BigTV English
Advertisement

Balineni Srinivasa Reddy: వైసీపీకి బాలినేని గుడ్ బై.? ఆ పార్టీలోకి జంప్..?

Balineni Srinivasa Reddy: వైసీపీకి బాలినేని గుడ్ బై.? ఆ పార్టీలోకి  జంప్..?

వైసీపీ అధినేత జగన్, ఆయన బంధువు సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య పూడ్చలేని గ్యాప్ ఏర్పడినట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు నుంచే బాలినేని జగన్ కి షాక్ ఇస్తారని టాక్ నడిచినప్పటికీ.. జగన్ బుజ్జగింపులతో కొనసాగుతూ వచ్చారు. గడిచిన ఎన్నికల్లో సైతం.. జగన్ తనదైన లెక్కలతో మాగుంటకు ఒంగోలు ఎంపీ అభ్యర్ధిగా టికెట్ ఇవ్వకుండా.. చిత్తూరు జిల్లా నుంచి చెవిరెడ్డిని తీసుకొచ్చి పోటీ చేయించారు. దాన్ని మొదట్లో బాలినేని తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ.. చివరికి జగన్ నిర్ణయానికి తలొగ్గక తప్పలేదు.. అదీ కాక సీనియర్ అయిన బాలినేని మంత్రి పదవిని రెండున్నరేళ్లకే తీసేసారు జగన్. ఈ వ్యవహారాలన్నీ బాలినేనిని బాగా ఇబ్బంది పెట్టాయి.

బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీచేశారు. అయితే టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్ధన్‌రావు.. చేతిలో బాలినేని శ్రీనివాసరెడ్డి 34 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయంగా మౌనంగా ఉంటూ వస్తున్నారు. ఇదే సమయంలో ఆయన జనసేనలోకి వెళ్తున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే ఓసారి విలేకర్ల సమావేశం నిర్వహించి బాలినేని శ్రీనివాసరెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. అలాగే ఒంగోలు వైసీపీ అధ్యక్ష పదవి సైతం స్థానికులకే ఇవ్వాలంటూ అప్పట్లో డిమాండ్ చేశారు.


పార్టీ తనను పట్టించుకోవడం లేదంటూ బాలినేని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ముగిసినప్పటి నుంచి తాను వైసీపీకి దూరంగా ఉన్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లపై తాను చేస్తున్న పోరాటాన్ని వైసీపీ అధిష్టానం పట్టించుకోవడం లేదంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏదైనా చెబుదామంటే పార్టీలో ఎవరూ వినే పరిస్థితి లేదన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి. వైసీపీ పట్టించుకున్నా.. లేకపోయినా ప్రజల కోసం తన పోరాటం ఆపనని బాలినేని స్పష్టం చేశారు.

Also Read: విజయవాడ వరదలు.. టీవీ ఛానెళ్లపై సీఎం ఆగ్రహం.. జగన్ బాణం రివర్స్

వైసీపీ ఓటమి పాలయ్యాక నేతలంతా ఒక్కొక్కరు తమ దారి చూసుకుంటున్నారు. ఒంగోలు వైసీపీ లీడర్లు సైతం కూటమి పార్టీలో చేరిపోతున్నారు. జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న బాలినేని జిల్లాకు దూరంగా ఉండటంతో పలువురు కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. అందుకే భిన్నమైన వ్యూహాలతో రాజకీయం చేస్తున్నారు. తనకు ప్రాధాన్యత లేకపోతే ఎవరూ పార్టీలో ఉండరని బహిరంగంగానే ఇన్ డైరెక్ట్ గా సంకేతాలు ఇస్తూనే వస్తున్నారు. కానీ జగన్ వైపు నుంచి స్పందన రాకపోవడంతో.. ఇప్పుడు బాలినేని చూపు సైకిల్ వైపు మళ్లిందని జోరుగా చర్చ జరుగుతోంది.

కొద్ది రోజుల క్రితం బాలినేని శ్రీనివాసరెడ్డిపై సీఎం చంద్రబాబుకు ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ ఫిర్యాదు చేశారు. ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని చేసిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ వ్యవహారం పొలిటికల్ వర్గాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబుకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి లేఖ రాశారు. తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేయించాలని కోరారు. ఒకసారి అవకాశం ఇస్తే చంద్రబాబును కలిసి చాలా నిజాలు చెబుతానంటూ లేఖలో స్పష్టం చేశారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు చట్ట విరుద్ధమైన పనులు చేయలేదని.. ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు రియాజ్ ఆరోపణల్లో నిజం లేదని లెటర్ లో రాసుకొచ్చారు.

ఇప్పుడున్నపరిస్థితుల్లో బాలినేనికి చంద్రబాబు కలిసే ఛాన్స్ ఇస్తారా ? అదే జరిగితే పొలిటికల్ సీన్ మారిపోతుందని టాక్ మొదలైంది. జగన్ పై గుర్రుగా ఉన్న బాలినేని సైకిల్ గూటికి చేరితే వైసీపీ పరిస్థితి ఏంటన్న సంగతిపై చర్చ జరుగుతోంది.

Related News

CM Progress Report: నిరుద్యోగులకు శుభవార్త.. ప్రతి నెల జాబ్ మేళాలు..

Jogi Ramesh: కల్తీ మద్యం కేసులో జోగి రమేష్‌కు రిమాండ్.. విజయవాడ సబ్ జైలుకు తరలింపు

YS Jagan: ఈ నెల 4న తుపాను బాధిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటన.. రైతులకు పరామర్శ

CM Chandra Babu: పార్టీ పరువు తీస్తున్నారు.. సొంత పార్టీ నేతలపై చంద్రబాబు సీరియస్

AP Weather: నవంబర్ 4నాటికి మరో అల్పపీడనం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

Vegetables Rates: మొంథా తుపాను ఎఫెక్ట్.. భారీగా పెరిగిన కూరగాయల ధరలు.. వినియోగదారుల జేబుకు చిల్లు

Buddha Venkanna: లిక్కర్ కేసులో జగన్‌తో లింక్స్ .. బుద్దా వెంకన్న సంచలనం

Fake Liquor Case: అరెస్ట్‌పై జోగి రమేష్ భార్య శకుంతల రియాక్షన్.. అరెస్టుకు ముందు ఇదే జరిగింది?

Big Stories

×