BigTV English

SSMB29: దట్టమైన అడవుల్లో, క్రూర మృగాల మధ్య షూటింగ్ చేస్తున్న రాజమౌళి

SSMB29: దట్టమైన అడవుల్లో, క్రూర మృగాల మధ్య షూటింగ్ చేస్తున్న రాజమౌళి

SSMB29: త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రాజమౌళి రేంజ్ విపరీతంగా మారిపోయింది. అలానే రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. త్రిబుల్ ఆర్ సినిమా ఆ స్థాయిలో హిట్ అవడం వలన రాజమౌళి నుంచి రాబోయే తదుపరి సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు.


ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా రాజమౌళి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దీనికి కారణం మహేష్ బాబు మొదటిసారి పాన్ ఇండియా సినిమా చేయడం. ఇప్పటివరకు మహేష్ బాబు తెలుగు తమిళ్ తప్ప మరో లాంగ్వేజ్ లో సినిమా చేయలేదు. అప్పట్లో బాలీవుడ్ లో సినిమా చేస్తారా అని అడిగినప్పుడు మహేష్ కూడా ముందు తెలుగులో చేయాల్సినవి చాలా ఉన్నాయంటే చెప్పారు.

దట్టమైన అడవుల్లో 


రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది. ఈ సినిమాకు సంబంధించి సౌత్ఆఫ్రికాలో ఒక పాటతో పాటు ఫైట్ కూడా షూట్ చేయనున్నారు. సౌత్ ఆఫ్రికా లోని దట్టమైన అడవుల్లో, క్రూర మృగాల మధ్య ఒక చేజ్ సీన్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. RRR లో ఇంట్రవెల్ బ్యాంగ్ ని మించిన యాక్షన్ ఎపిసోడ్ రాజమౌళి సిద్ధం చేస్తున్నట్లు విశ్వసినీయ వర్గాల నుంచి సమాచారం వినిపిస్తుంది. రాజమౌళి మేకింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో తన సినిమాలు ఇదివరకే ప్రూవ్ చేశాయి. ఒక్క ఫ్రేమ్ కూడా రాజమౌళి కాంప్రమైజ్ కారు. అందుకే రాజమౌళిని జక్కన్న అని పిలుస్తారు.

మహేష్ పర్ఫెక్ట్ టైమింగ్ 

తెలుగు రాష్ట్రాల్లో మహేష్ బాబు కి ఏ రేంజ్ క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కేవలం మహేష్ బాబు తెలుగుకు మాత్రమే పరిమితం అయిపోతున్నాడు అని ఒక అసంతృప్తి అభిమానులకు ఉండేది. ఇప్పుడు రాజమౌళి సినిమాతో అది పోతుంది. మహేష్ బాబు టాలెంట్ ఏంటో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు తెలుస్తుంది. అందరిలా తొందర పడిపోకుండా కరెక్ట్ టైం లో పాన్ ఇండియా సినిమా లీగ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. మొత్తానికి ఈ సినిమా రావడానికి ఇంకో రెండేళ్లు టైం పడుతుంది. అంతకుమించి పట్టిన ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. అయితే ఈ సినిమాలో మాత్రం మహేష్ బాబు ఇదివరకు ఎన్నడు కనిపించని విధంగా కనిపిస్తున్నారు. రీసెంట్గా కార్తికేయ రిలీజ్ చేసిన ఫోటో మరింత హైప్ క్రియేట్ చేసింది.

Also Read: Undertaker – Bigg Boss 19: హిందీ బిగ్ బాస్ లో బిగ్గెస్ట్ ట్విస్ట్… హౌజ్ లోకి ది అండర్ టేకర్

Related News

SSMB29 : SSMB29 రిలీజ్ డేట్ ఫిక్స్, మహేష్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి

OG Movie: షూటింగ్ డిలే… పవన్ కళ్యాణ్ మూవీ వాయిదా?

Pradeep Ranganathan: సినీ చరిత్రలోనే ఫస్ట్‌టైం.. ఒకే హీరో.. ఒకే రోజు.. రెండు సినిమాలు రిలీజ్!

Chiru Odela Movie : జీవితకాలం ఆడే సినిమా చిరంజీవి… ఏం ఎలివేషన్ ఇచ్చావ్ అయ్యా

Mega158 : పోస్టర్ లోనే విధ్వంసం, భారీ యాక్షన్ ప్లాన్ చేసిన బాబీ

Big Stories

×