Shock to Airtel Customers: రిలయన్స్ జియో తర్వాత ఇప్పుడు ఎయిర్‌టెల్ కూడా ప్రీపెయిడ్ వినియోగదారులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఎప్పటినుంచో చాలా మంది ఎక్కువగా ఉపయోగిస్తున్న రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఎయిర్‌టెల్ సైలెంట్ గా తొలగించింది. ఈ నిర్ణయంపై యూజర్లు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు ఇచ్చే ఈ ప్లాన్ ఎవరూ ఊహించని విధంగా మాయం కావడం వినియోగదారులకు నిరాశ కలిగిస్తోంది.
రూ.249 ఎయిర్‌టెల్ ప్లాన్‌లో ఏమి ఉండేవి?
ఈ ప్లాన్‌తో ప్రతిరోజూ 1 జీబీ హైస్పీడ్ డేటా, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్, అలాగే అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభించేవి. అదనంగా ఎక్స్‌ట్రీమ్ ప్లే ఉచిత యాక్సెస్, పర్ప్లెక్సిటీ ప్రో ఏఐ, హలోట్యూన్ ఉచితం వంటి సదుపాయాలు కూడా ఉండేవి. అంతేకాదు, దీని చెల్లుబాటు 24 రోజులు. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం ఏమిటంటే ఈ ప్లాన్‌తో జనవరి 2026 వరకు ఉచిత ఏఐ యాక్సెస్ కూడా లభించింది. ఇప్పుడు ఈ రూ.249 ప్లాన్ తొలగించబడడంతో వినియోగదారులు తప్పనిసరిగా రూ.299 ప్లాన్ వైపు వెళ్లాల్సి వస్తుంది.
Also Read:Micro Workout: జిమ్‌కు వెళ్లడానికి సమయం లేదా ? ఇలా చేస్తే ఫుల్ ఫిట్ నెస్
రూ.299 ఎయిర్‌టెల్ ప్లాన్‌లో ఏమి ఉంది?
ఈ ప్లాన్‌లో కూడా ప్రతిరోజూ 1 జీబీ హై స్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్, అలాగే అపరిమిత కాల్స్ లభిస్తాయి. కానీ ఇది 28 రోజులు మాత్రమే ఉండేది. అదనంగా స్పామ్ అలర్ట్, హలోట్యూన్ ఉచితం, పర్ప్లెక్సిటీ ప్రో ఏఐ (Perplexity AI) యాక్సెస్ లభిస్తుంది. అంటే కొంచెం అదనంగా 50 రూపాయలు పెట్టినా నాలుగు రోజుల ఎక్కువ వాలిడిటీ లభిస్తున్నప్పటికీ, తక్కువ బడ్జెట్‌తో రోజువారీ డేటా చూసుకునే వినియోగదారులకు మాత్రం రూ.249 ప్లాన్ మాయం కావడం నిరాశే అని చెప్పాలి.
మరి జియో పరిస్థితి ఏంటి?
జియోలో కూడా రూ.249 ప్లాన్ ఉండేది. దీంట్లో ప్రతిరోజూ 1 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్, పరిమితి లేకుండా కాల్స్ చేసుకునే అవకాశం లభించేది. అంతే కాదు అదనంగా జియో టీవీ యాక్సెస్ 28 రోజుల పాటు ఉచితంగా ఇచ్చేవారు. అయితే ఈ ప్లాన్‌ను కూడా జియో ఇటీవలే తొలగించింది. ఇప్పుడు వినియోగదారులు ఎక్కువగా రీ చార్జ్ చేసుకునే రూ.249 ప్లాన్‌కు జియో, ఎయిర్‌టెల్ రెండూ కలిపి గుడ్‌బై చెప్పాయి. ఈ నిర్ణయం వల్ల తక్కువ ఖర్చుతో రోజువారీ డేటా చూసుకునే వారు ఇబ్బంది పడుతున్నారు. వినియోగదారులు ఎక్కువగా వాడే ప్లాన్‌లు ఒకదాని తర్వాత ఒకటి మాయం అవుతున్నాయి. ఇప్పుడు రీచార్జ్ చేసుకోవాలంటే కనీసం రూ.299 ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. దీంతో సోషల్ మీడియాలో యూజర్లు ఎయిర్‌టెల్, జియోపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.