E-Paper
Advertisement

ఏపీకి శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జూన్ ఒకటి నుంచి రైల్వే జోన్, ఆపై బుల్లెట్ రైళ్లు, ముఖచిత్రం మారడం ఖాయం

ఏపీకి శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జూన్ ఒకటి నుంచి రైల్వే జోన్, ఆపై బుల్లెట్ రైళ్లు, ముఖచిత్రం మారడం ఖాయం
Advertisement

Ashwini Vaishnaw: విశాఖ గూగుల్ ఏఐ డేటా సెంటర్ ప్రారంభంలో కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర రైల్వేమంత్రి అశ్వని వైష్ణవ్. దక్షిణాదిపై మోదీ సర్కార్‌పై ఎలాంటి వివక్ష లేదని కుండబద్దలు కొట్టేశారు. జూన్ ఒకటి నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభమవుతుందని మనసులోని మాట బయటపెట్టారు.

ఏపీకి శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్

Advertisement

మంగళవారం విశాఖలోని తుర్లవాడ ప్రాంతంలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు హాజరయ్యారు కేంద్రమంత్రి అశ్వని వైష్ణవ్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విశాఖ రైల్వే జోన్, బుల్లెట్ రైళ్ల గురించి కీలక విషయాలు ప్రస్తావించారు. జూన్ ఒకటి నుంచి విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ను నోటిఫై చేస్తామని ప్రకటించారు.

విశాఖ వద్ద రైల్వే జోన్ కోసం శాశ్వత భవనాల నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం తాత్కాలిక భవనాల్లో కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిపారు. సిబ్బంది కేటాయింపు నిధులు, విధులు తెలియచేసేలా అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉందన్నారు. దేశంలో ఉన్న 17 రైల్వే జోన్ల సరసన విశాఖ చేరనుంది.

Advertisement

జూన్ ఒకటి నుంచి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కార్యకలాపాలు మొదలు

ఏప్రిల్ ఒకటిన అధికారిక నోటిఫికేషన్ రైల్వేశాఖ ఇస్తుందని అనుకున్నారు. అనివార్య కారణాల వల్ల డిలే అవుతూ వచ్చింది. రైల్వే నెట్‌వర్క్ విషయంలో ఏపీ 100 శాతం ఎలక్ట్రిఫికేషన్ జరిగిందన్నారు సదరు మంత్రి. 1759 కిలోమీటర్ల రైల్వేట్రాక్ ఇప్పటికే పూర్తి అయ్యిందన్నారు. ఇంకా 3,300 కిలోమీటర్ల రైల్వేట్రాక్ నిర్మాణం జరుగుతోందన్నారు.

న్యూజనరేషన్ రైళ్లు, ఏపీకి 16 వందే భారత్ రైళ్ల సర్వీసులు రానున్నాయని తెలిపారు. అదే సమయంలో బుల్లెట్ గురించి కీలక అంశాలు ప్రస్తావించారు. తెలుగు రాష్ట్రాల రాజధానులు అమరావతి – హైదరాబాద్‌ మధ్య బుల్లెట్ ట్రైన్‌‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

ఈ రెండు నగరాల మధ్య కేవలం 70 నిమిషాల్లో చేరుకోవచ్చన్నవారు. చెన్నై నుంచి అమరావతికి దాదాపు రెండు గంటల్లో ప్రయాణం సాధ్యమవుతుందన్నారు.హైదరాబాద్ నుంచి బెంగళూరుకు  కేవలం రెండు గంటల్లో చేరుకోవచ్చన్నారు.  బుల్లెట్ ట్రైన్స్ ద్వారా దక్షిణాది ముఖ చిత్రం మారబోతోందన్నారు. బుల్లెట్ రైళ్లత హైస్పీడ్ డైమండ్ కారిడార్ ఏర్పాటు కాబోతుందన్నారు.

ALSO READ: విశాఖకు గూగుల్ రాక ఏపీకి గేమ్ ఛేంజర్ అవుతుంది- సీఎం చంద్రబాబు

కోల్‌కోతా నుంచి చెన్నై వరకు తూర్పు కోస్తా రైల్వే డబుల్ లైన్లను నాలుగు లైన్లగా మారుస్తామని రైల్వేమంత్రి వెల్లడించారు. కంటైనర్, ఫ్రైట్ ట్రైన్లతో పాటు 500 రైళ్లతో ఈ ప్రాంతాన్ని అనుసంధానిస్తామన్నారు. డబుల్ ఇంజన్ బులెట్ ట్రైన్ సర్కార్ ద్వారా ఏపీకి ఎక్కువగా కేటాయించామన్నారు.

ఉమ్మడి ఏపీకి కేవలం రూ. 886 కోట్ల బడ్జెట్ ఉండేదన్నారు. ప్రస్తుతం రూ.1.06 లక్షల కోట్ల రైల్వే ప్రాజెక్టులు ఏపీని కనెక్ట్ చేస్తూ నిర్మాణం జరుగుతున్నట్లు చెప్పారు. దేశంలో తొలిసారి నవ నిర్మాణ్ ప్రాజెక్టు ద్వారా ఏపీలో 74 స్టేషన్ల‌ను ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. అందులో 832 ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు నిర్మాణం జరిగాయని, 1039 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణం జరుగుతోందన్నారు. 22 అమృత్ భారత్ సర్వీసులు ఏపీ నుంచి నడుస్తున్నాయని, రైళ్ల డిజైన్, ఉత్పత్తిలో జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు.

Related News

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

ఎవరీ పూల సుబ్బయ్య? వెలిగొండ ప్రాజెక్టుకు ఆయన పేరు ఎందుకు పెట్టారు?

వెలిగొండకు వైఎస్సార్ వెలుగైతే.. చంద్రబాబు చీకటి.. షర్మిల ఘాటు వ్యాఖ్యలు

గోదావరి నీళ్లు నల్లమల సాగర్‌కు రావాలి.. మాట ఇచ్చాను, ప్రాజెక్టు పూర్తి చేశాం-సీఎం చంద్రబాబు

Big Stories

Advertisement
×