BigTV English

Best Biryanis Hyderabad: హైదరాబాద్ లో బెస్ట్ బిర్యానీ సెంటర్స్, ఒక్కసారి వెళ్తే జీవితంలో మర్చిపోరు!

Best Biryanis Hyderabad: హైదరాబాద్ లో బెస్ట్ బిర్యానీ సెంటర్స్, ఒక్కసారి వెళ్తే జీవితంలో మర్చిపోరు!

Hyderabad Biryani: హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. దశాబ్దాల క్రితం నుంచే భాగ్యనగరంలో బిర్యానీ ఘుమఘుమలు వ్యాపించాయి. కాలక్రమేణా, హైదరాబాదీలకు బిర్యానీ పట్ల మక్కువ పెరిగింది. స్థానికులు మాత్రమే కాదు, ప్రపంచ నలుమూలల నుంచి హైదరాబాద్ లో అడుగు పెట్టే ఎవరైనా ఇక్కడి బిర్యానీ రుచి చూడాల్సిందే. ఆహా అంటూ మైమరచిపోవాల్సిందే. ఇంతకీ హైదరాబాద్ లో ఉన్న బెస్ట్ బిర్యానీ సెంటర్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..


హైదరాబాద్ లో టాప్ 5 బిర్యానీ సెంటర్లు

⦿ కేఫ్ బహార్: కేఫ్ బహార్‌ ఎంతో రుచికరమైన బిర్యానీ అందిస్తుంది. ఈ రెస్టారెంట్ 1973 నుంచి అసలైన హైదరాబాదీ బిర్యానీని అందిస్తోంది. నగరానికి  వచ్చిన ఒక పర్షియన్ వ్యక్తి కేఫ్ బహార్ ను ప్రారంభించారు. బిర్యానీలతో పాటు, చికెన్ టిక్కా కబాబ్‌లు, మటన్ బోటి కబాబ్‌లు ప్రపంచ వ్యాప్తంగా అతిథులను ఆకర్షిస్తున్నాయి.


⦿ హోటల్ షాదాబ్: ఈ రెస్టారెంట్లో అద్భుతమైన బిర్యానీ లభిస్తుంది. హైదరాబాద్ లో బిర్యానీ తినడానికి బెస్ట్ సెంటర్లలో ఇదీ ఒకటిగా కొనసాగుతోంది. సంప్రదాయ హైదరాబాదీ బిర్యానీని ఆస్వాదించాలనుకునే వారికి ఇది చక్కటి కేంద్రంగా చెప్పుకోవచ్చు. ఖాజా పాషా స్థాపించిన ఈ రెస్టారెంట్ ఇప్పుడు ఏడు దశాబ్దాలను పూర్తి చేసుకుంది. ఈ రెస్టారెంట్ అనేక రకాల వంటకాలను అందిస్తుంది.

⦿ పారడైజ్: మీరు హైదరాబాద్ ను సందర్శించి పారడైజ్ లో బిర్యానీ తినకపోతే మీ పర్యటన వ్యర్థం అని చెప్తుంటారు చాలా మంది. ఈ రెస్టారెంట్ లో రెడీ అయ్యే బిర్యానీ ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇక్కడి బిర్యానీ చక్కటి రుచి రావడానికి వండే ఫార్ములానే కీలకం అంటారు పారడైజ్ రెస్టారెంట్ యజమాని డాక్టర్ ఖాజిమ్ హేమతి.  1953లో సికింద్రాబాద్‌ లోని ఈ రెస్టారెంట్ ప్రారంభమైంది. 1978 నుంచి హేమతి ఈ రెస్టారెంట్ ను నడిపిస్తున్నారు. ప్రస్తుతం పారడైజ్ తన రెస్టారెంట్లను దేశ వ్యాప్తంగా పలు నగరాలకు విస్తరిస్తోంది.

⦿ బావర్చి: హైదరాబాద్ లో ఎక్కువ మంది ఇష్టపడే బిర్యానీ బావర్చి బిర్యానీ. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని ఈ రెస్టారెంట్ లో నిత్యం వేలాది మంది బిర్యానీని ఎంజాయ్ చేస్తుంటారు. జొమాటో ఇక్కడి నుంచి రోజుకు 2,000 కంటే ఎక్కువ ఆర్డర్లను అందుకుంటున్నట్లు వెల్లడించింది. ఇక్కడ అత్యంత ప్రజాదరణ పొందిన వంటకాల్లో  చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ టాప్ ప్లేస్ లో ఉన్నాయి.

Read Also: జస్ట్ రూ.9తో ఏడాదంతా బావర్చి బిర్యానీ ఫ్రీ.. అస్సలు మిస్సవ్వద్దు!

⦿ షా ఘౌస్: ఇక్కడ బిర్యానీలు, మటన్ కర్రీలు సాంప్రదాయ ప్రత్యేక మసాలాలతో చక్కటి రుచిన అందిస్తాయి.  మొహమ్మద్ రబ్బానీ, మొహమ్మద్ ఘౌస్ పాషా, మొహమ్మద్ ఇర్ఫాన్ 2008లో ఈ రెస్టారెంట్ నుస్థాపించారు. USAలోని వాల్ స్ట్రీట్ జర్నల్ విడుదల చేసిన భారతదేశంలోని ఉత్తమ బిర్యానీ సెంటర్లలో షా ఘౌష్ స్థానం పొందింది.

Read Also:  హైదరాబాద్ లో ఇదే కాస్ట్లీయెస్ట్ బిర్యానీ, ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Related News

Free Biryani: జస్ట్ రూ.9తో ఏడాదంతా బావర్చి బిర్యానీ ఫ్రీ.. అస్సలు మిస్సవ్వద్దు!

AP heli tourism: కార్లకు గుడ్‌బై.. ఇక హెలికాఫ్టర్ రైడ్స్ తోనే టూర్స్.. ఏపీలో ఇక జర్నీ గాలిలోనే!

Hyderabad Costliest Biryani: హైదరాబాద్ లో ఇదే కాస్ట్లీయెస్ట్ బిర్యానీ, ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Indian Railways rules: ప్రయాణికులకు అలర్ట్.. కొత్త లగేజ్ రూల్స్ పై క్లారిటీ ఇదే!

Strange Story: పచ్చ రంగు చర్మం.. మెరిసే కళ్లు.. ఆ పిల్లలను చూసి గ్రామస్తులు బెంబేలు.. ఎక్కడంటే?

Big Stories

×