iPhone Price Drops: ఐఫోన్ కొనడం చాలా మందికి ఒక కల. కానీ ధరలు ఎక్కువగా ఉండటంతో దీనిని కొనేందుకు సాహసించరు, చూసి ఆనందం పొందుతారు, అదే నేత్రానందం అన్నమాట. ఇలాంటి వారు ఎప్పుడైనా మంచి డిస్కౌంట్ దొరికితే వెంటనే కొనాలన్న ఉత్సాహం చూపిస్తారు. ఇప్పుడు అలాంటి వారికోసం అద్భుతమైన ఆఫర్ వచ్చేసింది. ఐఫోన్ 17 మార్కెట్‌లోకి రాక ముందే ఐ ఫోన్ 15 ధర భారీగా తగ్గింది. ఇప్పుడు ఈ ఫోన్‌ను కేవలం రూ.32,780కే పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐ ఫోన్ 14 వాడుతున్నవారికి ఇది అద్భుతమైన డీల్ అని చెప్పొచ్చు.
ఐ ఫోన్ 15 ధర ఎలా తగ్గింది?
అమెజాన్‌లో ప్రస్తుతం ఐ ఫోన్ 15 (128జీబీ బ్లాక్) ధర రూ.79,900. కానీ మొదట 12 శాతం తగ్గింపు ఇచ్చి దానిని రూ.61,400కి విక్రయిస్తున్నారు. అంతే కాదు, మీ వద్ద ఉన్న పాత ఐ ఫోన్ 14ని ఎక్స్ఛేంజ్ చేస్తే, సుమారు రూ.25,550 వరకు అదనపు తగ్గింపు వస్తుంది. దాంతో ఐ ఫోన్ 15 ధర రూ.35,850కి తగ్గిపోతుంది. అంతేకాదు అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే ఇంకో రూ.3,070 తగ్గింపు వస్తుంది. ఈ అన్ని ఆఫర్లను కలిపితే చివరికి ఐ ఫోన్ 15ని కేవలం రూ.32,780కి పొందవచ్చు. అయితే ఈ ఆఫర్‌ను పొందడానికి ఎక్స్ఛేంజ్ ఫోన్ ఇస్తున్నప్పుడు ఎటువంటి డ్యామేజ్ ఉండకూడదు. అలాగే క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ షరతులను ముందుగానే తనిఖీ చేసుకోవడం మంచిది.
ఐఫోన్ 15 డిస్ ప్లే, డిజైన్, కెమెరా ఎలా ఉందంటే..
ఐఫోన్ 15లో 6.1 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. ఇది పింక్, పసుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు ఇలా ఐదు రంగుల్లో అందుబాటులో ఉంది. డిజైన్ పెద్దగా మారకపోయినా, ఇందులో కొత్తగా ఇచ్చిన డైనమిక్ ఐలాండ్ నాచ్ ఈ ఫోన్‌కి ప్రత్యేక ఆకర్షణ. ఈ ఫీచర్ మొదట ఐ ఫోన్ 14 ప్రోలో మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు ఐఫోన్15లో కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌లోని ముఖ్యమైన అప్‌గ్రేడ్ కెమెరా, ఇందులో 48MP ప్రైమరీ కెమెరా సెన్సార్ ఉంది. పగలు, రాత్రి, తక్కువ లైట్, బ్యాక్‌గ్రౌండ్‌ను బ్లర్ చేసి (పోర్ట్రెయిట్) ఏ సందర్భంలో నైనా అద్భుతమైన ఫొటోలు తీస్తుంది. ఐఫోన్ 14తో పోలిస్తే ఫోటో మరింత అందంగా ఉంది.
బ్యాటరీ, పనితీరు, ఛార్జింగ్ పోర్ట్
ఒకసారి ఛార్జ్ చేస్తే రోజంతా సులభంగా బ్యాటరీ ఉంటుంది. ఇందులో A16 బయోనిక్ చిప్ ఉంది. ఇది ఐఫోన్ 14లోని A15 చిప్ కంటే వేగంగా, సమర్థవంతంగా పనిచేస్తుంది. గేమింగ్, వీడియో స్ట్రీమింగ్, మల్టీటాస్కింగ్ లాంటి పనులు ఆలస్యం లేకుండా జరుగుతాయి. ముఖ్యంగా, ఈ ఫోన్‌లో పాత లైట్నింగ్ పోర్ట్ తొలగించి, యూఎస్‌బి టైప్-పి పోర్ట్ అందించారు. దీని వలన ఛార్జింగ్, డేటా ట్రాన్స్‌ఫర్ మరింత వేగంగా, సౌకర్యవంతంగా ఉంది. మొత్తం మీద ఐఫోన్ 15 ధరలు పడిపోవడం, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు కలిపి చూస్తే, రూ.32,780కి ఐఫోన్ 15 దొరకడం నిజంగా గొప్ప అవకాశం. ఐఫోన్ 14 నుండి అప్‌గ్రేడ్ కావాలనుకునే వారికి ఇది మిస్సవ్వకూడని డీల్ అని చెప్పవచ్చు.