IBPS Clerk Jobs: బ్యాంకింగ్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) నుంచి భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగంలో సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వెకెన్సీలు ఉన్నాయి. నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హతలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం, ముఖ్యమైన తేదీలు, తదితర ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం.
నోట్: దరఖాస్టు గడువు ఆగస్టు 21తో ముగియనుండగా.. ఐబీపీఎస్ ఈ నెల వరకు దరఖాస్తు గడువును పెంచింది.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) నుంచి 10,277 క్లర్క్ పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్ట్ 28న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 10,277
కామన్ రిక్రూట్ మెంట్ ప్రాసెస్ – కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
పోస్టులు – వివరాలు:
కస్టమర్ సర్వీస్ అసోసియేట్(సీఎస్‌ఏ): 10,277
రాష్ట్రాల వారీగా ఖాళీలు..
1. తెలంగాణ: 261 పోస్టులు
2. ఆంధ్రప్రదేశ్: 367 పోస్టులు
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు. స్థానిక భాషలో చదవడం, రాయడం కూడా వచ్చి ఉండాలి.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
వేతనం: ఉద్యోగంలోకి సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.24,050 నుంచి రూ.64,480 జీతం ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి అప్లై చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఆగస్టు 1
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఆగస్టు 28
అడ్మిట్ కార్డులు: 2025 సెప్టెంబర్
ప్రిలిమ్స్: 2025 అక్టోబర్
మెయిన్స్: 2025 నవంబర్
రిజల్ట్స్: 2026 మార్చి
దరఖాస్తు ఫీజు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.850 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, ఈఎస్ఎం, డీఈఎస్ఎం అభ్యర్థులకు రూ.175 ఫీజు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: ప్రిలిమ్స్, మెయిన్స్, స్థానిక భాష పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
ఎగ్జామ్ సెంటర్స్: దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి. అభ్యర్థులు అప్లికేషన్ సమయంలో ఎగ్జామ్ సెంటర్ ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.ibps.in/
నోటిఫికేషన్ కీలక సమాచారం:
మొత్తం వెకెన్సీల సంఖ్య: 10,277
దరఖాస్తుకు చివరి తేది: ఆగస్ట్ 28