SSMB29 : కేవలం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్న సినిమా SSMB29. మహేష్ బాబు కి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు లేకపోయినా కూడా ఎస్.ఎస్ రాజమౌళి అనే బ్రాండ్ కు ఉన్న రేంజ్ వేరు. తెలుగు సినిమాని తీసుకెళ్లి ఎక్కడో శిఖరం మీద కూర్చుని పెట్టిన ఘనత ఎస్ఎస్ రాజమౌళికి మాత్రమే ఉంది.
బాహుబలి సినిమా ఏ ముహూర్తాన రాజమౌళి తెరకెక్కించాడో అక్కడితో తెలుగు సినిమా దిశా దశ అన్నీ మారిపోయాయి. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమాలు సత్తా చాటుతున్నాయి. ఆ గేట్ ఓపెన్ చేసింది ఎస్ ఎస్ రాజమౌళి. త్రిబుల్ ఆర్ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మీద క్యూరియాసిటీ ఉంది.
రిలీజ్ డేట్ ఫిక్స్
రాజమౌళి సినిమా రిలీజ్ డేట్ విషయంలో చాలా తేడాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అనుకున్నది అనుకున్న టైం కి అవ్వదు. ఒకవేళ అయినా కూడా తాను అనుకున్నట్లు రాలేదు అని జక్కన్న పర్ఫెక్షన్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. లేట్ అయినా కూడా జక్కన్న సినిమాతో మాత్రం అసంతృప్తి చేయడు. మొత్తానికి SSMB29 సినిమాను మార్చి 25,2027లో రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. అయితే దీని గురించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఈ డేట్ ను మాత్రం వస్తే మహేష్ అభిమానులకు అది పెద్ద పండుగనే చెప్పాలి. అంతేకాకుండా తెలుగు సినిమా కూడా కొత్త రికార్డులను సృష్టిస్తుంది. మహేష్ బాబు స్టామినా ఏంటో ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది.
మహేష్ మొదటి పాన్ ఇండియా
తెలుగు రాష్ట్రాల్లో మహేష్ బాబు క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు మధ్య మంచి పోటీ నడిచేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయిపోవడం వలన సినిమాలు మీద ఆసక్తి కొద్ది మేరకు తగ్గించారు. అంతేకాకుండా రాజకీయం పరంగా పవన్ కళ్యాణ్ ను ఇష్టపడని అభిమానులు కూడా పుట్టుకొచ్చారు. మొదటిసారి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతో పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చారు. అది కంప్లీట్ డిజాస్టర్. ఇప్పుడు మహేష్ బాబు సినిమా మాత్రం డిజాస్టర్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆ సినిమాను డీల్ చేస్తున్నది జక్కన్న. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే తెలిసిన మహేష్ స్టామినా ఈ సినిమా విడుదలయ్యాక ప్రపంచానికి తెలుస్తుంది.
Also Read : OG Movie: ఇంకా బ్యాలెన్స్ షూటింగ్ ఉందా? మరో వాయిదా తప్పదా?