BigTV English

OTT Movie: ఒకే ఇంటికి దత్తతకు వెళ్లి.. అలాంటి పనులు చేసే జంట.. చివరికి ఊహించని ట్విస్ట్

OTT Movie: ఒకే ఇంటికి దత్తతకు వెళ్లి.. అలాంటి పనులు చేసే జంట.. చివరికి ఊహించని ట్విస్ట్

OTT Movie: ఒక అందమైన నవలకు దృశ్యరూపం ఇస్తే.. ఈ సినిమాలాగే ఉంటుంది. పెద్దల సీన్స్ ఉన్నంత మాత్రాన్ని ఇది చూడకూడని సినిమా అయిపోదు. మాంచి రొమాన్స్, భావోద్వేగాలను ఎంజాయ్ చేయాలి అనుకుంటే.. ఈ ఇటాలియన్ మూవీ ‘ది టియర్‌స్మిత్’ (The Tearsmith) చూడండి. మీకు ఇది తప్పకుండా నచ్చేస్తుంది. కానీ, ఒంటరిగా చూడండి. 2024లో విడుదలైన ఈ టీన్ రొమాన్స్ చిత్రాన్ని ఎరిన్ డూమ్ రాసిన బెస్ట్‌సెల్లింగ్ నవల ఆధారంగా రూపొందించారు. అలెస్సాండ్రో జెనోవేసి దర్శకత్వం వహించాడు.


ఇదీ కథ..

ఈ కథ నీకా అనే 8 ఏళ్ల బాలికతో మొదలవుతుంది. ఆమె తల్లిదండ్రులు కారు ప్రమాదంలో చనిపోవడంతో సన్నీక్రీక్ అనే అనాథాశ్రమంలో చేరుతుంది. ఈ ఆశ్రమాన్ని ‘ది గ్రేవ్’ అని కూడా పిలుస్తారు. దీన్ని నడుపుతున్న హెడ్‌మిస్ట్రెస్ మార్గరెట్ చాలా క్రూరమైనది. ఈ ఆశ్రమంలో నీకా శారీరక, భావోద్వేగపరమైన హింసను ఎదుర్కొంటుంది. ఇతర పిల్లలది కూడా అదే పరిస్థితి. కానీ రిగెల్ అనే అబ్బాయిని మాత్రం మార్గరెట్‌ చాలా బాగా చూసుకుంటుంది. అతడిని ఎట్టి పరిస్థితుల్లో హింసించదు. దానివల్ల ఆశ్రమంలో పిల్లలు.. అతడిని దూరం పెడతారు. కానీ, నీకాకు మాత్రం అతడు అంటే ఇష్టం. ఓ సందర్భంలో మార్గరెట్ దృష్టిని మరల్చి నీకాను శిక్ష నుండి కాపాడతాడు రిగెల్.


యుక్తవయస్సులో.. ఒకే ఇంటికి దత్తత

నీకా (కాటెరినా ఫెరియోలి), రిగెల్ (సిమోన్ బాల్డస్సెరోని)లకు యుక్త వయస్సు వస్తుంది. అన్నా, నార్మన్ మిల్లిగాన్ అనే దంపతులు నీకాను దత్తత తీసుకుంటారు. అదే సమయంలో రిగెల్ పియానో వాయిస్తాడు. దీంతో వారికి చనిపోయిన తమ కొడుకు గుర్తుకు వస్తాడు. దీంతో వారు రిగెల్‌ను కూడా దత్తత తీసుకుంటామని చెబుతారు. అలా వారు ఇద్దరు వారి ఇంటికి వెళ్తారు. అయితే, రిగెల్‌కు నీకాపై ప్రేమ ఉంటుంది. కానీ, ఆమె దగ్గరకు వస్తే తనని తాను కంట్రోల్ చేసుకోలేడు. అందుకే.. ఆమెతో శత్రువులా వ్యవహరిస్తాడు. తన దగ్గరకు రావద్దని హెచ్చరిస్తాడు.

