Nitish Kumar Reddy Catch: టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ లో నితీష్ కుమార్ రెడ్డి అదిరిపోయే క్యాచ్ పెట్టాడు. గాల్లోకి ఎగిరి మరి… కళ్ళు చెదిరే క్యాచ్ అందుకున్నాడు తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్… కాసేపటి క్రితమే రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించింది వెస్టిండీస్. ఈ నేపథ్యంలోనే వరుసగా వికెట్లు కోల్పోతోంది. 40 పరుగులు మాత్రమే చేసిన వెస్టిండీస్ ఇప్పటికే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
Also Read: Abhishek Sharma Sister Wedding: ఇండియా కోసం త్యాగం…వీడియో కాల్ లో సోదరి పెళ్లి చూసిన అభిషేక్ శర్మ
వెస్టిండీస్ వర్సెస్ ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ లో నితీష్ కుమార్ రెడ్డి అదిరిపోయే క్యాచ్ అందుకున్నాడు. రెండు ఇన్నింగ్స్ లో మొహమ్మద్ సిరాజ్ వేసిన బంతికి ఓపెనర్ చందర్ పాల్ భారీ షాట్ ఆడాడు. ఈ నేపథ్యంలోనే బంతి స్క్వేర్ లెగ్ వైపు వెళ్ళింది. అయితే అక్కడే ఉన్న తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి… పక్షి లాగా ఎగిరి ఆ క్యాచ్ అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నితీష్ కుమార్ రెడ్డి క్యాచ్ అందుకోవడంతో… 8 పరుగులకే చందర్ పాల్ పెవిలియన్ కు వెళ్లిపోయాడు.
అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ లో వెస్టిండీస్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. మొదటి ఇన్నింగ్స్ లో తక్కువ పరుగులకే ఆల్ అవుట్ అయిన వెస్టిండీస్… రెండో ఇన్నింగ్స్ లో అదే బాటలో నడుస్తోంది. 40 పరుగులు చేయకముందే ఏకంగా ఐదు వికెట్లు కోల్పోయింది వెస్టిండీస్. మహమ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా దెబ్బకు రెండో ఇన్నింగ్స్ లో 100 పరుగుల లోపే ఆల్ అవుట్ అయ్యాలా కనిపిస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే… మూడో రోజు అహ్మదాబాద్ టెస్ట్ ముగుస్తుందని అంటున్నారు. ఇంకా 240 పరుగుల లీడింగ్ లోనే టీమిండియా ఉంది. 40 పరుగులకే వెస్టిండీస్ ఐదు వికెట్లు కోల్పోయిన నేపథ్యంలో.. మహా అంటే మరో 100 పరుగులు చేసే ఛాన్స్ ఉంది. లేకపోతే 100 పరుగులకే విండీస్ బ్యాటర్లు కుప్పకూలే ప్రమాదం ఉంది. అలా జరిగితే.. ఇన్నింగ్స్ తేడాతో విండీస్ ఓటమి ఖాయం. ఇది ఇలా ఉండగా ఈ అహ్మదాబాద్ టెస్ట్ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ కేవలం 162 పరుగులకు కుప్పకూలింది. 44 ఓవర్లు ఆడిన వెస్టిండీస్ జట్టు… ఆల్ అవుట్ అయింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా ( Team India) 128 ఓవర్స్ ఆడి 5 వికెట్లు నష్టపోయి 448 పరుగులు చేసింది. అనంతరం డిక్లేర్ చేసింది టీమిండియా.
Also Read: Shoaib Malik Divorce: మూడో భార్యకు కూడా షోయబ్ మాలిక్ విడాకులు..? సానియా మీర్జా పాపం తగిలిందా !
⚡️WHAT A CATCH!
𝐍𝐢𝐭𝐢𝐬𝐡 𝐑𝐞𝐝𝐝𝐲 🫡🫡 #CricketTwitter #INDvsWIpic.twitter.com/4cuaA6sUJi
— Cricbuzz (@cricbuzz) October 4, 2025