Whatsapp ChatGpt Image| ఇప్పుడంతా ఏఐదే ట్రెండ్. ఏఐ టెక్నాలజీ ఇప్పుడు రంగాల్లో విస్తరిస్తోంది. అందుకే ప్రతి సర్వీస్ లో ఏఐని అనుసంధానం చేస్తున్నారు. అందుకే ప్రముఖ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్ లో కూడా యూజర్ల కోసం వైవిధ్యమైన ఇమేజ్ జెనేరేషన్ సేవలు అందిస్తోంది. ఇప్పటికే మెటా ఏఐ ఇమేజ్ జెనెరేటర్ అందుబాటులో ఉండగా.. కొత్తగా చాట్‌జిపిటి ఇమెజ్ జెనెరేటర్ కూడా వాట్సాప్ లో అందుబాటులోకి తెచ్చింది.
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్‌లో ఇప్పుడు కోట్లాది మంది వినియోగదారులు చాట్‌జీపీటీ శక్తిని ఉపయోగించవచ్చు. గతంలో ఈ సౌలభ్యం చాట్‌జీపీటీ మొబైల్ యాప్, వెబ్ యాప్‌లలో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు, ఎంపిక చేసిన ప్రాంతాలలోని వాట్సాప్ వినియోగదారులకు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తోంది.
ఈ ఉచిత సాధనం ద్వారా యూజర్లు వాట్సాప్ చాట్‌లలో నేరుగా AI ఇమేజ్‌లను సృష్టించవచ్చు లేదా సవరించవచ్చు. ఇది సౌలభ్యం, క్రియేటివేటి సరికొత్త లెవెల్‌కు తీసుకెళ్తుంది.
వాట్సాప్‌లో చాట్‌జీపీటీ ఇమేజ్ క్రియేటర్ ఉపయోగించడం ఎలా?
వాట్సాప్‌లో చాట్‌జీపీటీని ఉపయోగించడం ప్రారంభించడానికి ఈ స్టెప్స్‌ని అనుసరించండి:
ఎన్ని ఇమేజ్‌లు క్రియేట్ చేయవచ్చు
ప్రస్తుతం.. యూజర్లు ఉచితంగా ప్రతిరోజు ఒక ఇమేజ్ మాత్రమే క్రియేట్ చేయవచ్చు. దీనికి సుమారు 24 గంటల కూల్‌డౌన్ సమయం ఉంటుంది. ఇమేజ్ క్రియేట్ చేయడానికి రెండు నిమిషాల కంటే తక్కువ సమయం పడుతుంది.ఇది సులభమైన, వేగవంతమైన అనుభవాన్ని అందిస్తుంది.
అయితే, కొందరు వినియోగదారులు తమ ఓపెన్‌ఏఐ ఖాతాను వాట్సాప్‌తో లింక్ చేయడంలో సమస్యలను ఎదుర్కొన్నారు. ఓపెన్‌ఏఐ ఈ ఇంటిగ్రేషన్‌ను ఇంకా సరిచేస్తోంది, త్వరలో స్థిరమైన రోల్‌అవుట్ జరుగుతుందని వాట్సాప్ మాతృ సంస్థ అయిన మెటా తెలిపింది.
వాట్సాప్‌లో చాట్‌జీపీటీ: కేవలం ఇమేజ్‌లు మాత్రమే కాదు మరెన్నో
ఇమేజ్ క్రియేషన్ మాత్రమే కాకుండా.. వాట్సాప్‌లో చాట్‌జీపీటీ రోజువారీ పనులలో సహాయపడుతుంది. ఇమెయిల్‌లు రాయడం, వంటకాలు రెసిపీలు రెడీ చేసి ఇవ్వడం, టెక్స్ట్‌ను సరిచూడడం, చిత్రాలను అప్‌లోడ్ చేసి వాటిని వివరించడం వంటి పనులను చేయవచ్చు.
మెటా ఇప్పటికే వాట్సాప్‌లో.. మెటా AI అసిస్టెంట్‌ను ప్రవేశపెట్టినప్పటికీ, చాట్‌జీపీటీ తన ఈజీ కమ్యూనికేషన్ పవర్, ఇమేజ్ క్రియేయన్ సామర్థ్యంతో పోటీపడుతోంది.
Also Read: ఇకపై వాట్సాప్‌లో యాడ్స్.. యూజర్ డేటా ఆధారంగానే
వాట్సాప్ ఇంటిగ్రేషన్ ద్వారా చాట్‌జీపీటీ అధునాతన AI సాధనాలను మరింత సులభంగా అందుబాటులోకి తెచ్చింది. ఇమేజ్ క్రియేటివిటీ నుండి ప్రొడక్ట్‌విటీ హాక్స్ వరకు, చాట్‌జీపీటీ ఇప్పుడు వాట్సాప్‌లో మీ AI అసిస్టెంట్‌గా ఉంటుంది. ఈ ఫీచర్ యూజర్లకు కొత్త అవకాశాలను అందిస్తూ.. సౌలభ్యం, క్రియేటివిటీని పెంచుతుంది.