BigTV English

Actor Arya: నటుడు ఆర్యకు బిగ్ షాక్ …ఇల్లు రెస్టారెంట్లపై ఐటి దాడులు!

Actor Arya: నటుడు ఆర్యకు బిగ్ షాక్ …ఇల్లు రెస్టారెంట్లపై ఐటి దాడులు!

Actor Arya: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు ఆర్య(Arya) ఒకరు. తెలుగులో కూడా ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆర్య నయనతార (Nayanatara)జంటగా రాజా రాణి(Raja Rani) సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. హీరోగా పెద్ద ఎత్తున తమిళ సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న ఆర్య ఇంట్లో తాజాగా ఐటి(IT) అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలో ఈయన నివాసంతో పాటు పలు ప్రదేశాలలో ఉన్న రెస్టారెంట్లపై కూడా ఐటి అధికారులు సోదాల నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. నేడు ఉదయం ‘సీ షెల్’ పేరుతో నిర్వహిస్తున్న నటుడి చెన్నై ఇల్లు మరియు రెస్టారెంట్లపై ఆదాయపు శాఖ అధికారులు దాడి చేశారు.


సీ షెల్ రెస్టారెంట్లు..

ప్రస్తుతం ఈయన ఇల్లు అలాగే రెస్టారెంట్లకు సంబంధించిన పలుచోట్ల తనిఖీలు జరుగుతున్నాయి. అధికారులు బృందాలుగా విడిపోయి ఏకకాలంలోనే తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పలు  నివేదికల ప్రకారం, కొచ్చి నుండి ఆదాయపు పన్ను అధికారులు నిర్వహించిన దాడులు ప్రస్తుతం చెన్నైలోని తేనాంపేటలోని పిన్ని రోడ్‌లోని ఆర్య నివాసంతో పాటు, అన్నా నగర్‌లోని సీ షెల్ రెస్టారెంట్‌పై కొనసాగుతున్నాయి. నటుడు ఆర్యకు చెన్నైలోని బెలచేరి, కొట్టివాకం, కిల్‌పాల్ అలాగే అన్నా నగర్‌తో సహా వివిధ ప్రాంతాలలో హోటళ్లు ఉన్నాయని తెలుస్తుంది. అయితే వీటిపై అధికారులు ఏకకాలంలోనే దాడి చేశారు.


పన్ను ఎగవేత…

ఇకపోతే ఈయన ఆదాయపు పన్ను చెల్లించక పోవటం వల్లే అధికారులు దాడి చేశారని తెలుస్తుంది. రెస్టారెంట్లను నిర్వహిస్తూనే మరోవైపు సినిమాలలో కూడా హీరోగా నిర్మాతగా భారీ స్థాయిలో నిర్మిస్తున్నప్పటికీ నటుడు ఆర్య ఆదాయపు పన్ను చెల్లించకపోవడంతోనే అధికారులు దాడిచేసినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఐటీ అధికారులు దాడి గురించి ఆర్య ఎక్కడ కూడా అధికారకంగా స్పందించకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా ఈయన తన సీ షెల్ రెస్టారెంట్లను ఇప్పటికే కేరళకు చెందిన కున్హి మూసా అనే వ్యాపారవేత్తకు రెండేళ్ల క్రితమే అమ్మేశాడు.

ఐటీ దాడులు.. స్పందించని హీరో…

కున్హి మూసా ఐటీ దాడులకు సంబంధించి ఆర్య పేరు పరిశీలనలోకి వచ్చిందని చెబుతున్నారు. ఈ ఘటనతో నటుడు ఆర్యకు ఏమాత్రం సంబంధం లేదనే వాదన వినపడుతోంది. ఇలా తన రెస్టారెంట్లను ఇతరులకు అమ్మేసిన నేపథ్యంలోనే ఈ ఘటనపై హీరో ఆర్య కూడా ఎక్కడ స్పందించలేదని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఇక నటుడు ఆర్య తమిళ సినిమాలలో నటుడిగా నిర్మాతగా కొనసాగుతూ బిజీగా ఉన్నారు. ఇక ఈయన గతంలో హీరో అల్లు అర్జున్ నటించిన వరుడు సినిమాలో విలన్ పాత్రలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అనంతరం రాజారాణి సినిమాతో తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈయన తమిళ సినిమాలలో బిజీగా గడుపుతున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×