Smartphone Comparison| మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ల జాబితాలో ఇటీవలే విడుదలైన వివో T4 ప్రో, రియల్‌మీ 15 హల్ చల్ చేస్తున్నాయి. ఈ రెండు ఫోన్లకు ఇప్పటికే ట్రెండింగ్ లో ఉన్న Nothing Phone 3a గట్టి పోటీనిస్తోంది. ఈ మూడు ఫోన్‌లు ప్రత్యేక ఫీచర్లతో ₹30,000 బడ్జెట్‌లో పవర్, స్టైల్ ని అందిస్తున్నాయి. ధర, డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ వంటి అంశాలను సరిపోల్చి, మీకు సరిపడే ఫోన్‌ను ఎంచుకోండి.
ధర, స్టోరేజ్
Vivo T4 Pro 8GB+128GB వేరియంట్ ధర ₹27,999 నుండి ప్రారంభమవుతుంది. 8GB+256GB ధర ₹29,999, 12GB+256GB ధర ₹31,999. Realme 15 5G ధర 8GB+128GB కోసం ₹25,999, 8GB+256GB ధర ₹27,999, 12GB+256GB ₹30,999. Nothing Phone 3a 8GB+128GB ₹24,999 నుండి ప్రారంభమవుతుంది, 8GB+256GB ₹26,999. మూడు ఫోన్లలో Nothing Phone 3a అత్యంత సరసమైన ఎంపిక.
డిస్‌ప్లే స్పెసిఫికేషన్లు
Vivo T4 Proలో 6.77-ఇంచ్ FHD+ AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 5000 నిట్స్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. Realme 15 5Gలో 6.8-ఇంచ్ FHD+ AMOLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 6500 నిట్స్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. ఇది అత్యంత ప్రకాశవంతమైన డిస్‌ప్లే. Nothing Phone 3aలో 6.77-ఇంచ్ FHD+ AMOLED డిస్‌ప్లే, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. Realme డిస్‌ప్లే స్మూత్, బ్రైట్ అనుభవం ఇస్తుంది.
ప్రాసెసింగ్ పవర్
Vivo T4 Proలో Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ సాఫీగా పనిచేస్తుంది. Realme 15 5Gలో MediaTek Dimensity 7300 Energy ప్రాసెసర్ సమర్థవంతంగా పనులను నిర్వహిస్తుంది. Nothing Phone 3aలో Snapdragon 7s Gen 3 ప్రాసెసర్ మంచి వేగాన్ని అందిస్తుంది. మూడూ రోజువారీ పనులకు, గేమింగ్‌కు అనుకూలం.
ఆపరేటింగ్ సిస్టమ్
Vivo T4 Pro Funtouch OS 15తో Android 15ని, Realme 15 5G Realme UI 6.0తో Android 15ని, Nothing Phone 3a Nothing OS 3.1తో Android 15ని ఉపయోగిస్తాయి. అన్నీ ఆధునిక సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ ని అందిస్తాయి.
కెమెరా సామర్థ్యాలు
Vivo T4 Proలో 50MP మెయిన్ కెమెరా (OIS), 50MP టెలిఫోటో, 2MP డెప్త్ కెమెరా ఉన్నాయి. Realme 15 5Gలో 50MP మెయిన్ కెమెరా (OIS), 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. Nothing Phone 3aలో 50MP మెయిన్, 50MP టెలిఫోటో, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. వివో, నథింగ్ టెలిఫోటో లెన్స్‌లతో జూమ్‌లో మెరుగ్గా ఉన్నాయి.
ఫ్రంట్ కెమెరా
వివో T4 ప్రో, Nothing Phone 3aలో 32MP సెల్ఫీ కెమెరా, Realme 15 5Gలో 50MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. Realme సెల్ఫీలు, వీడియో కాల్స్‌లో అద్భుతంగా పనిచేస్తుంది.
బ్యాటరీ, ఛార్జింగ్
Vivo T4 Proలో 6500mAh బ్యాటరీ, 90W ఛార్జింగ్ ఉన్నాయి. Realme 15 5Gలో 7000mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్ ఉన్నాయి. Nothing Phone 3aలో 5000mAh బ్యాటరీ, 50W ఛార్జింగ్ ఉన్నాయి. బ్యాటరీ సామర్థ్యంలో Realme ముందుంది, ఛార్జింగ్ వేగంలో వివో గెలుస్తుంది.
కనెక్టివిటీ
మూడు ఫోన్‌లు 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6, Bluetooth 5.4, GPS, USB-C పోర్ట్‌లను సపోర్ట్ చేస్తాయి. Nothing Phone 3a అదనంగా NFCని అందిస్తుంది, ఇది కాంటాక్ట్‌లెస్ చెల్లింపులకు ఉపయోగపడుతుంది.
ఏది కొనాలి?
మంచి బ్రైట్ డిస్‌ప్లే కావాలంటే Realme 15 5G బెస్ట్. కెమెరా వైవిధ్యం కోసం Vivo T4 Pro ఎంచుకోండి. ₹27,000 కంటే తక్కువ బడ్జెట్‌లో Nothing Phone 3a సరైన ఆప్షన్. మీ అవసరాలను బట్టి ఎంచుకోండి.
Also Read: డ్రైవింగ్ చేస్తూ నిద్రపోయిన యువతి.. కారు ప్రమాదంలో ప్రాణాలు కాపాడిన ఐఫోన్