Vivo Y300 Pro Price: దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో వివో ఫోన్లకు అద్భుతమైన డిమాండ్ ఉంది. వివో ఫోన్ అంటేనే కెమెరా కింగ్ అని కొందరు అంటుంటారు. అంతటి క్రేజ్ ఉంది ఈ కంపెనీ ఫోన్లకు. అందువల్లనే డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వివో కంపెనీ మార్కెట్‌లో కొత్త కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ ఆకట్టుకుంటుంది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా తమ ఫోన్లలో అధునాతన టెక్నాలజీతో ఫీచర్లను అందించి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అలాగే సామాన్యులకు అందుబాటు ధరలో అతి తక్కువకే స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేస్తూ మరింత గుర్తింపు సంపాదించుకుంది.
ఇప్పటికే ఎన్నో మొబైళ్లను మార్కెట్‌లో లాంచ్ చేసిన వివో కంపెనీ తాజాగా మరొక స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. Vivo బ్రాండ్ చైనీస్ మార్కెట్లో Vivo Y300 Pro స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించింది. ఇందులో 120Hz కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ Vivo Y300 Pro స్పెసిఫికేషన్‌లు, ధర, ఇతర విషయాలను తెలుసుకుందాం.
Vivo Y300 Pro Specifications
Vivo Y300 Pro స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. Y300 ప్రో ఫోన్ 6.77-అంగుళాల (2392 x 1080 పిక్సెల్‌లు) 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది గరిష్టంగా 5000 nits గరిష్ట ప్రకాశం, 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఇది Qualcomm Snapdragon 6 Gen 1 SoCతో పాటు 12GB వరకు RAM + 512GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌ను పొందుతుంది. ఇక ఫోన్ కెమెరాల విషయానికొస్తే.. ఇందులో 50MP డ్యూయల్ రియర్ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరా సెన్సార్ ఉన్నాయి.
Also Read: మోటో మామ అదరగొట్టేశాడు.. 50MP కెమెరా సహా మరెన్నో అధునాతన ఫీచర్లతో కొత్త ఫోన్ లాంచ్!
ఈ స్మార్ట్‌ఫోన్ OriginOS 14తో Android 14లో నడుస్తుంది. Y300 Pro కూడా 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6500mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. అంతేకాకుండా ఈ హ్యాండ్‌సెట్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్.. దుమ్ము, నీటి నిరోధకత కోసం IP65 రేటింగ్ ఉన్నాయి. ఇ క కనెక్టివిటీ కోసం ఇందులో 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.1, GPS, USB టైప్-సి పోర్ట్ వంటివి మరిన్ని ఉన్నాయి.
Vivo Y300 Pro Price
చైనాలో లాంచ్ అయిన Vivo Y300 Pro ధర విషయానికొస్తే.. ఇది మొత్తం నాలుగు వేరియంట్లలో లాంచ్ అయింది. అందులో Vivo Y300 Pro బేస్ 8GB + 128GB వేరియంట్ CNY 1799 (సుమారుగా రూ.21,000), మిడ్ రేంజ్ 8GB + 256GB వేరియంట్ ధర CNY 1,999 (సుమారు రూ. 23,000), ఆ తర్వాత రేంజ్ 12GB + 256GB వేరియంట్ ధర CNY 2,199 (సుమారు రూ. 26,000) ఉండగా.. దీని టాప్ ఎండ్ హై 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 2,499 (దాదాపు రూ. 29,000)గా కంపెనీ నిర్ణయించింది. ఇది బ్లాక్ జేడ్, గోల్డ్ విత్ జేడ్, వైట్, టైటానియం వంటి కలర్ ఆప్షన్‌లలో పరిచయం చేయబడింది.