OG Movie: ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్న సినిమా ఓజి. ఈ సినిమా గురించి ఎదురు చూడటానికి పలు రకాలు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా దర్శకుడు సుజిత్ (Sujeeth) పవన్ కళ్యాణ్ కు వీర అభిమాని.పవన్ కళ్యాణ్ తో సినిమా అనౌన్స్ చేసినప్పుడే సుజిత్ వీడియోలు అప్పట్లో వైరల్ గా మారాయి.
ఓ జి సినిమాకి సంబంధించి గ్లిమ్స్ వీడియో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ వీడియో మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో జోష్ నింపింది. అలానే సినిమా మీద కూడా మంచి హైప్ క్రియేట్ చేసింది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పటివరకు పలు కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు మరోసారి ఈ సినిమా వాయిదా పడుతున్నట్లు సమాచారం వినిపిస్తుంది.
షూటింగ్ డిలే
ఓజి సినిమాకి సంబంధించి చిత్ర యూనిట్ మంచి కాన్ఫిడెంట్ గా ఉంది. ఖచ్చితంగా సెప్టెంబర్ 25న విడుదల చేస్తున్నట్లు రీసెంట్ గా కూడా ప్రకటించారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇంకో ఆరు రోజులు షూటింగ్ చేయాల్సిన పరిస్థితి ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం వినిపిస్తుంది. సెప్టెంబర్ 25న రిలీజ్ పెట్టుకుని ఇంకో ఆరు రోజులు షూటింగ్ ఉంది అంటే అది కొంచెం టెన్షన్ పెట్టే పని అని చెప్పాలి. అనుకున్నవి అనుకున్న టైం కి అయిపోతే పర్వాలేదు కానీ లేకపోతే ఖచ్చితంగా సినిమా వాయిదా పడే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఎక్స్పెక్టేషన్స్ పెంచిన ఫస్ట్ సింగిల్
ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ఈ టైటిల్ ట్రాక్ అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికీ ఈ సాంగ్ లూప్ లో వింటున్న వాళ్లు కూడా ఉన్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ లాస్ట్ ఫిలిం హరిహర వీరమల్లు (Hari Hara Veeramallu) ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆ సినిమాను ప్రమోట్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. గతంలో ఎప్పుడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ ఆ సినిమాను ప్రమోట్ చేశారు. ముఖ్యంగా ఆ సినిమాకు సంబంధించి విఎఫ్ఎక్స్ వర్క్ దారుణంగా ఉంది అని కామెంట్స్ కూడా వచ్చాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఆ సినిమాను ట్రోల్ చేశారు. పవన్ కళ్యాణ్ అభిమానుల అంచనాలన్నీ ఓజీ, హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ (Usthad Bhagath Singh) సినిమాల మీద ఉన్నాయి.
Also Read: SSMB29: దట్టమైన అడవుల్లో, క్రూర మృగాల మధ్య షూటింగ్ చేస్తున్న రాజమౌళి