OTT Movie : అమ్మాయిల అక్రమ రవాణా ఎప్పటినుంచో జరుగుతూనే ఉంది. ఎంత అడ్డుకట్ట వేసినా, ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితులు పెరుగుతూనే ఉన్నారు. పోలీస్ స్టేషన్ లలో లెక్కపెట్టలేనన్ని అమ్మాయిల మిస్సింగ్ కేసులు పెండింగ్ లోనే ఉన్నాయి. అసలు వీళ్లంతా ఏమైపోయారో తెలుసుకోలేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చిన ఒక వెబ్ సిరీస్, అమ్మాయిల మిస్సింగ్ తో మొదలై క్రూరమైన హింస, అసభ్యత, ట్రాఫికింగ్ వాస్తవాలతో ముగుస్తుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
‘Flesh’ ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. దీనికి డానిష్ అస్లామ్ దర్శకత్వం వహించారు. ఈ ఎనిమిది ఎపిసోడ్‌ల సిరీస్ హ్యూమన్ ట్రాఫికింగ్ థీమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇందులో స్వరా భాస్కర్, అక్షయ్ ఒబెరాయ్, మహిమా మక్వానా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 2020 ఆగస్టు 21న ఎరోస్ నౌలో విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా అందుబాటులో ఉంది.
కథలోకి వెళ్తే
జోయా అనే 16 ఏళ్ల NRI అమ్మాయి, ముంబైలో తన తల్లిదండ్రులు షేఖర్, రేబాతో నివసిస్తుంటుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో చురుకుగా ఉంటుంది. ఒకసారి ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ రావడంతో అవతలి వ్యక్తి తో పరిచయం పెంచుకుంటుంది. ఆతరువాత అతనే ఆమెను కిడ్నప్ చేస్తాడు. ఆమె షువో అనే వ్యక్తి అధీనంలో ఉండే ట్రాఫికింగ్ రింగ్‌లో చిక్కుకుంటుంది. దీనిని అతని మేనల్లుడు నికేతన్ నడుపుతుంటాడు. మరోవైపు ACP రాధా అనే ఒక ధైర్యవంతమైన పోలీసు అధికారి, జోయా ఆచూకీ కోసం వెతకడం మొదలు పెడుతుంది. ఈ క్రమంలో ఒక భయంకరమైన హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్ గురించి ఆమె తెలుసుకుంటుంది.
ACP రాధా తన అసిస్టెంట్ నమన్ తో కలిసి, ముంబై, కోల్‌కతా మధ్య కదిలే ఈ క్రిమినల్ రింగ్‌ను ఆపడానికి ప్రయత్నిస్తుంది. అదేసమయంలో రాజ్జీ అనే బాధితురాలు, తప్పించుకోవడానికి పోరాడుతుంది. ఈ సిరీస్ రాధా, రాజ్జీ ధైర్యం, పట్టుదలను హైలైట్ చేస్తుంది. చివరి ఎపిసోడ్ ఒక ట్విస్ట్‌తో ముగుస్తుంది. ఈ ట్రాఫికింగ్ నెట్‌వర్క్ ను ఛేదించడంలో రాధా విజయం సాధిస్తుందా ? రాజ్జీ, జోయా ఆ కిడ్నాపర్లనుంచి బయటపడతారా ? ఈ స్టోరీ క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను మిస్ కాకుండా చుడండి.
Read Also : మనిషి మాంసాన్ని పీక్కుతినాలనే ఆకలి… ఈ అక్కాచెల్లెళ్ల అరాచకం చూస్తే గుండె గుభేల్… పోతారు మొత్తం పోతారు