E-Paper
Advertisement

Trump Mobile T1: స్మార్ట్ ఫోన్ బిజినెస్‌లో అడుగుపెట్టిన ట్రంప్.. స్పెషల్ ఫీచర్స్‌తో టివన్ మొబైల్

Trump Mobile T1: స్మార్ట్ ఫోన్ బిజినెస్‌లో అడుగుపెట్టిన ట్రంప్.. స్పెషల్ ఫీచర్స్‌తో టివన్ మొబైల్
Advertisement

Trump Mobile T1 | వ్యత్తి రీత్యా పెద్ద బిజినెస్ మెన్ అయిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరో కొత్త వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ఆయన కుటుంబ సభ్యులంతా పెద్ద పెద్ద కంపెనీల్లో కీలక పదవుల్లో ఉన్నారు. తాజాగా ట్రంప్ మొబైల్ అనే కొత్త సెల్యులార్ సేవను, T1 అనే గోల్డ్ కలర్ స్మార్ట్‌ఫోన్‌ను ట్రంప్ ఫ్యామిలీ ప్రకటించింది. T1 ఫోన్ అమెరికాలో తయారవుతుందని, సెప్టెంబర్ 2025లో అందుబాటులోకి వస్తుందని ప్రకటనలో పేర్కొన్నార. ప్రస్తుతం.. ఈ ఫోన్‌ను ఆన్‌లైన్‌లో ప్రీ-ఆర్డర్ చేయవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15తో నడుస్తుంది. 6.8 ఇంచ్‌ల AMOLED స్క్రీన్, 5,000mAh బ్యాటరీ కూడా కలిగి ఉంటుంది.

ట్రంప్ మొబైల్ అనేది ట్రంప్ ఆర్గనైజేషన్ కు చెందిన సొంత బ్రాండెడ్ మొబైల్ నెట్‌వర్క్. ప్రస్తుతం “ది 47 ప్లాన్” అనే ఒక ప్లాన్‌ను అందిస్తోంది. సాధారణ టెలికాం సేవలకు ప్రత్యామ్నాయంగా ట్రంప్ మొబైల్ దీన్ని ప్రచారం చేస్తోంది. ఈ మొబైల్ నెట్‌వర్క్ సేవలు ట్రంప్ కంపెనీ మొబైల్ వర్చువల్ నెట్‌వర్క్ ఆపరేటర్ ఆధారంగా సేవలు అందిస్తోంది. దీని కోసం అమెరికాలోని AT&T, వెరిజోన్, టీ-మొబైల్ నెట్‌వర్క్‌లను ఉపయోగించి కవరేజ్ అందిస్తుందని తెలుస్తోంది.

Advertisement

T1 ఫోన్ ధర, ఫీచర్లు
ట్రంప్ మొబైల్.. వెబ్‌సైట్‌లో T1 ఫోన్ (మోడల్ – 8002)ను $499 (సుమారు రూ. 42,000) ధరతో ప్రీ-ఆర్డర్ కోసం లిస్ట్ చేశారు. కస్టమర్లు $100 డిపాజిట్ చెల్లించి ఫోన్‌ను రిజర్వ్ చేయవచ్చు. ఈ ఫోన్ సెప్టెంబర్ 2025లో అందుబాటులోకి వస్తుందని వెబ్‌సైట్ తెలిపింది. ఫోన్ బంగారు రంగు డిజైన్‌తో.. హోల్-పంచ్ డిస్‌ప్లే, వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.8 ఇంచ్‌ల AMOLED స్క్రీన్‌ కలిగి ఉంది. 20W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని అందిస్తుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 15తో లాంచ్ అవుతుంది. కెమెరాల విషయంలో.. 50-మెగాపిక్సెల్ ప్రధాన రియర్ కెమెరాతో పాటు రెండు 2-మెగాపిక్సెల్ సెన్సార్లు, 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్.. 12GB RAM, 256GB స్టోరేజ్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, AI-ఆధారిత ఫేస్ అన్‌లాక్, 3.5mm ఆడియో జాక్, USB టైప్-C పోర్ట్‌ను కలిగి ఉంటుంది.

Advertisement

ఆపిల్‌పై ట్రంప్ విమర్శలు
ఇటీవల, ట్రంప్ ఆపిల్ కంపెనీ అమెరికాకు చెందిన ఐఫోన్‌లను భారతదేశంలో తయారు చేయాలని ప్లాన్ చేయడంపై విమర్శించారు. ఒకవేళ ఆపిల్ అమెరికాలో ఉత్పత్తి చేయకుంటే, ఆ ఫోన్‌లపై 25 శాతం సుంకం విధిస్తామని హెచ్చరించారు. అయితే, ట్రంప్ ఆర్గనైజేషన్ ప్రకటించిన T1 ఫోన్‌ను ట్రంప్ మొబైల్ స్వయంగా డిజైన్ చేయడం లేదా తయారు చేయడం లేదని, మరో కంపెనీ దీనిని తయారు చేస్తుందని తెలిపింది.

ట్రంప్ నెట్ వర్క్ అందించే ‘ది 47’ ప్లాన్ వివరాలు
“ది 47 ప్లాన్” నెలకు $47.45 (సుమారు రూ. 4,000) ధరతో 20GB FUPతో 5G కవరేజ్ అందిస్తుంది. ట్రంప్ అమెరికాకు 47వ అధ్యక్ష పదవి చేపట్టడాన్ని సూచిస్తుంది. ఈ ప్లాన్ అపరిమిత కాల్స్, టెక్స్ట్‌లు, డేటాను అందిస్తుంది. అదనంగా, రోడ్‌సైడ్ అసిస్టెన్స్, టెలిహెల్త్ సేవలు కూడా ఉన్నాయి. ఫోన్‌పై “మేక్ అమెరికా గ్రేట్” నినాదం, అమెరికా జెండా ఎంబాస్ చేసి ఉంటాయి.

Also Read: వాట్సాప్‌లో చాట్‌జిపిటి.. ఇక ఇమేజ్ జెనెరేట్ చేయడం మరింత ఈజీ

ఈ ప్లాన్ 100 దేశాలకు ఉచిత అంతర్జాతీయ కాలింగ్‌ను అందిస్తుంది. సైనిక కుటుంబాలకు ఉచిత అంతర్జాతీయ టెక్స్టింగ్, తక్కువ ధరలో అంతర్జాతీయ కాలింగ్, గ్లోబల్ కవరేజ్ లభిస్తాయి. డివైస్ ప్రొటెక్షన్, డ్రైవ్ అమెరికా రోడ్‌సైడ్ అసిస్టెన్స్, ఫార్మసీ సేవలు కూడా ఉన్నాయి. కస్టమర్లు తమ పాత ఫోన్‌లతో ట్రంప్ మొబైల్ సిమ్ ఉపయోగించవచ్చు. ట్రంప్ కుటుంబం లైసెన్సింగ్ విధానాన్ని ఎంచుకోవడం ద్వారా రిస్క్‌ను తగ్గించాలని చూస్తోంది.

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×