Tollywood:ఈ మధ్యకాలంలో భార్య బాధితులు ఎక్కువగా పెరిగిపోతున్నారనే వార్తలను మనం ఎప్పటికప్పుడు చదువుతూనే ఉన్నాం. అయితే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక నటుడు కూడా ఇలా భార్య వేధింపులు తాళలేక ఏకంగా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. అసలు విషయంలోకి వెళ్తే.. జానపద ఇండస్ట్రీలో జానపద నటుడిగా మంచి పేరు సొంతం చేసుకున్నారు గడ్డం రాజు (Gaddam raju). ఆయన తన భార్య వేధింపుల వల్లే చనిపోతున్నాను అంటే ఒక సెల్ఫీ వీడియో తీసుకొని మరీ ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్ కి తరలించినా ఫలితం లేకపోయింది. రాజు చికిత్స పొందుతూ అక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఇటీవలే ఆయన అంత్యక్రియలు కూడా పూర్తి అయ్యాయి. ప్రస్తుతం రాజు సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ విషయం కాస్త కలకలం సృష్టిస్తోంది. విషయంలోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లాలో కాల్వ శ్రీరాంపూర్ మండలం జాఫర్ ఖాన్ పేటకు చెందిన రాజు.. జానపద పాట వీడియోలు చేస్తూ మంచి పేరు దక్కించుకున్నారు. అయితే ఆరు నెలల క్రితమే ఒక అమ్మాయిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు. కానీ అతను ఊహించుకున్నట్టు పెళ్లి తర్వాత జీవితం సాగలేదు. భార్య వేధింపులు తాళలేక బతుకమ్మ పండుగ కోసం భార్యకు తీసుకువచ్చిన చీరతోనే రాజు ఆత్మహత్య చేసుకోవడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
కన్నీళ్లు తెప్పిస్తున్న రాజు సెల్ఫీ వీడియో..
రాజు షేర్ చేసిన సెల్ఫీ వీడియోలో ఏముందంటే..”అమ్మ, నాన్న నేను బ్రతకలేకపోతున్నాను. ఇంట్లో ప్రతిక్షణం గొడవలు జరుగుతున్నాయి. నా భార్య మిమ్మల్ని ఊరికే తిడుతోంది. నా పరిస్థితి ఇల్లరికం వచ్చినట్లు ఉంది. టార్చర్ అంటే ఏంటో చూస్తున్నాను. అన్నా, వదిన, పిల్లలు జాగ్రత్త.. సౌందర్య నువ్వు మంచిగా బ్రతుకు.. నీలాంటి ఆమెకు మగవాళ్ళు సెట్ అవ్వరు. నువ్వు అన్న మాటలకు నాకు మెంటల్ టార్చర్ అవుతోంది. ఈ బ్రతుకు నాకు వద్దు. నాకు బట్టలు తీసుకోవడానికి డబ్బులు లేకపోయినా భార్య కదా అని నీకోసం కొత్త చీర కొన్నాను. అమ్మ, బాపు బై జాగ్రత్త” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ALSO READ:Tollywood: సౌందర్య శ్వేతనాగు మూవీ రచయిత కన్నుమూత.. ఆ సమస్యలే కారణమా?
భిన్నభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నెటిజన్స్..
ఏది ఏమైనా ఈ సెల్ఫీ వీడియో చూసిన నెటిజన్స్ చావు మాత్రమే సమస్యకు పరిష్కారం కాదు.. సమస్యను ఇంట్లో చెప్పి ఉండాల్సింది అని కొంతమంది కామెంట్లు చేస్తుంటే.. మరికొంతమంది విడాకులు ఇచ్చినా సరిపోయేవి కదా దీనికోసం ఏకంగా ప్రాణాలనే కోల్పోవాలా అంటూ కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా రాజు మరణం మాత్రం ఇండస్ట్రీలో పూర్తి విషాదాన్ని నింపింది అని చెప్పవచ్చు.
?utm_source=ig_web_copy_link