స్కూల్లోనూ ట్రయాంగిల్ లవ్..

కొత్త స్కూల్‌లో కూడా రిగెల్ ఆమెకు దూరంగా ఉంటాడు. తోటి విద్యార్థులు ఆమెను ఆట పట్టిస్తున్నా పట్టించుకోడు. అయితే లియోనెల్ అనే విద్యార్థికి నీకాపై క్రష్ ఉంటుంది. అప్పుడే రిగెల్‌లో ఉన్న ప్రేమికుడు బయటకు వస్తాడు. అయితే, స్కూల్లో అంతా వారిని అన్నా చెల్లెళ్లు అనుకుంటారు. దీంతో రిగెల్ ప్రేమను బయట పెట్టలేకపోతాడు. కథ కాస్తా ట్రయాంగిల్ లవ్ ట్రాక్ పడుతుంది. నీకాకు తనంటే ఇష్టమనే భావంతో ఉంటాడు లియోనెల్. ఓ రోజు స్కూల్ పార్టీలో నీకాను బలవంతం చేయబోతాడు లియోనెల్.

అప్పుడు రిగెల్ అక్కడికి వచ్చి ఆమెను రక్షిస్తాడు. ఆ క్రమంలో ఇద్దరూ శరీరకంగా ఒక్కటవ్వుతారు. అలా వారి మధ్య బంధం బలపడుతుంది. అయితే, అన్నచెల్లెళ్లు ప్రేమించుకుంటున్నారనే విషయాన్ని స్కూల్‌లో చెప్పేస్తానని బెదిరిస్తాడు లియోనెల్.. ఆ తర్వాత వారిని కారుతో గుద్ది చంపాలని చూస్తాడు. అతడి నుంచి తప్పించుకోడానికి రిగెల్, నికాలు వంతెన మీద నుంచి నదిలోకి దూకుతారు. మరి ఆ తర్వాత ఏమవుతుంది? కథ ఎలాంటి మలుపు తిరుగుతుందో తెలియాలి అంటే తప్పకుండా ఈ మూవీని చూడాలి. ప్రస్తుతం ఈ మూవీ Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఇటాలియన్ మూవీ. ఇంగ్లీష్ డబ్బింగ్, సబ్ టైటిల్స్‌తో చూడవచ్చు.

Related News

OTT Movie : డెడ్ బాడీ తలలో క్యాప్సిల్… హింట్ ఇచ్చి మరీ చంపే కిల్లర్… నిమిషానికో ట్విస్ట్ మావా

OTT Movie : భార్య పక్కనుండగా మరో అమ్మాయితో… తండ్రి కళ్ళ ముందే ఆ పని… అవార్డుల పంట పండేంతగా ఏముందంటే?

OTT Movie : ఆన్లైన్ లో రీసెల్లింగ్… అర్ధరాత్రి వింత సంఘటనలు… మాస్క్ మ్యాన్ మిస్టరీతో మతిపోగోట్టే సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : వృద్ధాప్యంలో వింత కోరికలు… ఈ గ్రాండ్ మా గారడీ యమా కామెడీ గురూ… 20 ఏళ్ల తరువాత వచ్చిన సీక్వెల్

OTT Movie : ఓటీటీలో స్పైన్ చిల్లింగ్ రియల్ స్టోరీ… ఒక్కో సీన్ కు తడిచిపోవాల్సిందే… సింగిల్ గా చూసే దమ్ముందా ?

Kotha Lokah OTT: ‘కొత్త లోక’ ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Janhvi kapoor: ఓటీటీలోకి జాన్వీ కపూర్ కొత్త మూవీ.. ట్విస్ట్ ఏంటంటే?

OTT Movie : భార్య ఉండగా ఇదెక్కడి దిక్కుమాలిన పని… మొగుడు మగాడే కాదని తెలిస్తే… సింగిల్ గా చూడాల్సిన మూవీ మావా

Big Stories

×