తండ్రి గోపాల్ రావు (రాజీవ్ కనకాల) మాత్రం లాంగ్ టర్మ్ కోచింగ్ కి పంపిస్తాడు. అటు కాత్యాయని( శివాని నాగారం) పరిస్థితి కూడా అదే. ఆమె తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్లే కావడంతో కూతుర్ని కూడా డాక్టర్ గా చూడాలనేది వాళ్ళ లక్ష్యం. అందుకే కాత్యాయని కూడా ఇంటర్ తర్వాత లాంగ్ టర్మ్ కోచింగ్ లో చేరుతుంది. అక్కడే అఖిల్ , కాత్యాయని పరిచయం పెంచుకుంటారు. తన మనసులో మాటను బయటపెడతాడు అఖిల్. అప్పుడు కాత్యాయని తనకు సంబంధించిన ఒక విషయాన్ని చెబుతుంది. దాంతో ఈ జంట ప్రేమ కథలో ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. మరి కాత్యాయని చెప్పిన విషయం ఏమిటి? వీరిద్దరి పెళ్లికి పెద్దలు ఒప్పుకున్నారా? అసలు వీళ్ళిద్దరూ తమ తల్లిదండ్రుల కలను నెరవేర్చారా? అనే విషయం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Related News

Mirai On OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన మిరాయ్.. అధికారిక ప్రకటన!

OTT Movie : ఈ నలుగురు కుర్రాళ్ళు అరాచకం భయ్యా… అన్నీ అవే సీన్లు… ఇంత ఓపెన్ గా ఎలా భయ్యా ?

OTT Movie : భర్త మోసానికి భార్య రివేంజ్… ఎవడితో పడితే వాడితో ఆ పని… చూసి తట్టుకోవడం కష్టమే

OTT Movie : పెళ్లి రోజే మొగుడికి మస్కా… వేరొకరితో భార్య శోభనం… బుర్ర పాడు చేసే సినిమా

OTT Movie : గ్రామంలో అందరినీ భయపెట్టే ఆత్మ… మతి పోగొట్టే మర్డర్ కేసు… క్లైమాక్స్ వరకు ట్విస్టులే

OTT Movie : చాకెట్లలో బంగారు టికెట్లు… తిండికి గతిలేని పిల్లాడి రాత మార్చే కథ… మనసును శాటిస్ఫై చేసే స్టోరీ మావా

OTT Movie : అమ్మాయిలనే ముట్టుకోని ఆణిముత్యం… ఆటిజం ఉన్నా అదిరిపోయే ట్రీట్మెంట్ చేసే డాక్టర్… ఒక్కో కేసులో ఒక్కో అద్భుతం

Big Stories

×