BigTV English

Redmi Note 15 Pro+: రెడ్‌మీ నోట్ 15 ప్రో సిరీస్ లాంచ్.. భారీ బ్యాటరీ, 90W చార్జింగ్ లాంటి సూపర్ ఫీచర్లు

Redmi Note 15 Pro+: రెడ్‌మీ నోట్ 15 ప్రో సిరీస్ లాంచ్.. భారీ బ్యాటరీ, 90W చార్జింగ్ లాంటి సూపర్ ఫీచర్లు

Redmi Note 15 Pro+| షావోమీ కంపెనీ చైనాలో రెడ్‌మీ నోట్ 15 ప్రో+, రెడ్‌మీ నోట్ 15 ప్రో స్మార్ట్‌ఫోన్‌లను గురువారం విడుదల చేసింది. ఈ కొత్త సిరీస్‌లో 7,000mAh బ్యాటరీ ఉంది. ఇది 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 22.5W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. రెడ్‌మీ నోట్ 15 ప్రో+లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జనరేషన్ 4 చిప్ ఉండగా.. నోట్ 15 ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా చిప్‌సెట్ ఉంది. ఈ రెండు ఫోన్‌లు IP68 రేటింగ్‌తో వాటర్, డస్ట్ రెజిస్టెన్స్ ఫీచర్ కలిగి ఉంది.


ధరలు, రంగులు

రెడ్‌మీ నోట్ 15 ప్రో+ ధర 12GB + 256GB మోడల్‌కు 1,899 యువాన్ (భారత కరెన్సీలో సుమారు రూ. 23,000), 12GB + 512GB మోడల్‌కు 2,099 యువాన్ (సుమారు రూ. 25,000), మరియు 16GB + 512GB మోడల్‌కు 2,299 యువాన్ (సుమారు రూ. 28,000). ఇది సీడార్ వైట్, మిడ్‌నైట్ బ్లాక్, స్కై బ్లూ, స్మోకీ పర్పుల్ రంగుల్లో లభిస్తుంది.

రెడ్‌మీ నోట్ 15 ప్రో ధర 8GB + 256GB మోడల్‌కు 1,399 యువాన్ (సుమారు రూ. 17,000), 12GB + 256GB మోడల్‌కు 1,599 యువాన్ (సుమారు రూ. 20,000), మరియు 12GB + 512GB మోడల్‌కు 1,799 యువాన్ (సుమారు రూ. 22,000). ఇది సీడార్ వైట్, క్లౌడ్ పర్పుల్, మిడ్‌నైట్ బ్లాక్, స్కై బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంది.


రెడ్‌మీ నోట్ 15 ప్రో+ స్పెసిఫికేషన్‌లు

రెడ్‌మీ నోట్ 15 ప్రో+ డ్యూయల్ సిమ్ (నానో) సపోర్ట్‌తో ఆండ్రాయిడ్ 15 ఆధారిత హైపర్‌ఓఎస్ 2 ఇంటర్‌ఫేస్‌పై నడుస్తుంది. ఇందులో 6.83 అంగుళాల మైక్రో-కర్వ్డ్ డిస్‌ప్లే ఉంది, ఇది 1.5K రిజల్యూషన్ (1,280×2,772 పిక్సెల్స్), 120Hz రిఫ్రెష్ రేట్, 480Hz టచ్ శాంప్లింగ్ రేట్, 3,200 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. డిస్‌ప్లే షియోమీ డ్రాగన్ క్రిస్టల్ గ్లాస్ ప్రొటెక్షన్‌తో వస్తుంది.

ఈ ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జనరేషన్ 4 చిప్ ఉంది. ఇది 16GB LPDDR4X ర్యామ్, 512GB UFS2.2 స్టోరేజ్‌తో జత చేయబడింది. కెమెరా విషయానికొస్తే.. ఇందులో 50-మెగాపిక్సెల్ లైట్ ఫ్యూజన్ 800 సెన్సార్, 50-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

ఈ ఫోన్ ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, 5G, వై-ఫై 6, NFC, బ్లూటూత్ 5.4, GPS, గెలీలియో, గ్లోనాస్, బీడౌ, USB టైప్-C పోర్ట్‌ను కలిగి ఉంది. ఇది 7,000mAh బ్యాటరీతో 90W ఫాస్ట్ ఛార్జింగ్, 22.5W రివర్స్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. షావోమీ సర్జ్ P3 ఛార్జింగ్ చిప్, సర్జ్ G1 ఫ్యూయల్ గేజ్ చిప్‌లు ఉన్నాయి. సాటిలైట్ మెసేజింగ్ ఎడిషన్ సెల్యులార్ నెట్‌వర్క్ లేకుండా బీడౌ శాటిలైట్ ఆధారిత ఎమర్జెన్సీ మెసేజింగ్‌ను అనుమతిస్తుంది.

రెడ్‌మీ నోట్ 15 ప్రో స్పెసిఫికేషన్‌లు

రెడ్‌మీ నోట్ 15 ప్రో కూడా అదే సిమ్, సాఫ్ట్‌వేర్, డిస్‌ప్లే, ర్యామ్, స్టోరేజ్. IP68 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా చిప్‌పై నడుస్తుంది. దీని రియర్ కెమెరా సెటప్‌లో 50-మెగాపిక్సెల్ సోనీ LYT-600 సెన్సార్, 8-మెగాపిక్సెల్ సోనీ IMX355 అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 20-మెగాపిక్సెల్‌తో వస్తుంది. ఇది 7,000mAh బ్యాటరీతో 45W ఫాస్ట్ ఛార్జింగ్, 22.5W రివర్స్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

Related News

Vivo Vision Explorer: ఆపిల్ విజన్ ప్రోకు పోటీగా వివో విజన్ ఎక్స్‌ప్లోరర్.. 8K మిక్స్‌డ్ రియాలిటీ హెడ్‌సెట్ లాంచ్

Dinosaur Eggs: అంగారక గ్రహంపై ‘డైనోసార్ ఎగ్స్’.. ఒకప్పుడు అక్కడ జీవులు మనగడ ఉండేదా?

Google Pixel 9 vs Pixel 10: పిక్సెల్ 10 కంటే పిక్సిల్ 9 బెటర్.. ఎందుకంటే?

Grok Imagine AI: ఇప్పుడు ఏఐ వీడియో, ఇమేజ్‌‌లు చేయడం అంతా ఫ్రీ.. అందరికీ అందుబాటులో గ్రోక్ ఇమేజిన్

Lava Play Ultra 5G: కేవలం రూ.14999కే సూపర్ గేమింగ్ ఫోన్.. 64MP కెమెరా, భారీ బ్యాటరీతో లాంచ్

Big Stories

×